Samiti Samvad Telangana

Samiti Samvad Telangana

Samiti Samvad Telangana Pranth Page. Rashtra Sevika Samiti is world’s largest voluntary women organization working for betterment of whole society.

Keeping Indian values at core, it strives for creating a well-organized society devoted to Rashtrahit
Goal-Rrebuilding glorious Rashtra

Rashtra Sevika Samiti was founded by Laxmibai Kelkar at Wardha in October 1936. It is today the largest socio-cultural women’s organization working for the development of women in India and rebuilding glorious nation. General Information
Rashtra Sevika Samiti is

15/08/2024

వాత్సల్యపూర్ణ భారతమాత
78 సం.లు పూర్తి చేసుకుని అమృతోత్సవాలు జరుపుకుంటోంది. ఆసేతు హిమాచలం స్వతంత్ర ఉత్సవాల్లో పులకరించిపోతోంది.
ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ముచ్చటగా ఎగురుతోంది.ప్రతి వీధీ త్రివర్ణ రంజితమై కొత్తకాంతిని విరజిమ్ముతోంది.
కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఉన్న జెండాల వరుస మువ్వన్నెలతోరణమై "దేశమంతా ఒక్కయిల్లై.."
అన్న భావనను కలుగజేస్తోంది.అవును.ఈ దేశం నాఇల్లనీ,ఇక్కడి వారందరూ నా సహోదరులని గుర్తు జేస్తోందీ HarGharTiranga..

Photos from Samiti Samvad Telangana's post 28/07/2024

మగువల మనసుని దోచుకున్న ఔషధీయ సౌందర్యసాధనం గోరింటాకు. ఇది నిజానికి గౌరింటాకు. పార్వతీ దేవి యొక్క రజస్వలా సమయంలో ఈచెట్టు ఆవిష్కృతమైనట్టుగా పౌరాణికంగా చెప్పబడుతోంది. ఈ పురాణ ప్రశస్తిలోని శాస్త్రీయ కోణం ఏమిటంటే, స్త్రీలయొక్క గర్భ సంబంధిత దోషాలను తొలగించగల గుణం ఈ చెట్టు యొక్క కణాలలో కలదని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

శరీరంలోని అధిక వేడిని తగ్గించే గుణం కల ఈ ఆకులని ముద్దగా రుబ్బి, ఆ ముద్దని అరికాళ్ళకూ అరచేతులకూ పెట్టుకుంటే అవి ఎరుపు రంగు లోకి మారతాయి. దీనినే పండటం అంటాము. ఈ పండటం లేత నారింజ రంగు నుంచీ ముదురు ఎరుపు వరకూ వుంటుంది.
తడిలో, నీళ్ళలో పనిచేసే స్త్రీలకు కాలి వ్రేళ్ళ మధ్య పాయటం, మడమలు పగలటం జరుగుతూ వుంటుంది. వర్షాకాలంలో ఇది మరింత ఎక్కువగా వుంటుంది. అనేక ఔషధీయ విలువలున్న గోరింటాకు పిప్పిగోళ్ళనీ, గోరుచుట్లనీ రానివ్వదు. వస్తే తగ్గిస్తుంది. అందుకే ఆషాఢ మాసంలోనూ, అట్లతద్దీ మరియు ఉండ్రాళ్ళ తద్ది రోజులలోనూ ఈ గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకోవాలనే నియమాన్ని ఒక ఆచారంగా ఏర్పరచారు మన పెద్దలు. లేకపోతే తమగురించి తాము పట్టించుకునే తీరకను, వెసులుబాటును ఏర్పరచుకుంటారా మహిళలు?! మన సాంప్రదాయంలో పొందు పరచబడిన వ్యాధినివారణా మరియు ఆరోగ్య పరిరక్షణా కార్యక్రమంగా ఈ గోరింటాకును పెట్టుకోవటాన్ని చెప్పవచ్చు.

ప్రతీ శుభకార్యమూ గోరింటాకు పెట్టుకోవటంతోనే ప్రారంభమవటం సనాతన సాంప్రదాయంగా విరాజిల్లుతోంది. సౌందర్యసాధనలో, పోషణలో పసుపు తర్వాతి స్థానం గోరింటాకుదే అనటం అతిశయోక్తి కాదు.
పెడిక్యూర్, మానిక్యూర్లంటూ బ్యూటీపార్లర్ల చుట్టూ తిరిగే తీరికా, ఓపికా మరియూ ఆర్ధిక స్తోమతా లేకపోయినా, అన్ని పనులనూ తామే స్వయంగా చేసుకున్నా మన పైతరం మహిళల పాదహస్తాలు అంత మృదువుగా వుండటానికీ, కారణం.... కాలి, చేతివ్రేళ్ళ గోళ్ళని పగడాల్లా మెరిపించే గోరింటాకును వాడటమే.
గోరింటాకును శిరోజాల సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. ఇది తలనుంచి శరీరపు వేడిని తగ్గించి, మాడుని చల్లబరచటమే కాక, శిరోజాలకు మంచి పోషకంగా పనిచేసి వాటికి దృఢత్వాన్ని, నునుపును మరియు మృదుత్వాన్ని అందిస్తుంది.

గోరింటాకు వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కాబట్టే కేవలం వ్యక్తిగతంగా లబ్దిపొందటం మాత్రమే కాక, తమ చుట్టూ వున్న తోటి మహిళలతో కలసి పంచుకుంటూ సామూహికంగా గోరింటాకు పెట్టుకోవటం ఆయుర్వర్ధనమనికీ, అయిదోతనానికీ ఆలవాలమని చెప్తూ, ఉత్సాహంగా ఒక ఉత్సవంగా జరుపుకుంటారు.

సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో అనేకమంది మహిళలు వివిధ ప్రాంతాల్లో గోరింటాకు ఉత్సవాన్ని జరుపుకున్నారు.ఆనందోత్సాహాల మధ్య సంరంభంగా సాగిన వేడుకల ఫొటోలను మనం క్రింద చూడవచ్చు.

భారత్ మాతాకీ జై.

- Smt.Mahati Vakkalanka, Sevika

05/07/2024

బెంగాల్ లో మహిళలపై విచక్షణారహితెంగా జరుగుతున్న అరాచకాలను నిరసిస్తూ వివిధ NGO
లకు చెందిన మహిళలు నేడు భాగ్యనగర్ లో ఉద్యమించారు.

Photos from Samiti Samvad Telangana's post 05/07/2024

Today, women belonging to various NGOs protested against the anarchic rule of government in the state of West Bengal which is grossly discriminating against women in a large scale. A large number of women in Hyderabad and Warangal under the leadership of Organisations like Rani Rudrama Devi Samithi, Bhagini Nivedita Seva Samithi, Aparajita Seva Samithi, Shivshakti Trust, Anjani Mata Seva Trust and Saraswati Seva samiti met with the higher officials in the Government of various districts of Telangana State and submitted reports condemning the brutal attacks on women in Bengal.

మహిళా శక్తి సమ్మేళనం కూకట్ పల్లి బాగ్ | శ్రీమతి శ్రీపాద రాధ ప్రసంగం | రాష్ట్రీయ సేవిక సమితి 22/02/2024

మహిళా శక్తి సమ్మేళనం కూకట్ పల్లి భాగ్

రాష్ట్ర సేవికా సమితి తెలంగాణా ప్రాంత కార్యవహిక మాననీయ శ్రీపాద రాధ గారు తమ సందేశాన్ని కార్యక్రమం లో పాల్గొన్న మహిళందరికీ అందించారు.

https://youtu.be/SXcLab-7iMM?si=CZogpSuExOmHphXm

మహిళా శక్తి సమ్మేళనం కూకట్ పల్లి బాగ్ | శ్రీమతి శ్రీపాద రాధ ప్రసంగం | రాష్ట్రీయ సేవిక సమితి websitehttps : //www.jagritiweekly.com/facebookhttps: //www.facebook.com/JagritiTeluguWeekly/జాగృతి తెలుగు వార పత్రికఒక సం: చందా రూ.850/- చెల్లించుటకు ల...

మహిళా శక్తి సమ్మేళనం కూకట్ పల్లి బాగ్ | మా|| అన్నదానం సీతాగాయత్రి ప్రసంగం | రాష్ట్రీయ సేవిక సమి 22/02/2024

మహిళా శక్తి సమ్మేళనం కూకట్ పల్లి భాగ్
ప్రధాన వక్తా రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ కార్యవహిక మాననీయ అన్నదానం సీతాగాయత్రీ గారు తమ సందేశాన్ని కార్యక్రమం లో పాల్గొన్న మహిళందరికీ అందించారు.
https://youtu.be/4e278LGQKrg?si=_5lnsFxaQdNvJ0gE

మహిళా శక్తి సమ్మేళనం కూకట్ పల్లి బాగ్ | మా|| అన్నదానం సీతాగాయత్రి ప్రసంగం | రాష్ట్రీయ సేవిక సమి websitehttps : //www.jagritiweekly.com/facebookhttps: //www.facebook.com/JagritiTeluguWeekly/జాగృతి తెలుగు వార పత్రికఒక సం: చందా రూ.850/- చెల్లించుటకు ల...

22/01/2024

రాముడు...సనాతన జ్ఞానానికీ క్షాత్రానికీ ప్రతిరూపం.
రాముడు...భారతీయ పూర్ణత్వానికీ విలువలకూ నిలువెత్తు రూపం.
రాముడు...తరతరాలుగా కోట్లాదిమందికి ఆదర్శమైన సంస్కారం మూర్తి.
అటువంటి రాముని ఆయన జన్మస్థానంలో పునః స్థాపించడానికి 500 సంవత్సరాలుగా ఎడతెగని యుద్ధాలు, అలుపెరుగని ఆందోళనలు ఊహకందని త్యాగాలు, సంయమనం కోల్పోని న్యాయపోరాటాల కారణం. వీటన్నిటి సమిష్టి ఫలితం ఈరోజు అయోధ్యలో జరిగిన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట.
ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవమే కాదు దేశ భవిష్యత్తును మలుపుతిప్పే గొప్ప సంఘటన.
మానవీయ విలువల పునరుత్థానం.
విశ్వ గురు స్థానంలో భారత దేశ పట్టాభిషేక ముహూర్తానికి తొలి భూమి పూజ.
నిద్రాణమైన హైందవజాతి మేలుకొలుపు.
సమాధి చేయబడ్డ భారత జాతి శౌర్య వీర చరిత్ర యొక్క
పునర్ లేఖనం
వేళ్ళూలి పోయిన విదేశీ భావజాలంపై గొడ్డలి ప్రహారం
బీటలు పడినకుటుంబ జీవన వ్యవస్థకు భాతృత్వపు మరమ్మత్తు

హక్కుల కోసం కాదు కర్తవ్య పూర్తి కోసం నిరంతర ప్రయత్నం
వెరసి మహోజ్వల సభ్యతా సంస్కారాల జనజీవన విధానం
కలలో మాత్రమే కనిపించే అందమైన సమాజ నిర్మాణం
ఇక కాల గణన అయోధ్యకు ముందు అయోధ్యకు తర్వాత గా పరిగణించబడుతుంది
ఇది రామ నామ ప్రభావం
ఇది రామప్రసాదం.

