SRI SURYA Ayurvedic Clinic , Vijayawada
Sri Surya Clinic provides the best of ayurvedic healthcare Services in Vijayawada
*A 1-Litre Bottle Of Water Contains Some 2,40,000 Plastic Fragments: Study* 😱😱😱😱😱
https://www.ndtv.com/world-news/a-1-litre-bottle-of-water-contains-some-2-40-000-plastic-fragments-study-4827396
Please don't use plastic bottles.
A 1-Litre Bottle Of Water Contains Some 2,40,000 Plastic Fragments: Study A typical one-liter (33-ounce) bottle of water contains some 240,000 plastic fragments on average, according to a new study.
Easy way to stay healthy _Health is the choice you make.. First understand your body composition and accordingly if you maintain your eating practices and activities you can make or maintain your health easily..
ఆరోగ్యానికి శాకాహారమే మంచిది.
మాంసాహారం వలన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.
శరీరం నిండా బ్యాక్టిరియా కొనుక్కున్నట్లే.
సాత్విక శాఖాహారం పై ప్రజలలో చైతన్యం కలగచేయాలి
*ట్రోపోనిన్ అంటే ఏమిటి?*
ట్రోపోనిన్ నిజానికి గుండె కండరాలలో ఉండే ఒక రకమైన ప్రోటీన్.
సాధారణ స్థితిలో, ట్రోపోనిన్ మీ గుండె కండరాల కణాలలో ఉంటుంది. కానీ ఆ కణాలు దెబ్బతిన్నప్పుడు, ట్రోపోనిన్ మీ రక్తంలోకి లీక్ అవుతుంది ( విడుదల చేయబడుతుంది).
సాధారణ స్థితిలో, రక్తంలో ట్రోపోనిన్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి ట్రోపోనిన్ పరీక్షలలో దానిని కనుగొనలేము. కానీ , గుండెకు గాయమైనప్పుడు, లేదా గుండెపోటు వచ్చినప్పుడు, ట్రోపోనిన్ రక్తంలోకి విడుదలవుతుంది.
ట్రోపోనిన్ పరీక్ష ఉపయోగాలు
ట్రోపోనిన్ స్థాయిలలోని చిన్న మార్పులు కూడా గుండె దెబ్బతిన్నదా లేదా అనే విషయాన్ని వెల్లడిస్తాయి. ఒక వ్యక్తి ట్రోపోనిన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, వారు ఇటీవల గుండెపోటుతో బాధపడుతున్నారని అర్థం.
ట్రోపోనిన్ పరీక్ష ఎప్పుడు చేయించాలి
ఇసిజి పరీక్షల ఫలితాలు సందేహాస్పదంగా ఉన్నట్లయితే లేదా మీకు అస్పష్టమైన లక్షణాలు ఉన్నప్పుడు ట్రోపోనిన్ పరీక్ష ఉపయోగపడుతుంది. రక్తంలో ట్రోపోనిన్ స్థాయిలు సాధారణంగా చాలా తక్కువగా ఉంటాయి, కానీ, గుండెకు గాయమైతే, ఆ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి.
మీ శరీరంలో కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తే, ఖచ్చితంగా ట్రోపోనిన్ T టెస్ట్ చేయించుకోండి.
ఇందులో కొన్ని ఇక్కడ చెబుతున్నాము
ఛాతీ నొప్పి
ఎడమచేతి నొప్పి
ఊపిరి ఆడకపోవడం / ఆయాసం రావడం / శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
తల తిరగడం / మూర్ఛ
గొంతు నొప్పి
దవడ నొప్పి
విశ్రాంతి లేకపోవడం
అధిక చెమట
వాంతులు
అధిక అలసట
ట్రోపోనిన్ సాధారణ స్థాయి
వేర్వేరు ల్యాబ్‌లు “సాధారణ” ట్రోపోనిన్ స్థాయిలకు వేర్వేరు పరిధులను కలిగి ఉంటాయి. కాబట్టి పరీక్షను ఆదేశించిన వైద్యుడితో ఫలితాలను చర్చించడం ఉత్తమం.
రక్తంలో ఉన్న ట్రోపోనిన్ మొత్తాన్ని క్లినికల్ సెట్టింగ్‌లో మిల్లీలీటర్‌కు నానోగ్రామ్‌ల పరంగా కొలుస్తారు. ఆరోగ్యకరమైన పెద్దలలో ట్రోపోనిన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది లేదా కనుగొనబడలేదు.
మీ ట్రోపోనిన్ స్థాయిలు సూచన పరిధి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, దెబ్బతిన్న గుండె కండరాల కణాలు మీ రక్తంలోకి ట్రోపోనిన్‌ను లీక్ చేస్తున్నాయని అర్థం.
ట్రోపోనిన్ యొక్క సాధారణ పరిధి 0 నుంచి 0.04 ng/ml వరకు ఉంటుంది.
ట్రోపోనిన్ ఎక్కువగా ఉందని ఎప్పుడు అంటాము?
ఎక్కువగా పరిగణించబడాలంటే, ట్రోపోనిన్ స్థాయిలు ఆరోగ్యవంతమైన పెద్దలకు ఉండాల్సిన దానిలో 99 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. గుండె పోటులో ట్రోపోనిన్ యొక్క స్థాయిలు 0.40 ng/ml కంటే ఎక్కువగా ఉంటాయి. ట్రోపోనిన్ యొక్క స్థాయిలు 0.04 ng/ml మరియు 0.39 ng/ml మధ్య ఉన్నప్పుడు, సాధారణంగా గుండెలో ఏదో లోపం ఉందని అర్థం.
కొంతమంది ఆరోగ్యకరమైన వ్యక్తులలో ట్రోపోనిన్ యొక్క స్థాయిలు సగటు కంటే ఎక్కువగా ఉండవచ్చు. దీని కారణంగా, ట్రోపోనిన్ యొక్క స్థాయిలు కొంచెంగా పెరిగినప్పుడు , డాక్టర్ రోగనిర్ధారణ చేయడానికి మరిన్ని పరీక్షలను ఆదేశించవచ్చు.
ట్రోపోనిన్ ద్వారా గుండెపోటును ఎలా కనిపెడతారు
ట్రోపోనిన్ స్థాయిలు గణనీయంగా ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రత్యేకించి అవి చాలా గంటల వ్యవధిలో పైకి క్రిందికి వెళితే, అది గుండెపోటుకి బలమైన సంకేతం.
వైద్యులు సాధారణంగా ఒక వ్యక్తి యొక్క ట్రోపోనిన్ స్థాయిలు కాలక్రమేణా ఎలా మారతాయో చూడటానికి పరీక్షని రెండు మూడు సార్లు ఆదేశిస్తారు.
ట్రోపోనిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే డాక్టర్ ఏమి చేస్తారు?
ట్రోపోనిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే, అవసరమైతే యాంజియోగ్రామ్ చేస్తారు. 2d ఎకో కూడా అవసరం.
సుశృతుడు (ఆంగ్లం :Sushruta)
ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్ర చికిత్సకుడు మరియు అధ్యాపకుడు. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన శుశృతుడు, వారణాసిలో జన్మించాడు.
ఇతని ప్రసిద్ధ గ్రంథం శుశృతుడు సంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడింది. ఈ శుశృత సంహిత లో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా వ్రాయబడినవి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి శుశృతుడు గుండెకాయవంటివాడు.