- Smt Devarakonda Lalitha Srihari
Sevika

22/01/2024

Ayodhya's Celebrations at Malkajgiri Rani Rudrama Devi Avasam.
Speech by Smt Roopa ji, Prant Sah Bauddik Pramukh.

Jai Shri Ram..🙏🪔🪔⛳

22/01/2024

Ayodhya's Celebrations at Malkajgiri Rani Rudrama Devi Avasam by our Sevikas..

Jai Shri Ram..🙏🪔🪔⛳

22/01/2024

Ayodhya's Celebrations at Malkajgiri Rani Rudrama Devi Avasam by our Pranth Karyavahika and other Sevikas..
Jai Shri Ram..🙏🪔🪔⛳

Photos from Samiti Samvad Telangana's post 22/01/2024

Pran Pratista Celebrations at Malkajgiri Rani Rudrama Devi Avasam by our Pranth Karyavahika and other Sevikas..
Jai Shri Ram..🙏🪔🪔⛳

22/01/2024

జయం జయం శ్రీరామజయం.
జగమంతా శ్రీరామమయం
అవును.శ్రీరాముడికి జయము.
అంటే ధర్మానికి జయము.
రామో విగ్రహవాన్ ధర్మః..రాముడంటే ధర్మ స్వరూపం..ధర్మము మూర్తి రూపం ధరిస్తే అది రాముడు.
ఆనాడు త్రేతాయుగంలో ధర్మం మూడు కాళ్ళమీద నడిచే రోజుల్లో కూడ రాక్షసులూ ఉన్నారు.రావణుడు ముల్లోకాలనీ ఆక్రమించి తన బలం చాటుకున్నాడు కాబట్టి వాడు ఎంత భ్రష్టుడైనా గొప్పవాడని కీర్తించారు కూడ.నేటితీరే.పైగా
మనుషులు బలహీనులన్నారు.నవ్వారు,గేలి చేసారు.అదీ అప్పుడు చూపించాడు రాముడు.గెలవటమంటే ఏమిటో.రాజ్యాలను కాదు హృదయాలను గెలవడమన్నాడు.
ఆబాలగోపాలాన్నీ తన వెంట నడిపించాడు.అడవికైనా వస్తామనేంతగా.
అంతేనా గిరిపుత్రులు,పశుపక్ష్యాదుల ప్రేమను కూడ గెలుచుకొన్నాడు.ప్రేమంటే... తనకోసం ప్రాణాలు వదలడానికైనా సిద్ధమైనంత ప్రేమ.
కోతులతో జతకట్టి రాళ్ళతో వంతెన కట్టి సముద్రాన్ని లంఘించాడు.ప్రకృతినీ వశపరుచుకున్నాడు.చివరకు రావణుని,వాడి రాక్షసత్వాన్ని మట్టికరిపించి చేతులెత్తి దండం పెట్టించాడు.చివరకూ వాణ్ణీ జయించాడు.ఇదంతా ధర్మ మార్గంలోనే సుమా.
యుగం మారినా ధర్మం కేవలం ఒక్క కాలి మీదే నడుస్తున్నా ఇప్పుడూ ఇంతే.కొంచెం కూడ మారలేదు.సంవత్సరాలు గడిచింది బాబర్ అనే రాక్షసుడు రాముడి ఇంటిని కూలగొట్ట ప్రయత్నిస్తే బాలుడిగా ప్రత్యక్షమై నేనున్నానని చాటాడు.తన యింటిమీద కట్టిన మసీదు గుమ్మటాన్ని వానరసేనకు చూపించాడు.హనుమ రామ సేవకుడు.ఆయన చిరంజీవి.ఊరుకుంటాడా...అపుడు లంకని తగలెట్టాడు.ఇపుడు మసీదు గుమ్మటాన్ని కూల్చాడు రామ్,శరత్ కొఠారి ల వేషంలో.కోర్టులు,కేసులు ఎదుర్కొన్నాడు.ప్రతిసారీ తనే గెలిచాడు. పరధర్మీయ పరిపాలనలో ప్రభుత్వ ఆధీనంలో ఇంటి కప్పు లేకుండానే ఉన్నాడు.ఆనాడు 14 సం.లు వనవాసం చేస్తే,ఈనాడు 500 సం.లు తన సొంత ఊళ్ళోనే ఇల్లు లేకుండా ఉన్నాడు.ఎట్టకేలకు ధర్మాన్ని గెలిపించుకున్నాడు. చట్ట ప్రకారం గెలిచాడు. అత్యన్నత న్యాయస్థానం ద్వారా తీర్పించుకొన్నాడు. భవ్య సుందర ఆలయ నిర్మాణం జరిపించుకొనిఅందులో ప్రాణం పోసుకుంటున్నాడు మరి.అందుకే అది కేవల ఆలయం కాదు.ఒక మహోన్నత శక్తి కేంద్రం.దివ్య స్ఫూర్తి కేంద్రం.ధర్మ విజయాన్ని మన కన్నుల ముందు సాకారం చేసిన విజయధామం.
రండి
చూసి తరిద్దాం మరి.అంగరంగ వైభవంగా పట్టాభిషేకం చేసేద్దాం.
జయ్ జయ్ శ్రీరామ అని నినదిద్దాం.