ప్రపంచంలోని యితర దేశాలు కళ్ళుతెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలనో కాపాడిన అపర ధన్వంతరి శుశృతుడు.
కీ.పూ.600 ప్రాంతాలకు చెందింవవాడుగా చరిత్రకారులు శుశృతుణ్ణీ భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పురాణేతిహాసాల ప్రకారం శుశృతుడు 5 వేల ఏళ్ళ కంటే పూర్వంవాడే! ఉత్తర భారత దేశాంలోని గంగానదీ తీరాన వెలసిన వారణాసి పట్టణం శుశృతుడి నివాస స్థానం. శుశృతుడు విశ్వామిత్ర మహర్షి కుమారుడు, కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు. శుశృతుడి జీవితకాలం గూర్చి భిన్న భిన్న అంచనాలు ఉన్నాయి. ప్రసిద్ధ భారత చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ సుశ్రుతుడు క్రీ.పూ 9-10 శతాబ్దాల నడుమ జీవించి ఉండవచ్చని అంచనా వేశాడు. వారణాసిలో ధన్వంతరి మహర్షి వద్ద వైద్యశాస్త్రం అభ్యసించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు.
“ నూతన మిలీనియం సందర్భంగా 2000 సంవత్సరంలో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర వికిత్స వైద్యుల ఫోటోలతో, వారి వివరాలు పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య శుశృతునిది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది.
వైద్య శాస్త్రంలోని ఆనాటి విభాగాలన్నిటిలో ప్రావీణ్యత సాధించడమే కాక ఒక గొప్ప శస్త్ర చికిత్సకునిగా ఘనకీర్తిని ఆర్జించాడు. సుఖప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్ లను కూడా ఆవిష్కరించాడు. మూత్ర పిండంలోని రాళ్లను తొలగించడంలో నైపుణ్యం సాధించారు. విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేష కృషి చేశారు.
ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి, మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని యివ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో తెగిన శరీరావయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించటంలో అందెవేసిన చేయి శుశృతునిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్సకోస్ం 120 రకాల వైద్య పరికరాలను శుశృతుడు ఉపయోగించేవాడట!
తెగిన శరీర భాగాలను అతికించటం, శరిరంలో పేరుకున్న లేదా చొరబడిన విదేశీ పదార్థాలు (ఫారిన్ ఆంటీబాడీస్) ను కనుగొని తొలగించటం, పుచ్చిన, దెబ్బతిన్న దంతాలను తొలగించడం, వరిబీజం (బుడ్డ) రోగికి హాని కలుగకుండా శస్త్రచికిత్స చేసి వేరుచేయడం యివన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది శుశృతుడే!
ప్రొస్టేట్ గ్రంథిని ఏఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి? ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది? దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి? యిలాంటి ఎన్నో శాస్త్రీయ పద్ధతులను శుశృతుడు వేల సంవత్సరాల క్రితమే శోధించి మానవజాతికి అందించాడు. ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుగొన్నాదు. మూత్రనాళంలో పేరుకొనే రాళ్ళను తొలగించడం ఎలాగో సశాస్త్రీయంగా నిర్వహించి నిరూపించాడు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను తన శస్త్రచికిత్స విధానం ద్వారా విజయవంతంగా తొలగించాడు. పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు.
పోస్ట్‌మార్టం (శవ పరీక్ష) వేల ఏళ్ళ క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త శుశృతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, తొమ్మిది నెలల్లో గర్భాశయంలో చోటుచేసుకునే క్రమపరిమాణాలు, శిశువు పెరుగుదలలోని దశల గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు శుశృతుడు.
మానవ శరీర నిర్మాణం అధ్యయనం, శరీరభాగాల విశ్లేషణ వంటి వివరాలు పేర్కొన్నాడు. శస్త్రవికిత్స అనంతరం పుట్టే నొప్పిని తగ్గించేదిగా ఆల్కహాల్ (మదిర) ను గుర్తించాడు. మానవ శరీరం జీవితపు వివిధ దశల్లో 1120 రకాల వ్యాధులకు గురి అయ్యే అవకాశాలున్నాయని తీర్మానించాడు.
తన జీవిత కాలంలో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి, వందలాదిమంది శిష్యులను తయారుచేశాడు శుశృతుడు. అంతే కాక శస్త్రచికిత్సకు సంబంధించిన సమగ్ర సమాచారంలో "శుశృత సంహిత" అనే గొప్ప గ్రంథం రాశాడు శుశృతుడు. ఈ శుశృత సంహిత క్రీ.శ.8 వ శతాభ్దంలో అరబ్ భాషలోకి "కితాబ్ షాషూన్ ఎ హింద్" "కితాబ్ ఐ శుశృత" గ్రంథాలుగా అనువదింపబడినవి.
శస్త్రచికిత్స కోసం ఎముకలతో, రాతితో చేసిన పదునైన పనిముట్ల వాడకాన్ని నిషేధించాడు. శస్త్రచికిత్స చేసే వారికి కొన్ని నియమ నిబంధనలు సూచించారు. శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పారు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశారు. ఆరోగ్యంగా ఉండి పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి, నిరంతరం ప్రవహించే నీటిలో కొద్దికాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి, అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు.
శుశృత సంహిత అనే ఆయుర్వేద గ్రంథం ఆయుర్వేద వైద్యులకు లభించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం. దీనిని శుశృతుడు సంస్కృతంలో రచించాడు. ఈ "శుశృత సంహిత" లలో 184 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో మనిషి సాధారణంగా గురికాబడే వ్యాధులు 1120 గా నిరూపింపబడింది. అలాగే మానవ శరీరం నిర్మాణం తీరుతెన్నుల గురించి, ప్రతి అవయవ నిర్మాణం గురించి విపులంగా చెప్పబడింది. 700 పై బడిన ఔషధీ మొక్కల లక్షణ విశేషాలు - ఏ వ్యాధికి ఏ మొక్క ఎలా ఔషధంగా ఉపయోగపడి రోగాన్ని ఎలా తగ్గిస్తుందో ఉదాహరణ పూర్వకంగా నిరూపించబడింది. 64 రకాల ఖనిజాల నుండి మందులను ఎలా తయారుచేసుకోవాలో యివ్వబడినాయి. అంతేకాక జంతు సంబంధమైన అవయవాల నుండి 57 ఔషదాలను తయారుచేసే వైద్య విన్ఞానం ఉంది.
సుశ్రుత సంహితలో సంపూర్ణ ఆయుర్వేద శస్త్రచికిత్సా విజ్ఞానం యిమిడి ఉంది. ఈ గ్రంథంలో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది పూర్వ తంత్ర కాగా రెండోది ఉత్తర తంత్ర, ఈ గ్రంథంలో ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన "అష్టాంగ హృదయం " వివరింపబడింది.
ఈ గ్రంథంలో 101 శస్త్ర పరికరాల గురించి వివరించాడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని నిర్వహించుటకు అందరికీ ప్రయోజనకరమైన అనువైన విధానాలతో, తేలికగా అర్థం చేసుకునే విధంగా ఈ గ్రంథ రచన చేశారు. ఈ రోజున కూడా వైద్య సమాచారం నిమిత్తం ఒక బంగారు నిధి తరహాలో ఈ గ్రంథం ఉపయోగపడుచున్నది. ఏ చిన్న సర్జరీ లేకుండా అనేకానేక వ్యాథులను నియంత్రించడానికి, తగ్గించడానికి ఎన్నో సూచనలు ఈ గ్రంథంలో చోటుచేసుకున్నాయి.
"సుశ్రుత సంహిత"
క్రీ.శ 8 వ శతాబ్దంలో "సుశ్రుత సంహిత"ను అరబిక్ భాషలోకి "కితాబ్ పాషూన్ ఎ హింద్", కితాబ్ ఇ సుస్రుద్" పుస్తకాలుగా అనువదించారు. ఈ గ్రంథంలో విరిగిన ఎముకలు పనిచేసేందుకు కట్టే కర్ర బద్దీల గురించి, శస్త్ర చికిత్సలలో వాడే వివిధ పరికరాల గురించి, ప్రస్తావన ఉంది. శస్త్ర చికిత్సల గురించి విస్తృతంగా చర్చించడమే కాకుండా శస్త్ర చికిత్సలలో వాడే వివిధ శలాకల గురించి ఏకంగా ఒక తంత్రాన్నే రచించారు. దీనినే "శల్యతంత్ర" అంటారు. ఇతర వైద్య విభాగాలలో కూడా ఎంతో సాధికారత సాధించిన ఈయన గాయాలకు, పుండ్లకు చీము చేరకుండా నయం చేయడమే చికిత్స అని, వేగవంతమైన చికిత్స ఇతర వ్యాథులను దరిచేరచివ్వడని పేర్కొన్నాడు. మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేయటం అమానుషమని భావించి మూలికారసము, సోమరసము (మధ్యం) స ద్వారా మత్తు కలిగించి, "అనస్తీషియా" ప్రక్రియకు తొలిరూపం అందించినవారయ్యారు.
ప్లాస్టిక్ సర్జరీ
ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! తెగిన భాగాలను శరీరంలోని మరొక అవయవం నుండి కొంతభాగం తీసి తెగిన చోట అమర్చి పుర్వ రూపానికి తీసుకువావడమే ప్లాస్టిక్ సర్జరీ! ప్లాస్టిక్ సర్జరీలో, రైనోప్లాస్టీ (ముక్కు నిర్మాణమును ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిదిద్దడం) మీద ప్రఖ్యాతి చెందిన, సాధికార గ్రంథం "సుశ్రుత సంహిత" రాసాడు.
ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన మూల సూత్రాలను సుస్పష్టంగా వివరించాడు సుశ్రుతుడు. అతి సున్నితమైన శరీరభాగాల నుండి చర్మాన్ని వేరుచేసి కొత్త చర్మంతో కప్పడం, కండరాలను తిప్పి దెబ్బతిన్న భాగాలపై మేకప్ చేయడం, పూర్తిగా కాలిన చర్మాన్ని తొలగించి కొత్త చర్మం కప్పడం వంటి ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సా విధానాన్ని వైద్యులకు స్పష్టంగా అవగాహన కలిగించారు సుశ్రుత మహర్షి తన "సుశ్రుత సంహిత" గ్రంథంలో!
పాశ్చాత్య అల్లోపతీ విధానం పుట్టక ముందు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేదాన్ని పెంచి పోషించి, ఆధునాతన శస్త్రచికిత్సా నిపుణులకు సైతం అచ్చెరుపు గొలిపే విధంగా విజయవంతమైన ఎన్నో శస్త్ర చికిత్సలను జరిపి ప్రపంచ వైద్యులకు మార్గదర్శిగా నిలిచిన క్రాంతిదర్శి సుశ్రుత మహర్షి.
సుశ్రుతుడు రాసిన గ్రంథరచన ఆధారంగా ఈయన స్వయంగా అనుసరించిన వైద్యచికిత్సా విధానాలు అనేకం తెలియవస్తాయి. శస్త్ర చికిత్సను అతి నైపుణ్యంతొ నిర్వహించడానికి కొన్ని జంతువుల వెంట్రుకలను, బాగా ఎదిగిన వెదురు చెట్ల బొంగులను, కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన చెట్ల బెరడుతో చేసిన కుంచెలను వాడేవారు. వైద్యుడి వేష భాషలు ఎలా ఉండాలో ముఖ్యంగా ప్రవర్తన ఏ తీరులో ఉండాలో చెప్పారు. మంచి ఆరోగ్యంలో ఉండి, పూర్తి చేతనతో, ఉత్సాహంగా శస్త్రచికిత్సలు చేయాలన్నారు. శస్త్రపరికరాలను ఎప్పటికప్పుడు ఉష్ణజలంతో పరిశుభ్రపరచాలని హితవు పలికారు.
సున్నితమైన అవయవాలను అతికించే ముందు ఏ మాత్రం అవకాశం ఉన్నా పూర్వకర్మ చికిత్స (ఫిజియో థెరపీ) ను ఆ వ్యక్తికి అందించాలని, అప్పుడే శస్త్ర చికిత్సకు సంసిద్ధుడై, చికిత్స అనంతరం త్వరిత గతిన స్వస్థతను పుంజుకుంటాడని వివరించారు. మానవులకు హాని కలిగించే, వ్యాథులను ఏర్పరచి క్రిమికీటకాలను పేర్కొంటూ వాటిని వర్గీకరణ చేశరు. ఏ క్రిమి/కీటకం దాడి చేసి అనారోగ్యం కలిగిస్తే ఏవిధమైన మూలికా వైద్యం అవసరమో వివరించారు.
మెదడు (పెద్దమెడడు) లోచిక్కుకుపోయిన శల్యాన్ని వెలుపలికి తీసుకు రావటనికి కూడా చికిత్సను సూచించారు. కపాలానికి రంధ్రంఅ చేసి, మెదడులోని శల్యాన్ని తీసే విధానానికి అంకురార్పణ చేశారు. శరీరంలో ప్రవహించె రక్తంలో అతి సూక్ష్మ క్రిములు పుట్టి, ధమనులు సిరలలో జీవిస్తూ పలురకాల అస్వస్థతలకు గురిచేయగలవని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. ఈ విధంగా మానవుడికి దాపురించే వ్యాధికారకాలు, చికిత్సా విధానాలను తమ గ్రంథ రచనలో ఇమిడ్చి, మానవ జాతికి మహోపకారం చేశారు. ఈ నాతికీ వైద్య విజ్ఞాన కోశంగా ఉపయోగపడుతున్న "సుశ్రుతసంహిత" లోని ముఖ్యాంశాలు దేశ దేశాల వారికి మౌలిక ప్రయోజనకరంగా ఉన్నాయి. సుశ్రుతుడు అంకురార్పణ చేసిన అనేక వైద్యచికిత్సలు ఆయుర్వేద వైద్యవిధానం ద్వారా మనకు పరిచయం కావడంతో ఏమంత విశేషంగా అనిపించకపోవచ్చు. కొన్ని మాత్రం తెరమరుగున వుండి, ఈనాటికీ వైద్య శాస్త్రవేత్తల పరిశోధనలలో మగ్గుతూ పూర్తి వివరాలకోసం వేచివున్నాయి. ఉదా: రక్త మోక్షణ.