- పాటిబండ్ల సరిత



శ్రీరామ జయం.

22/01/2024

అంతా రామమయం
జగమంతా రామమయం
అవును.ఇపుడే అనుకుంటున్నారేమో...కాదు కాదు
500 సంవత్సరాల నుండి.
అంతకు పూర్వం 5000 సంవత్సరాల నుండి.అంతకు ముందు మరో 10000 సంవత్సరాల నుండి...
కాదేమో...బహుశా రాముడు రాజ్యం చేసిన నాటినుండి.కాదు..
దశరథుడికి ,అయోధ్య ప్రజకు రాముడు పుట్టిన నాటినుండి.కౌసల్యకు కడుపులో ఉన్నప్పటి నుండి.
మరేమో...ఆ వరమిచ్చిన యాగపురుషుడు శివ స్వరూపం. సర్వకాలాల్లోనూ సాక్షీ భూతుడు. ఆయనకు సృష్ట్యాది నుంచీ సర్వం రామమయం జగత్.
ఆ చిరంతన జ్యోతి స్వరూపం త్రేతాయుగంలో నరుడి రూపంలో శ్రీరాముడిగా అవతరించి ధర్మాన్ని ఆచరించి చూపితే..నేడు కలియుగంలో మళ్ళీ తన ఉనికిని సంఘటనాత్మక శక్తి లో రాముడిని జగమంతా నింపి కాంతిపూలు పూయిస్తోంది.
పరాయిపాలనలో వనవాసం మొదలైతే స్వధర్మీయుల పాలనలో తిరిగి ప్రాణం పోసుకుంటున్నాడు.
పట్టాభిషేకం ఎంతో దూరంలో లేదు మరి.అందుకే
అయోధ్య మళ్ళీ ముస్తాబైంది రామయ్య పండుగకు.
అంతా రామమయం అంటూ.

శ్రీరామ జయం.

-Smt P Sarita

21/01/2024

శ్రీ రామ జయరామ జయజయ రామ 🚩

Photos from Samiti Samvad Telangana's post 30/10/2023

రాష్ట్ర సేవికా సమితి బాగ్యనగర్ సంభాగ్ ఆధ్వర్యంలో సేవికల పధసంచలన్ కన్నులపండువగా నిర్వహించబడినది. ఆదివారం ఇబ్రహీంపట్నం (వీరపట్నం) లోని పురవీధులగుండా విజయదశమి విజయోత్సవయాత్ర ,పధసంచలన్ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో 195 మంది గణవేషధారీ సేవికలు ,214 మంగళవేషధారీ సేవికలు పాల్గొన్నారు.గణవేషధారీ సేవికలు భగవధ్వజాన్ని చేతపూని ఘోష్ వాదనతో పురవీధులలో శోభాయమానంగా పధసంచలన్ నిర్వహించారు. సేవికల పధసంచలన్ జరుగుతుండగా ప్రజలు పుష్పార్చనతో ,మంగళ హరతులతో స్వాగతించారు.

విజయదశమి ఉత్సవంలో డా!!స్మితారామరాజు ముఖ్య అతిధిగా, ప్రాంత కార్యవాహిక శ్రీపాద రాధ వక్తగా,విభాగ్ కార్యవాహిక ప్రసన్న లక్ష్మిగారు ధీప ప్రజ్వలన తో కార్యక్రమం ప్రారంభం అయింది.
శ్రీమతి డాక్టర్ స్మితా రామరాజు గారు సందేశాన్ని ఇస్తూ ఆడవారు అన్ని రంగాలలో రాణించాలని కోరుకున్నారు . చదువుకున్న మహిళ వల్ల ఇల్లంతా విధ్యావంతులుగా తయారు కాబడతారని సందేశం ఇచ్చారు.

ప్రధాన వక్త మాననీయ శ్రీపాద రాధ గారు మాట్లాడుతూ విజయదశమి ఉత్సవం మనకు ఎలల్లు లేని భక్తి యే సనాతనమని నేర్పుతుందని అన్నారు.ఇది కలియుగం _ అంటే కాళీ యుగం అని చెప్తూ విజయం కావాలంటే మాతృశక్తి సంకల్పం జరగాలి. మన దేశంలో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ ,గగనయాన్ లలో కూడా మహిళల పాత్రవున్నది.చంద్రయాన్ చేరుకున్న ఆ స్థలానికి కూడా అమ్మ పేరుతో శక్తి గా దానిని పేర్కొన్నారు.అమ్మ వారు మొదట గా బంఢాశుర వధ ద్వార మనలోని బద్దకాన్ని వధించాలనే సూచన అని చెప్పారు.రక్తబీజుని వధ ద్వార అరిషడ్వవర్గాలను అణచడమనే విజయాన్ని ,సనాతనధర్మాన్ని అణచివేస్తాననే దున్నపోతు ని మహిష వధ ద్వార అమ్మవారు మనకు మార్గాన్ని నిర్దేశించారని , ఇవి చేయగల భక్తులు హిందూధర్మ విజయం తో అమ్మ భరతాంబికను ఈ విశ్వానికి నిత్య సింహాసనేశ్వరిగా చూస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంత, విభాగ్ కార్యకారిణీ పాల్గొన్నారు.