యితర దేశాలకు తరలిపోయిన గ్రంథాలు :
సుశ్రుతుని గ్రంథ రచనలు కొన్ని టిబెట్ ప్రాంతానికి ఆ కాలంలోనే తరలివెళ్ళాయి. ఈయన వైద్య సంప్రదాయానికి చెందిన శల్య చికిత్సకులు ఉండేవారని, వారు ఉపయోగించిన శస్త్ర పరికరాలు చిత్రపటములే కాక, ఆయా పరికరాలలో కొన్నిపురావస్తు పరిశోధకులకు లభించినట్లు తెలియవచ్చింది. క్రీ.పూ. 8 వ శతాబ్దానికి చెందిన ఈయన గ్రంథం "అమృత అష్టాంగ హృదయ గుహ్యోపదేశ తంత్ర" ఈ రోజున మన దేశంలో లభించదు. అయినప్పటికీ ఈ గ్రంథం అనువాదం టిబెట్ లో "గుష్టి" (నాలుగు వైద్య శాస్త్ర తంత్రములు) పేరుతో లభిస్తున్నవి.
సుశ్రుతుడు, చరకుడు సృజించిన వైద్య విధానాలు క్రీస్తు పూర్వ కాలంలోనే అగ్నేయాసియా, ఉత్తర ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలలో బాగా వాడుకలోవున్నాయని రూఢి అయింది. మధ్య ప్రాచ్యంలో ఏడవ శతాబ్దిలోనే చరకుని గ్రంథాలు, సుశ్రుతుని వైద్య సంహితలు అరబ్బీ భాష లోకి తర్జుమా చేయడం జరిగింది. ముస్లిం ప్రముఖ చరిత్రకారుదు ఫరిస్తా రాసిన చరిత్ర రచన ఆధారంగా మరి 16 ప్రాచీన భారతీయ వైద్య శాస్త్ర గ్రంథములు కూదా 8 వ శతాబ్దం నాటికి అరబ్బులకు పరిచయం కాగలిగాయి.
ఫరిస్తా రాసిన రాతల ప్రకారం మరికొన్ని ఆసక్తికర అంశాలు తెలియవస్తాయి. మహమ్మదీయ ప్రముఖుడు ఖలీఫాహరున్ అల్ రషీద్ కు అత్యవసర వైద్యం చేయడానికి "మనక్" అనే భారతీయ వైద్యుడిని హడావుడిగా అరేబియాకు పిలిపించుకున్నారు. ఆ తర్వాత "మనక్" బాగ్దాద్ లో స్థిరపడి అక్కడి ఆస్పత్రికి అధికారిగా నియమితులైనట్లు, మనక్ తో పాటు మరో ఆరుగురు భారతీయ వైద్యులను తమ దేశానికి ఆహ్వానించినట్లు మొదలగు చారిత్రాత్మక ఆధారాలను ఫరిస్తా తన గ్రంథ రచనలో పేర్కొన్నాడు.
ఆ కాలం లో సుశ్రుతడు శస్త్రచికిత్స కు ఉపయోగించిన పనిముట్లు.
◆ఈ క్షణం మరిచిపోలేనిది
◆ఈ క్షణం అసాధారణమైనది
◆ఈ క్షణం అభివృద్ధి చెందిన భారతదేశానికి శంఖనాదం
◆ఇది నవ భారత వేడుకల క్షణ
◆కష్టాల సాగరాన్ని దాటే తరుణం ఇదే ◆విజయపథంలో నడవాల్సిన తరుణం ఇదే
◆ఈ క్షణం 140 కోట్ల ప్రజల గుండె చప్పుడుతో కూడుకున్నది
◆ఇది దేశంలో కొత్త శక్తి, కొత్త విశ్వాసం,కొత్త చైతన్యం నింపిన క్షణం
సుశ్రుత సంహితను ఆశ్రయించిన ఆధునిక వైద్యులు.
పాత వార్తే.
🙏🙏🙏🙏
సర్జరీలు చేయడానికి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కత్తి గాటు పెట్టకుండానే వైద్యులు శస్త్రచికిత్సలు చేసేస్తున్నారు.
అయినా.. ఓ మహిళ ముక్కుకు సర్జరీ విషయంలో ఇవేమీ చేయలేకపోయాయి. కానీ వైద్య శాస్త్ర పితామహుడిగా పేరొందిన శుశ్రుతుడి పద్ధతి ఫలితాన్నిచ్చింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. 2500 ఏళ్ల క్రితం 'శుశ్రుత సంహిత’లో శుశ్రుతుడు చెప్పిన పద్ధతుల్లో శస్త్రచికిత్స (నాససఃధాన విధి) చేసి విజయం సాధించారు ఢిల్లీ వైద్యులు. అఫ్గనిస్థాన్‌కు చెందిన ఓ మహిళ ముక్కుకు నాలుగేళ్ల క్రితం బుల్లెట్ గాయమైంది.
దీంతో వాసనను గుర్తించే లక్షణాన్ని కోల్పోయింది. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు రావడంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి ఢిల్లీకి వచ్చింది. ఆమెను పరీక్షించిన కేఏఎస్ మెడికల్ సెంటర్ డైరెక్టర్ అజయా కశ్యప్.. అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి చికిత్స చేసే ప్రయత్నం చేశారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ప్రయత్నించారు. కానీ సర్జరీ సక్సెస్ కాలేదు.
చివరకు శుశ్రుతుడు చెప్పిన పద్ధతులను ఉపయోగించారు. చెంప నుంచి చర్మాన్ని తీసుకుని ముక్కును పునర్నిర్మించారు. సోమవారం జరిగిన సర్జరీ విజయవంతం కావడంతో.. ఇప్పుడామె వాసన పసిగట్టడంతో పాటు ఎప్పటిలానే శ్వాస తీసుకోగలుగుతుంది.
#యువకులలో గుండెపోటుకు కారణాలు ఏమిటి?
గుండెలోని కొంత భాగానికి రక్త ప్రసరణను అడ్డుకున్నప్పుడు గుండెపోటు వస్తుంది. ఇది గుండె కండరాలకు హాని కలిగించవచ్చు లేదా చంపవచ్చు మరియు తీవ్రమైన సమస్యలు లేదా మరణానికి కారణమవుతుంది. వృద్ధులలో గుండెపోటు చాలా సాధారణం, కానీ అవి యువకులను కూడా ప్రభావితం చేస్తాయి. వాస్తవానికి, కొన్ని అధ్యయనాలు గతంలో కంటే ఎక్కువ మంది యువకులు, ముఖ్యంగా మహిళలు గుండెపోటుతో బాధపడుతున్నారని తేలింది.
#యువతలో గుండెపోటు రావడానికి కారణం ఏమిటి?
చిన్న వయస్సులోనే గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వాటిలో కొన్ని:
మధుమేహం: మధుమేహం అంటే మీ రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది మీ గుండెకు వెళ్లే రక్తనాళాలు మరియు నరాలకు హాని కలిగిస్తుంది. మీరు మీ గుండెను ప్రభావితం చేసే అధిక రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ వంటి ఇతర విషయాలను కూడా కలిగి ఉండవచ్చు.
అధిక రక్తపోటు: అధిక రక్తపోటు అంటే మీ గుండె మరియు ధమనులు సాధారణం కంటే ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. ఇది వాటిని ఇరుకైనదిగా మరియు కష్టతరం చేస్తుంది. ఇది మీ గుండెకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది మరియు గడ్డకట్టే అవకాశాన్ని పెంచుతుంది.
పోస్ట్ ఇన్ఫెక్షియస్ హార్ట్ ఎటాక్: పోస్ట్ ఇన్ఫెక్షియస్ హార్ట్ ఎటాక్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే గుండెపోటును సూచిస్తుంది. వైరస్ ఇన్ఫెక్షన్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులతో సహా శరీరం అంతటా వాపును కలిగిస్తుంది. ఇది కొవ్వు ఫలకాలు మరియు చీలికను అభివృద్ధి చేయడానికి ధమనులను మరింత అవకాశంగా చేస్తుంది, ఇది రక్తం గడ్డకట్టడం మరియు అడ్డంకులను ప్రేరేపిస్తుంది. వైరస్ ఇన్ఫెక్షన్ రక్తం గడ్డకట్టే ధోరణిని కూడా పెంచుతుంది, ఇది గుండెకు లేదా ఇతర అవయవాలకు వెళ్లి నష్టాన్ని కలిగిస్తుంది. వైరస్ ఇన్ఫెక్షన్ గుండె కండరాలు లేదా రక్త నాళాల పొరతో సహా శరీరం యొక్క స్వంత కణజాలాలపై దాడి చేసే అసాధారణ రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. ఇది గుండె కణజాలం యొక్క వాపు, దెబ్బతినడం మరియు మచ్చలను కలిగిస్తుంది, ఇది దాని పనితీరును దెబ్బతీస్తుంది మరియు అరిథ్మియా మరియు గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.
అధిక బరువు మరియు ఊబకాయం: అధిక బరువు లేదా ఊబకాయం మీకు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం మరియు వాపు కలిగిస్తుంది. ఇవన్నీ మీ హృదయాన్ని గాయపరుస్తాయి. ఇది మీ గుండె గదుల పరిమాణాన్ని మరియు పనితీరును కూడా మార్చగలదు, వాటిని కష్టతరం మరియు తక్కువ పని చేస్తుంది.
స్మోకింగ్ మరియు వాపింగ్: సిగరెట్ తాగడం మరియు వాపింగ్ చేయడం వల్ల మీ ధమనుల లోపలి భాగం దెబ్బతింటుంది మరియు వాటిలో ఫలకం మరియు గడ్డకట్టే అవకాశం ఉంది. అవి మీ రక్తంలో ఆక్సిజన్ మొత్తాన్ని కూడా తగ్గించగలవు మరియు మీ హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును పెంచుతాయి.
పదార్థ దుర్వినియోగం: మాదకద్రవ్యాలు లేదా ఆల్కహాల్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ గుండెను వివిధ మార్గాల్లో ప్రభావితం చేయవచ్చు, అవి సక్రమంగా లేని హృదయ స్పందనను కలిగించడం, రక్తపోటును పెంచడం, మంటను కలిగించడం మరియు గుండె కండరాలను బలహీనపరచడం వంటివి.
జన్యువులు: కొందరు వ్యక్తులు గుండెలో రంధ్రం, బలహీనమైన గుండె కండరాలు లేదా అసాధారణ హృదయ స్పందన వంటి వారి గుండె నిర్మాణం లేదా పనితీరును ప్రభావితం చేసే పరిస్థితితో జన్మించవచ్చు. ఈ పరిస్థితులు మీ హృదయాన్ని ఒత్తిడికి లేదా నష్టానికి మరింత సున్నితంగా చేస్తాయి.
#యువకులలో గుండెపోటును ఎలా నివారించాలి?
శుభవార్త ఏమిటంటే, మీకు చిన్న వయస్సులో గుండెపోటు వచ్చే అవకాశం ఉన్న అనేక విషయాలను జీవనశైలి మార్పులు లేదా ఔషధాలతో మార్చవచ్చు లేదా నియంత్రించవచ్చు. గుండెపోటును నివారించడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు:
మధుమేహాన్ని నిర్వహించడం: మీకు మధుమేహం ఉంటే, మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిలను తరచుగా తనిఖీ చేయాలి మరియు ఆహారం, వ్యాయామం మరియు ఔషధాలపై మీ వైద్యుని సలహాను అనుసరించండి. మీరు మీ రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తనిఖీ చేయాలి మరియు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి.
రక్తపోటును తగ్గించడం: మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, మీరు ఎంత ఉప్పు తినాలో పరిమితం చేయాలి, ధూమపానం మరియు మద్యపానానికి దూరంగా ఉండాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి మరియు మీ మందులు తీసుకోవాలి. మీరు మీ ఒత్తిడి స్థాయిలను కూడా నిర్వహించాలి మరియు మీరు ఆత్రుతగా లేదా నిరుత్సాహంగా ఉంటే సహాయం పొందండి.
పోస్ట్ఇన్ఫెక్షియస్ హార్ట్ ఎటాక్ : మీకు ఇటీవల వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే, చికిత్స మరియు కోలుకోవడానికి మీ డాక్టర్ సిఫార్సులను అనుసరించండి. సూచించిన విధంగా మీ సూచించిన మందులను తీసుకోండి మరియు మీ తదుపరి నియామకాలకు హాజరు అవ్వండి. మీకు ఏవైనా లక్షణాలు లేదా ఆందోళనలు ఉంటే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. మీ గుండెకు హాని కలిగించే వైరల్ ఇన్ఫెక్షన్‌లకు గురికాకుండా నిరోధించడానికి, మీ చేతులను తరచుగా కడుక్కోవడం, మీ ముఖాన్ని తాకకుండా ఉండటం మరియు మీ దగ్గు లేదా తుమ్ములను కప్పుకోవడం వంటి మంచి పరిశుభ్రత అలవాట్లను పాటించండి. అలాగే, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సంబంధాన్ని నివారించండి మరియు సిఫార్సు చేయబడిన టీకాలు తీసుకోండి. మీకు జ్వరం లేదా సంక్రమణ ఇతర సంకేతాలు ఉంటే, వీలైనంత త్వరగా మీ వైద్యుడిని సంప్రదించండి.
బరువు తగ్గడం: మీరు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్లయితే, మీరు తక్కువ కొవ్వు, చక్కెర మరియు ఉప్పు మరియు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు లీన్ ప్రొటీన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన బరువును చేరుకోవడానికి ప్రయత్నించాలి. మీరు మరింత చురుకుగా ఉండాలి మరియు ఎక్కువ కూర్చోకుండా ఉండాలి.
ధూమపానం మరియు వాపింగ్ మానేయడం: మీరు ధూమపానం లేదా పొగ త్రాగితే, మీరు వీలైనంత త్వరగా మానేయాలి, ఎందుకంటే ఇది మీ గుండెపోటు ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. నిష్క్రమించడంలో మీకు సహాయపడటానికి మీరు మీ డాక్టర్, కుటుంబం, స్నేహితులు లేదా ఆన్‌లైన్ వనరుల నుండి మద్దతు పొందవచ్చు.
పదార్థ దుర్వినియోగాన్ని నివారించడం: మీరు మాదకద్రవ్యాలు లేదా ఆల్కహాల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే, మీరు ఎంత వాడుతున్నారో ఆపివేయాలి లేదా తగ్గించాలి, ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మరియు మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. మీకు వ్యసనం లేదా మీ పదార్థ వినియోగాన్ని ప్రభావితం చేసే మానసిక ఆరోగ్య సమస్య ఉంటే మీరు వృత్తిపరమైన సహాయాన్ని కూడా పొందవచ్చు.