28/06/2023

భారతే హిందూ నారీణాం భవేత్ సంఘటనం దృఢమ్
ఇతి సంస్థాపితారాష్ట్ర సేవికా సమితీర్యయా
సంస్కృతేశ్చ స్వధర్మస్య రక్షణార్థం సమర్పితం
క్షణశ కణశశ్చైవ జీవితం చందనం యాదహః

సంస్కృతి, స్వధర్మాల రక్షణ కోసం క్షణక్షణము , కణకణము అర్పించిన మహనీయురాలు వందనీయ
లక్ష్మి బాయి కేల్కర్.
సేవికలు అందరితో ప్రేమ గా " మౌసి జి " అని పిలిచే వారు.

Remembering our Vandeeneya on her Birth Anniversary on Ashada Shudda Dashami, today celebrated as .
founded Rashtra Sevika Samiti in the year 1936, a women's organization that runs parallel to RSS across the world.

Rashtra Sevika Samiti

ఎమర్జెన్సీ - భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు | Emergency In India @1975 | vidwan reddy |Jagriti 25/06/2023

Remembering Black Days of Indian Democracy by our Swayamsevak
Shri Vidwan Reddy Garu..🙏




Source: Jagriti

ఎమర్జెన్సీ - భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు | Emergency In India @1975 | vidwan reddy |Jagriti websitehttps : //www.jagritiweekly.com/facebookhttps: //www.facebook.com/JagritiTeluguWeekly/జాగృతి తెలుగు వార పత్రికఒక సం: చందా రూ.850/- చెల్లించుటకు ల...

28/05/2023

https://m.facebook.com/story.php?story_fbid=630945539067204&id=100064552907878&mibextid=Nif5oz

अदंड्योस्मि...धर्मदंड्योसि

प्राचीन भारत में एक अद्भुत प्रथा प्रचलित थी. जब राजा का राज्याभिषेक होता था, तो राजा कहता था ‘अदंड्योस्मि’ अर्थात् मुझे दंड नहीं दिया जा सकता. ऐसे में राजा का गुरु एक कुश का प्रतीकात्मक दंड लेकर राजा को मारता हुआ कहता था - ‘धर्म दंड्योसि’ अर्थात् तुम्हारे ऊपर भी धर्म का दंड है

राजा मार खाते हुए यज्ञ की पवित्र अग्नि की परिक्रमा करता था. यह केवल कर्मकांड नहीं था. राजा इस बात को याद रखते हुए ही समस्त निर्णय लेता था जिससे धर्म की हानि ना हो, धर्म विरुद्ध कोई कार्य न हो.

लोकतंत्र मे संसद सर्वोपरी है. नये संसद भवन मे प्रस्थापित किया जाने वाला चौल वंशीय राजदंड, प्राचीन भारत की महान विरासत का अद्भुत प्रतीक है जो भारत की बढ़ती हुई महत्वाकांक्षा और इच्छाशक्ति को दिखाता है. यह निष्पक्ष और न्यायसंगत शासन के मूल्यों का प्रतिनिधित्व करता है.

1947 मे सत्ता के हस्तांतरण के प्रतीक के रूप मे अंग्रेजो ने यह राजदंड जवाहर लाल नेहरू जी को दिया था. इसके शीर्ष पर भगवान शिव के वाहन नंदी को बनाया गया है जो न्याय और कर्म को दर्शाता है.

22/05/2023

రాష్ట్ర సేవికా సమితి తెలంగాణా ప్రాంతం🙏

రాష్ట్ర రాజధాని నడివీధులలో RSS మహిళా విభాగం భారీ కవాతుIరాష్ట్ర సేవికా సమితి శిక్షావర్గా - సంచల 22/05/2023

రాష్ట్ర సేవికా సమితి తెలంగాణా ప్రాంతా శిక్షావర్గా పధసంచలన్..🙏

రాష్ట్ర రాజధాని నడివీధులలో RSS మహిళా విభాగం భారీ కవాతుIరాష్ట్ర సేవికా సమితి శిక్షావర్గా - సంచల రాష్ట్ర రాజధాని నడివీధులలో RSS మహిళా విభాగం భారీ కవాతుIరాష్ట్ర సేవికా సమితి ప్రవేశ్ శిక్షావర్గా - సంచలన్ I ...

Photos from Samiti Samvad Telangana's post 22/05/2023

రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత శిక్షా వర్గ ఖైరతాబాద్ శిశు మందిర్ పాఠశాల లో 6మే - 21 మే 2023 వరకూ జరిగింది.
ఈ వర్గ లో 23 జిల్లాలు నుండి 116 మంది సేవికలు పాల్గొన్నారు.
సమరొప్ కార్యక్రమానికి రాష్ట్ర సేవికా సమితి అఖిల భారతీయ ప్రచార ప్రసార ప్రముఖ మననీయ సునిలా సోవని గారు ముఖ్య వక్త గా ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సమితి అధికారులు హాజరయ్యారు.

కర్మయోగిని వందనీయ మౌసీజీ 16/04/2023

హిందూ సంఘటన ద్వారా దేశ పరమవైభవ స్థితిని సాధించే లక్ష్యంతో ప్రారంభమైంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. అయితే ఇందులో కేవలం పురుషులు మాత్రమే చేరడానికి వీలుంది. మహిళలు కూడా ఆ లక్ష్య సాధనలో భాగస్వాములను చేయడం కోసం, తేజస్వీ హిందురాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా స్థాపించబడినదే రాష్ట్ర సేవికా సమితి. 1936వ సంవత్సరంలో శక్తి విజయానికి గుర్తుగా విజయదశమి రోజున కేవలం ఐదుమందితో ప్రారంభించిన ఈ సంస్థ నేడు దేశవిదేశాల్లో శాఖోపశాఖలుగా విస్తరించింది. దీన్ని ప్రారంభించినవారు వందనీయ మౌసీజీగా పిలువబడే లక్ష్మీబాయి కేల్కర్.




Source: Samachara Bharati

కర్మయోగిని వందనీయ మౌసీజీ హిందూ సంఘటన ద్వారా దేశ పరమవైభవ స్థితిని సాధించే లక్ష్యంతో ప్రారంభమైంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. అయితే ఇందుల....

22/03/2023

🌿🍏🎋🎍🎋☘️🍀🍃🍂🍁🌴🌳🌱🌿🌾🌿🍏🌿🍏🌿🍏
బ్రహ్మ ధ్వజ నమస్తేస్తు
సర్వాభీష్ట ఫలప్రద
ప్రాప్తేస్మిన్ వత్సరేనిత్యం
మద్గృహే మంగళం కురు.

సకల ఈప్సితములను తీర్చే కాలపురుషునికి నమస్కరిస్తూ ఈ *ఉగాది* మీ కుటుంబములో సమస్త సన్మంగళములను కలిగించవలెనని భగవంతుని ప్రార్థిస్తూ, మీకూ మీ కుటుంబ సభ్యులకు *శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.* 🚩🚩





🌿🍏🎋🎍🎋☘️🍀🍃🍂🍁🌴🌳🌱🌿🌾🌿🍏🌿🍏🌿🍏

08/03/2023

అనంత, అద్వితీయ, అద్భుత శక్తులను తనలో నింపుకున్న స్త్రీ యొక్క గొప్పతనం వివరించుట ఎవరికి సాధ్యం? త్యాగానికి మరో పేరు ఆమె! తాను ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా , తన గురించి ఆలోచించక తన చుట్టూ ఉన్న జీవితాలలో వెలుగును నింపే జీవనజ్యోతి ఆమె. ఆమెలోని ఆలోచన విధానం, ఆ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చే ఆమె చాకచక్యం ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా వాటిని అధిగమించి గెలుపును సాధించే ఆమె ధైర్యసహసాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్య చెక్కితులను చేస్తాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నేర్పరితనం ఆమెకు పుట్టుకతోనే వచ్చిన విద్య.
నేడు భారతదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఇతర దేశాలలో లేని సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ కేవలం మనదేశంలోనే ఉంది. ప్రతి ఒక్కరూ ఈ దేశ సంస్కృతికి దాసోహం అంటున్నారు. మరి ఇంతటి ప్రత్యేకత మన భారతదేశానికి రావడంలో స్త్రీ యొక్క పాత్ర గురించి ఆలోచిస్తే, ప్రతి ఒక్కరూ ఆమెకు పాదాభివందనాలు అర్పించాల్సిందే. స్త్రీ లేకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కుటుంబ వ్యవస్థ ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. స్త్రీ, పురుషులు ఇరువురు తమ కర్తవ్యాన్ని ఎంతో నిష్టతో నిర్వహిస్తారు కానీ ప్రతిసారి ఒక అడుగు ముందుండేది స్త్రీ మాత్రమే , అది అందరూ ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే ఆమెలోని పవిత్రత, త్యాగం, గాంబీర్యం, ప్రేమ, ఆప్యాయత, స్పందించే గుణం, వాగ్దాటి, ప్రశ్నించే తత్వం, పోరాట ప్రతిమ, ఏ పురుషుడిలోనూ కనిపించదు.
ఒక్కసారి మన చరిత్రను తిరగేస్తే మనకు ఎంతోమంది వీరనారిమణులు దర్శనమిస్తారు దేశం కోసం, ధర్మం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన యోధురాలులు ఎంతోమంది. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క మహా యజ్ఞం మహిళల్లో సాధికారత అనేది ఎవరితో వచ్చింది కాదు, పుట్టుకతోనే తాను తనలో తెచ్చుకున్నది, కానీ సమాజం స్త్రీ శక్తిని సహించక వారిని శక్తి హీనులుగా చేసి మళ్ళీ వారికి సాధికారతను అందిస్తున్నట్లే చేసే నాటకాన్ని మహిళలందరూ గమనించాలి. ఒకప్పుడు మహిళలలో ఉన్న ధైర్యసహసాలు మనకు లేవా? ఉన్నాయి కానీ కొన్ని విద్రోహ శక్తులు వాటిని ఆపుతున్నాయి ఒక్కసారి గమనించండి మహిళలు ఎంత కష్టపడ్డా అది ఇంట్లోనైనా, వారి వృత్తిలోనైనా, రాజకీయాలలోనైనా, సమాజంలో ఎక్కడైనా వారికి తగ్గ గౌరవం లభిస్తుందా బాగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. కేవలం ప్రశ్నించే తత్వం ఉన్నవాళ్లు మాత్రమే సమాజంలో ముందుకు వెళుతున్నారు. చాలామంది మహిళలు ఎన్నో కారణాలవల్ల వెనుకబడి పోతున్నారు వారిలో ఉన్న శక్తిని వెలికి తీసి వారిని ముందుకు నడిపించే బాధ్యత ప్రతి మహిళలో ఉండాలి.
ప్రతి స్త్రీ ఒక యోదురాలు కావాలి కుటుంబం పట్ల సమాజం పట్ల తన బాధ్యతను గుర్తుచేసుకొని ఎన్ని అడ్డంకులు వచ్చిన పోరాటం చేస్తూనే విజయాన్ని సాధించాలి. ప్రస్తుత పరిస్థితులలో మన చుట్టూ కనబడని కాలనాగులెన్నో మనపై వేటు వేయడానికి వేచి చూస్తున్నాయి. నేడు పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావం మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను విచ్చిన్నం చేసే విధంగా ఉంది. కుటుంబ వ్యవస్థ కూడా కనుమరుగు అయ్యే అవకాశం కనిపిస్తోంది . అందుకే మన పోరాటం మన ఇంట్లో నుండే మొదలు పెట్టాలి. మన కుటుంబంలో ప్రతి ఒక్కరిలోనూ దైవభక్తి, దేశభక్తి ఉండేలా చేయాలి, వారికి మన సంస్కృతి సాంప్రదాయాలు విశిష్టతను తెలియజేసి ధర్మరక్షణ దేశ రక్షణ వారి ధ్యేయంగా మార్చాలి. అలాగే ప్రతి స్త్రీ కేవలం తన కుటుంబం గురించి కాకుండా సమాజం పట్ల దేశం పట్ల బాధ్యతగా ఉంటూ ధర్మరక్షణ దేశ రక్షణ మన ఊపిరిగా చేసుకొని మన చివరి శ్వాస వరకు పోరాటం చేస్తూనే ఉండాలి.
చివరగా ఒక మాట స్త్రీ మహిమాన్విత్వరాలు, మహోన్నత విశిష్టత కలిగిన మహా తపస్వి, ఆమెలోని తేజస్సు తపశక్తి ఎలాంటి వారినైనా, ఎంతటి కష్టాన్నయినా మార్చగలుగుతుంది. అంతటి గొప్ప స్త్రీమూర్తులు అందరికీ వందనాలు అర్పిస్తూ, ఒక స్త్రీగా జన్మించినందుకు గర్విస్తూ దేశం పట్ల ధర్మం పట్ల కుటుంబం పట్ల నా తొలి శ్వాస కొరకు నా బాధ్యతను నెరవేరుస్తానని ప్రమాణం చేస్తూ, సెలవు...🙏
- Smt Dharmapuri Vani,
Sevika
Warangal