మీ కుటుంబ చరిత్రను తెలుసుకోవడం: మీకు గుండె జబ్బుల కుటుంబ చరిత్ర లేదా గుండెను ప్రభావితం చేసే ఇతర జన్యుపరమైన పరిస్థితులు ఉంటే, మీరు మీ ప్రమాదం మరియు సాధ్యమయ్యే పరీక్షల గురించి మీ వైద్యుడితో మాట్లాడాలి. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన లేదా మూర్ఛపోవడం వంటి ఏవైనా లక్షణాలు లేదా గుండె సమస్య యొక్క సంకేతాల గురించి కూడా మీరు మీ వైద్యుడికి చెప్పాలి.
#వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
యువకుల్లో వచ్చే గుండెపోటుకు త్వరగా చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల, హెచ్చరిక సంకేతాలను తెలుసుకోవడం మరియు అవి జరిగితే అత్యవసర వైద్య సహాయం కోసం కాల్ చేయడం చాలా ముఖ్యం. గుండెపోటు యొక్క కొన్ని సాధారణ లక్షణాలు:
ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం ఒత్తిడి, పిండడం, బిగుతుగా లేదా సంపూర్ణంగా అనిపించవచ్చు. ఇది కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండవచ్చు లేదా వచ్చి వెళ్లవచ్చు.
మీ చేతులు, వీపు, మెడ, దవడ లేదా కడుపు వంటి మీ శరీరంలోని ఇతర భాగాలలో నొప్పి లేదా అసౌకర్యం.
ఛాతీ నొప్పితో లేదా లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస ఆడకపోవడం.
మీ కడుపు నొప్పిగా అనిపించడం, విసురుకోవడం, అజీర్ణం లేదా కడుపు నొప్పి.
చెమటలు పట్టడం, తల తిరగడం, తల తిరగడం లేదా మూర్ఛపోవడం.
ఆత్రుతగా, భయంగా లేదా ఏదైనా చెడు జరగబోతోందని ఫీలింగ్.
కొంతమంది వ్యక్తులు గుండెపోటుకు సంబంధించినవిగా భావించని విభిన్నమైన లేదా తేలికపాటి లక్షణాలను కలిగి ఉండవచ్చు, అలసట, బలహీనత, దగ్గు లేదా నిద్రపోవడం వంటి సమస్యలు ఉంటాయి. మహిళలు, మధుమేహం ఉన్నవారు మరియు వృద్ధులలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, మీ శరీరంలో ఏవైనా మార్పులకు శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం మరియు వాటిని విస్మరించకూడదు లేదా బ్రష్ చేయకూడదు.
#సారాంశం
యువకులలో గుండెపోటు చాలా సాధారణం మరియు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. మధుమేహం, అధిక రక్తపోటు, పోస్ట్ఇన్ఫెక్షియస్ హార్ట్ ఎటాక్, ఊబకాయం, ధూమపానం, పదార్థ దుర్వినియోగం మరియు జన్యువులు వంటి గుండెకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసే విభిన్న విషయాల వల్ల ఇవి సంభవిస్తాయి. ఈ విషయాలలో చాలా వరకు జీవనశైలి మార్పులు లేదా ఔషధంతో నిరోధించవచ్చు లేదా నిర్వహించవచ్చు. గుండెపోటు యొక్క సంకేతాలు మరియు లక్షణాలను తెలుసుకోవడం మరియు అవి సంభవించినట్లయితే వెంటనే వైద్య సహాయం కోసం కాల్ చేయడం కూడా చాలా ముఖ్యం. మీ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా, మీరు చిన్న వయస్సులోనే గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు మరియు ఎక్కువ కాలం మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు.
తినేవాళ్ళు, వండేవాళ్ళు కూడా ఇదేదో బ్రహ్మ పదార్ధంలా ఫీలై దోసిల్లతో మరీ వేస్తుంటారు వంటల్లో...
ఇంటర్ వయసు పిల్లలో సైతం గుండె పోటు కు ఇది కూడా కారణం అయ్యే అవకాశం ఉంది.
అజినో మోటో... #టేష్టింగ్_సాల్ట్
-------------------------------------
మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్లో టెస్టెడ్ సాల్ట్ అనేది వాడబడతాయి ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి దిగుమతి అవ్వడానికి కారణం ఫేర్టిలైజర్స్ పేరు మీద వస్తుంది. ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద భారతదేశంలో యువతని బీపీకి, షుగర్లకి రోగిష్ఠులును చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్లో వంట వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. చైనాలో దీన్ని పూర్తిగా నిషేధించారు.. కానీ భారతదేశంలో దీనికి ఇంకా అమలులోకి తీసుకు రాలేదు.
2018 లో పాకిస్తాన్ సుప్రీం కోర్టు కూడా టేస్టింగ్ సాల్ట్ వలన కలిగే దుష్ప్రయోజనాల పై సుమోటో గా స్వీకరించి ఇది హానికరం అని చెప్పి నిషేధించింది. ఈ టేస్టింగ్ సాల్ట్ వేసిన, ఏ భోజనం అయినా ఒక 40 రోజుల్లో తిన్నారంటే జీవితాంతం బీపీతో, షుగర్తో బాధపదడం తప్పదు. గుండె పోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఈ విషయాన్ని మీడియా మాధ్యమాల్లో చర్చించి దీన్ని వ్యతిరేకించి ఒక మహా ఉద్యమంగా తీసుకొస్తే గాని ఈ భారత దేశంలో రోగులు, బాధితులు తగ్గేలా లేరు అని కొన్ని సామాజిక సంస్థలు కూడా ఢిల్లీలో చర్చించాయి. మన ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి సారించాలి. ఈ టేస్టెడ్ సాల్ట్ వల్ల మన కొన్ని వేల రుచులను గుర్తించగలిగే మన నాలుక బండ పారిపోవడమే కాకుండా మేధోశక్తిని కూడా నాశనం చేస్తుంది. దీనిని మన భారతీయులందరికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది.
*వినియోగ భారతి - ఆంధ్రప్రదేశ్*
పేపర్ కప్పులో టీ
కాన్సర్ జబ్బుకు ఆహ్వానం....
మీకు ఎవరైనా శత్రువు ఉన్నాడా? వాడు రోజు కృషించి కుక్క చావు చావాలి అనుకుంటున్నారా? అయితే వాడికి రోజు కాగితం కప్పులో టి తాగించండి. చట్టానికి దొరక్కుడా కోల్డ్ మర్డర్ గా ఎవరినయినా చంపాలని అనుకుంటున్నారా? అయితే వాడికి రోజు కాగితం కప్పులో టి తాగించండి. వాడు క్యాన్సర్ తో కుక్క చావు చస్తాడు.
మేముకూడా రోజు కాగితం కప్పులోనే టి తాగుతున్నాము కదా అంటారా? అయితే మిమ్మల్ని క్యాన్సర్ తో చంపాలని చాయి బండి వాడు కుట్రపన్నుతున్నాడు. కాగితం కప్పులో టి తాగిగే డిగ్నిటీ అని అనుకుంటే మీరు ‘కప్పులో కాలు వేసినట్లే.’ గాజు గ్లాస్ లో టి తాగితే ఇతరుల ఎంగిలి అంటుకుంటుంది అనుకుంటే మీకు సైన్సు మీద సరైన అవగాహన లేనట్లే.