07/03/2023

ఆకాశం లో సప్తవర్ణ మేళనం ఇంద్రధనస్సు అయితే ఇలపై వేల వర్ణాల నవ్వుల హరివిల్లు ఈ హోలీ పండుగ...... ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు చూసే విశాల హృదయంగలిగి, అన్ని విషయాలు భక్తితో ముడివేసి, భగవంతునితో
(కృష్ణ గోపికల క్రీడలతో )అనుసంధానించే హైందవ సంస్కృతికి నమోవాకములర్పిస్తూ అభిమానించే మనందరికీ ఈ రంగుల పండుగ శుభాకాంక్షలు 🚩💐💐

18/02/2023

మన ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.

శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయానే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు.

భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.

భక్తులు ఈరోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులూ చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కధలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. గుణనిధి కధ ఇందుకు సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే "భక్తవశంకర" అన్నారు.

బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలూ పట్టవు. దుర్గుణాలన్నీ అలవరచు కుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహా శివరాత్రి నాడు కావాలని కాకున్నా, అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆవిధంగా ముక్తి పొందుతాడు.
శివరాత్రి మహత్యం అంతటిది.

మీ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.🔱🙏

ఈ పండుగ మీకు సర్వ శుభాలూ చేకూర్చాలని ఆశిస్తాం

- Smt. Srivalli Subramanyam
Sevika

16/02/2023

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ద్వితీయ సర్‌సంఘచాలక్
పరమ పూజనీయ శ్రీ మాధవ సదాశివ గోళ్వల్కర్‌
( గురూజీ)జయంతి నేడు..

భారతదేశ అఖండతను సంరక్షించటానికి, హిందూధర్మరక్షణకు, హిందూ సమాజ ఏకాత్మతకు, సమరసతా నిర్మాణానికి తన సంపూర్ణ జీవితాన్ని సమర్పించిన మహనీయుడు..!

ఇక సర్వత్రా విజయమే విజయం’ అని తన చివరి ప్రసంగంలో గురూజీ వ్యాఖ్యానించారు. విజయ ఏకాదశి నాడు జన్మించిన ఈ మహా పురుషుడు చిరకాలం ఈ మహోన్నత దేశానికి విజయాన్ని ఆకాంక్షిస్తూ తన సంపూర్ణ జీవితాన్ని హోమాగ్నికి సమిథలాగా అర్పించారు. తీవ్రస్థాయిలో తపస్సు చేశారు. ఈ తపస్సు పుణ్య ప్రభావమే నేటి జాతి జాగృత భారత్‌!!

వారి జీవనం యజ్ఞం..🚩🙏

-

Photos from Samiti Samvad Telangana's post 29/01/2023

🙏🇮🇳

The are the 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬 🇮🇳🏆

Congratulations to T20 Female Cricket Team !!
The Nation is feeling proud of you all !!

Photos from Samiti Samvad Telangana's post 26/01/2023

Nation Celebrating 74 th Republic Day to honour the world's lengthiest written Constitution of India.. 🇮🇳

Happy Republic Day..!!