ఇవి మేము చెప్పిన మాటలు కాదు. మొన్న లండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్ట్ లు చెప్పిన నిజమిది. ఇండియాలో చదువుకున్న వాళ్లు కూడా కాగితం కప్పులల్లో టి లు, కుల్ డ్రింక్ లు తాగుతూ క్యాన్సర్ ని కొనుక్కుంటున్నారు, వాళ్ళను ఎడ్యుకేట్ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం దంలేదు అని బాధపడ్డారు. ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్ లు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారణ కోసం పేపర్ కప్పులను ఎందుకు బ్యాన్ చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు.
ఎందుకు బ్యాన్ చేస్తారు? పేపర్ కంపనీలనుంచి లంచాలు వస్తే క్యాన్సర్ వస్తుంది అని ఎందుకు ప్రచారం చేస్తారు? పింగాణి కప్పులు, గాజు గ్లాస్ లో టి ఇస్తే వాటిని కడగాలి. దానికోసం నీళ్ళు కావాలి. పని వాళ్లు కావాలి. కాబట్టి బండివాడు కాగితం కప్పులో టి ఇచ్చి క్యాన్సర్ ని మీకు పది రూపాయలకు అమ్ముతున్నాడు.
మీరు ఎప్పుడైనా కాగితం తాయారు చేసే ఫ్యాక్టరీ కి వెళ్ళరా? ఒకసారి వెళ్లి చూడండి. జీవితంలో మీరు కాగితం కప్పులో టి తాగరు. కాగితం తయారు చేయడానికి మురికి కాలువలో ప్రవహించే నీళ్ళు వాడతారు. వాటర్ ట్యాంక్ నాచుతో కంపు వాసనతో ఉంటుంది. దాని నిండా పురుగులే. చనిపోయిన ఎలుకల ఎముకలు తేలుతాయి. రా మేటిరియల్ని కుల్లబెడతారు. కాళ్ళతో తొక్కి మెత్తగా చేస్తారు. దాదాపు 15 రకాల కేమికల్స్ వాడుతారు. అందులో ఆసిడ్ లాంటి విషపూరిత కేమికల్స్ ఎక్కువ. కాగితం వెంటనే మెత్తబడ్కుండా ప్లాస్టిక్ తో చేసిన ఫెవికాల్ లాంటి కేమికల్ గమ్ కూడా వాడతారు.
ఆ కాగితంలో చేసిన కప్పులో వేడి వేడి పోయగానే చాలా రకాల కేమికల్స్ బయటికి వచ్చి టి లో కలుస్తాయి. మీరు గమనించండి. టి కప్పులో తాగే టి కంటే కాగితం కప్పులో తాగే టి కొంచం చేదుగా ఉంటుంది. అవే అడ్డమైన కెమికల్స్. సాటి మనిషి ఎంగిలి కప్పులో మనం కూడా టి తాగితే చిన్నా చితక రోగాలు రావచ్చుగాకా. కానీ ప్రాణాంతక మైన క్యాన్సర్ రాదు.
లివర్ చెడిపోయి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళితే ముందుగా ”మీరు సిగరెట్లు కాలుస్తారా? మందు తాగుతారా?” అని అడుగుతాడు. అలాగే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు వెళ్ళగానే అడిగే మొదటి ప్రశ్న ”మీరు కాగితం కప్పులో టి తాగే వారా?” అని.
మీకు ఇంకా నమ్మాలి అనిపించకపోతే ఒక మట్టి కప్పులో బ్రెడ్డు, ఒక కాగితం కప్పులో మటన్ పెట్టి కుక్క ముందు పెట్టండి. కుక్కలకు మటన్ అంటే ఇష్టం. కానీ అది కాగితం ప్లేట్ లో ఉండే కెమికల్ కి భయపడి తినదు. మట్టి కప్పులో ఉన్న బ్రెడ్డును తిని తన ఆరోగ్యం కాపాడుకుంటుంది. ప్లాస్టిక్, కాగితం కప్పులకు గుడ్ బై చెప్పి క్యాన్సర్ కి దూరంగా ఉండండి.
ఆపరేషన్ సమయంలో…
తొడ ఎముక కింది భాగం, కాలు పైభాగం అరిగిపోవడం వల్ల రాపిడి ఎక్కువై నొప్పి మొదలవుతుంది. ఎముకల మధ్య ఉండే జిగురు తగ్గిపోవడం, ఎముక, వాషర్ అరిగిపోవడం వల్ల నొప్పి ఎక్కువవుతుంది. ఆపరేషన్‌లో భాగంగా ఎముక ఆరిగిన స్థానంలో మెటల్‌ను అమర్చడం జరుగుతుంది. రెండు వైపులా మెటల్ వేసిన తరువాత అరిగిన వాషర్ స్థానంలో కొత్త వాషర్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. A.S.knee చూడటానికి బంగారం లాగా ఉంటుంది. తక్కువ అరుగుదలతో ఎక్కువ కాలం మన్నడం, పటుత్వం కలిగి ఉండటం, అలర్జీలు నివారించడం వల్ల మోకాలు నొప్పితో బాధపడేవారికి బంగారు మోకాలేనని చెప్పొచ్చు. శస్త్రచికిత్స తరువాత నొప్పి పూర్తిగా తగ్గిపోయి మామూలుగా నడవటం, రోజు వారి పనులు చేసుకోవడం సాధ్యపడుతుంది. మోకాలు మార్పిడి తరువాత కూడా నొప్పి తగ్గదనేది అపోహ మాత్రమే. ఒకసారి మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారు పదిపదిహేనేళ్ల పాటు నడవటం, మెట్లెక్కడం, సైకిల్ తొక్కడం లాంటి పనులు చేసుకోవచ్చు.
ఆపరేషన్ తరువాత…
మోకాలు మార్పిడి శస్త్రచికిత్స అనంతరం నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. కాళ్ల వంకర కూడా తొలగిపోతుంది. కృత్రిమ కాలు ఎంతకాలం మన్నుతుంది అనే విషయం వారి అలవాట్లు, జీవనవిధానం, శస్త్రచికిత్సలో అమర్చే మెకాలుపై ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శస్త్రచికిత్స తరువాత ఎంత దూరమైన నడవచ్చు. ఎన్ని మెట్లయినా ఎక్కవచ్చు. కానీ కింద కూర్చునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మోకాలు మార్పిడి అనంతరం ఇరవై, ముఫ్పై ఏళ్ల పాటు హాయిగా జీవించవచ్చు.
శస్త్ర చికిత్స తరువాత కింద కూర్చోవడం గానీ, మెట్లు ఎక్కడం కానీ సాధ్యం కాదనే అభిప్రాయం కూడా కొందరిలో ఉండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన(హైఫ్లెక్స్ నీ రిప్లేస్‌మెంట్) కృత్రిమ కీళ్లతో మెట్లు ఎక్కడమే కాదు, ఏ ఇబ్బందీ లేకుండా కింద కూడా కూర్చోవచ్చు. శస్త్ర చికిత్స జరిగిన నెలరోజుల్లో స్టిక్ సహాయం కూడా లేకుండా నడిచే స్థితి ఏర్పడుతుంది.
శస్త్ర చికిత్స తరువాత భరించలేని నొప్పి వస్తుందేమోనని కొందరు భయపడుతూ ఉంటారు. కానీ, ఇటీవల వచ్చిన కొన్ని కొత్త రకాల మాత్రలు, ఇంజెక్షన్ల వల్ల ఇప్పుడు ఆ నొప్పి చాలా తక్కువగా ఉంటోంది.
పాటించాల్సిన జాగ్రత్తలు.:
శస్త్ర చికిత్స తరువాత ఎక్కువ బరువు మోయడం గానీ, ఎక్కువగా మెట్లు ఎక్కడం గానీ చేయకూడదు.కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటూ రోజు వ్యాయమం చేయడం చాలా అవసరం. వీటివల్ల శరీరం బరువు పెరగకుండా ఉండి కీళ్లు ఎక్కువ కాలం ధృఢంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. వ్యాయామాల్లో వాకింగ్, స్విమ్మింగ్‌లు చేయవచ్చు కానీ, రన్నింగ్ మాత్రం చేయకూడదు.ఏమైనా కీలు మార్పిడి చికిత్స నడకల్లో మళ్లీ వేగాన్ని నింపుతోంది.
మోకాళ్ల నొప్పులు స్త్రీలకే ఎక్కువెందుకు?
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిలో 90 శాతం మంది స్త్రీలే. అయితే మనదేశంలో చాలామంది మహిళలు నొప్పిని పట్టించుకోకుండా తిరుగుతుండటంతో తొలిదశలోనే చికిత్స తీసుకోవటం సాధ్యం కావటం లేదు. పైగా వయసుతో పాటే కీళ్ల నొప్పులూ వస్తాయని, వీటిని తప్పించుకోవటం అసాధ్యమనీ భావిస్తుంటారు. మెనోపాజ్ కూడా ఆ సమయంలోనే మొదలై ఎముకలు గుళ్ల బారటం ఎక్కువవుతుంది. ఇలాంటి సమస్యలెన్నో మోకాళ్ల నొప్పులను మరింత తీవ్రం చేస్తున్నాయి. అంతేకాదు శరీర నిర్మాణ పరంగానూ చిక్కులు ఎదురవుతున్నాయి.
* స్త్రీలకు తుంటి భాగం విశాలంగా ఉండటంతో కీలు దగ్గర తుంటి ఎముక లోనికి వంగి ఉంటుంది. దీంతో మోకాలుపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. మోకాలి చిప్ప మృదులాస్థిని ఒరుసుకుంటూ పక్కలకు కదులుతుంది. తుంటి విశాలంగా ఉండటం వల్ల తొడ కండరాలు సాగి మోకాలి కండర బంధనాల్లో నొప్పి కలగజేస్తుంది.
* పురుషులతో పోలిస్తే స్త్రీలల్లో కండ శాతమూ తక్కువే. అందువల్ల వీరి మోకాళ్లకు కండరం దన్ను కూడా అంతగా ఉండదు. అలాగే స్త్రీలల్లో వదులుగా ఉండే కండరం ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా గాయాల బారినపడేలా చేస్తుంది.
* మోకాలి కండర బంధనాలు కూడా వీరిలో చిన్నగా ఉంటాయి. దీంతో కీలు స్థిరంగా ఉండటమూ తగ్గుతుంది.
* సాధారణంగా కాన్పు తర్వాత స్త్రీలు బరువు పెరుగుతారు. ఒక కిలో బరువు పెరిగినా మోకాలు మీద అంతకు ఆరు రెట్ల భారం పడుతుంది. స్థూలకాయుల్లో తుంటి వద్ద కొవ్వు పేరుకుపోవటం వల్ల ఆ భాగం విశాలమై మోకాళ్ల మీద అదనపు ఒత్తిడి పడుతుంది.
* మెనోపాజ్ తర్వాత ఎముకలు గుళ్ల బారటం మోకాళ్ల నొప్పికి ప్రధానంగా దోహదం చేస్తుంది.
మారుతున్న జీవనవిధానం, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులను తెచ్చిపెడుతున్నాయి. ఆరవై ఏళ్ల వయసులో వచ్చే మోకాళ్ల నొప్పులు ఇప్పుడు నలభైఐదేళ్లకే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో మోకాళ్ల నొప్పుల సమస్య తీవ్రంగా ఉంటోంది. ఆరోగ్యంపై శ్రద్ధ కొరవడటం, కాల్షియం లోపం, వ్యాయామం చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. స్త్రీలలో రుతుస్రావం ఆగిపోయిన తరువాత కాల్షియం లోపం ఇంకా ఎక్కువవుతుంది. పాలు, ఆకుకూరలు తగినంత తీసుకోకపోవడం వల్ల శరీరంలో కాల్షియం పరిమాణం తగ్గిపోతుంది. చిన్న వయసులోనే కీళ్లవాతానికి గురవడం, ‘హైపోథైరాయిడిజం’ వల్ల మోకాలు త్వరగా అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా మోకాలి నొప్పి మొదలవుతుంది. మోకాలి నొప్పికి మరొక ప్రధానకారణం స్థూలకాయం. అధిక బరువు వల్ల మోకాలు కీళ్లలో అరుగుదల ఎక్కువగా జరిగి నొప్పి ప్రారంభమవుతుంది. ప్రాథమిక దశలో మోకాలి నొప్పిని ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే మందులతోనే నయం అవుతుంది. ఆలస్యం చేస్తే కీళ్ల మధ్య అరుగుదల ఎక్కువయి సమస్య మరింత ఎక్కువవుతుంది. ప్రస్తుతం ఈ నొప్పులకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు ''గ్లూకోజమైన్'' అనే మందులు వాడటం ద్వారా చాలా వరకు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటితో పాటు వ్యాయామం చేయడం, అధిక బరువు తగ్గించుకోవడం, కీళ్లవాతానికి తగిన చికిత్స తీసుకోవడం వల్ల మోకాలి నొప్పిని తగ్గించుకోవచ్చు.
ఎవరికి ఆపరేషన్ అవసరం
గత కొద్ది సంవస్తరాలుగా మోకీలు నొప్పితో బాధపడుచున్నవారికి ,
10 నిముషాలకంటే ఎక్కువ సమయము నిలబడలేకపోతున్నవారికి,
5-6 మెట్లు కూడా ఎక్కలేనివారికి ,
కనీసం 500 అడుగులు కూడా నడవలేని వారికి,
రోజు వారి కార్యక్రమాలు చేసుకోలేకపోతున్న వారికి ఆపరేషన్ అవసరమవుతుంది.
నొప్పి నివారణ మాత్రలు వాడినప్పటికీ పనిచేయనపుడు,
మోకాలు మధ్యలో ఉండే గుజ్జు పూర్తిగా అరిగిపోయి తీవ్రమైన నొప్పలతో బాధపడుతున్నప్పుడు మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడమే ఉత్తమం,
కాళ్లు వంగిపోయిన వారికి కృత్రిమ కీలు అమర్చడం చక్కని పరిష్కారం.
ఏది ఉత్తమం
అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పరిశోధనల అనంతరం వివిధ రకాల కృత్రిమ మోకాళ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రోగి సౌలభ్యాన్ని బట్టి, ఆరోగ్య స్థితిని పరిశీలించి ఏ రకమైనది సరిపోతుందో వైద్యులు నిర్ధారిస్తారు. మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న 10 నుంచి 15 శాతం మందిలో లోహ సంబంధమైన అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి కొందరిలో ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ అలర్జీలను నివారించే అధునాతమైన కృత్రిమ సిరామిక్ మోకాళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Telephone
Website
Address
D. No : 16-9-5/1, Joseph Street, Poornanandam Pet, Near Railway Station, VIJAYAWADA
Vijayawada
520001