14/01/2023

సంక్రాంతి అంటే మార్పు చెందడం, మారడం, గమనాన్ని మార్చుకోవడం, ప్రవేశించడం అని అర్థాలు వస్తాయి. ప్రకృతి ఆరాధన, కళాతృష్ణ, ఆరోగ్యం, సంఘటితం చేయడం వంటి ఎన్నో కోణాలు ఉన్న అందమైన పండుగ సంక్రాంతి. మరొక సామాజిక కోణం- ఇది సేద్యంతో ముడిపడి ఉన్న వేడుక. సంక్రాంతి లేదా సంక్రమణం అనే సంస్కృత పదానికి వివరణ:

సం – ఉపసర్గ పూర్వక క్రముధాతోః నిష్పన్నః- సంక్రాంతిః

క్రము అంటే గమనం.

భాస్కరస్య యథా తేజో మకరస్తస్య వర్ధతే।

తదైవ భవతాం తేజో వర్ధతామితి కామయే।।

ఏ విధంగానైతే సూర్యుడు అధిక తేజస్సు (వెలుగు), ఎక్కువ పగటికాలం ఉండే విధంగా మకరరాశిలోకి ప్రవేశిస్తాడో, అదేవిధంగా మా ఆరోగ్యం, సంపదలు వృద్ధినొందుగాక!

1. మొదటి రోజు - భోగిమంటలు: సంక్రాంతి ఉత్సవంలో మొదటి రోజున తెల్లవారుజామున, నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంటలు భోగి మంటలు. ఇంటిలో చెక్కలతో కూడుకున్న పాత సామాను పేరుకు పోకుండా, అది దారిద్య్ర చిహ్నంగా భావించి వాటిని ఈ మంటలలో వేసే సంప్రదాయం ఉంది. దక్షిణాయనంలోని బద్ధకం తొలగించడం దీని లక్ష్యం. ఇంకా హరిదాసులు, గంగిరెద్దులు, పతంగుల ఆటలు, కోడిపందేలు అన్నీ జీవిత తత్వాన్ని, ఆనందాన్ని పెంచుకునే, పంచుకొనే గొప్ప విశేషాలుగా ఈ ఉత్సవం దర్శనమిస్తుంది.

2. రెండవ రోజు - మకర సంక్రాంతి : క్రాంతి అనే పదానికి సంస్కృతంలో ముందుకు జరగటం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి కదలటం వల్ల మకర సంక్రాంతి అని పిలుస్తారు.

అయ్యప్ప దీక్ష చేసేవారు 40 రోజుల తరువాత అయ్యప్పను, మకర జ్యోతిని కూడా ఈ రోజే దర్శించుకుంటారు.

» ఈ రోజు గాలి పాటలు ఎగుర వేయటం, పందాలు కాయటం చేస్తారు.
» ఆడవారు ముగ్గులు వేయటం, ముగ్గుల పోటీలు జరుపుకోవటం చేస్తారు.
» ఈ పండుగరోజు ధాన్యం, వస్త్రాలు, నువ్వులు, దుంపలు, చెరుకు దానం చేస్తారు.
» స్త్రీలు పసుపు, కుంకుమ, నువ్వుల వంటలు, వస్త్రాలు, వెన్న ఇతరులకు ఇవ్వటం ద్వారా సకల సంపదలు పొందుతారని వారి నమ్మకం.

3. మూడవ రోజు - కనుమ : ఇది సంక్రాంతి చివరి రోజు, నెల రోజుల సంక్రాంతి ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ రోజున పశువులను లక్ష్మి స్వరూపాలుగా భావించి, అందంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయటం వాళ్ళ ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఎద్దుల పందాలు, కోడి పందాలు కూడా ఈ రోజున నిర్వహిస్తారు. సంక్రాంతిని సాగనంపడానికి ఈ రోజున రథం ముగ్గులు కూడా వేస్తారు. ఈ రోజుతో సంక్రాంతి ముగుస్తుంది.

- శ్రీమతి శ్రీవల్లి సుబ్రమణ్యం,
సేవిక

బంధువులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 🕉️🙏

Videos (show all)

బెంగాల్ లో మహిళలపై విచక్షణారహితెంగా జరుగుతున్న అరాచకాలను నిరసిస్తూ వివిధ NGO లకు చెందిన మహిళలు నేడు  భాగ్యనగర్ లో ఉద్యమి...
Ayodhya's Celebrations at Malkajgiri Rani Rudrama Devi Avasam.Speech by Smt Roopa ji, Prant Sah Bauddik Pramukh. Jai Shr...
Ayodhya's Celebrations at Malkajgiri Rani Rudrama Devi Avasam by our  Sevikas..Jai Shri Ram..🙏🪔🪔⛳
Ayodhya's Celebrations at Malkajgiri Rani Rudrama Devi Avasam by our Pranth Karyavahika and other Sevikas..Jai Shri Ram....
రాష్ట్ర సేవికా సమితి తెలంగాణా ప్రాంతం🙏
1971 war for the liberation of Bangladesh was an unparalleled and monumental military victory that put India on the mili...
* అఖండ భారత్ సంకల్ప దివస్ *            దేశమంతటా స్వతంత్ర భారత 75వ సంవత్సరపు వేడుకలను 75 వారాల పాటు అజాదీ కా అమృత్ మహోత్స...
#అఖండభారత దివస్ 🙏
Telangana Pranth Rakshabandhan Celebrations by our Sevikas @RashtraSevikaSamiti