MLS Snigdha Reddy

26/12/2022

అమ్మమ్మ చెప్పిన కథలు -1
చెప్పింది : తంగెళ్ళ సుజాతమ్మ
కథ : స్నేహం
రాసింది : ✍️ MLS స్నిగ్దారెడ్డి
--------------------------------------------------
అనగనగా ఒక ఊరు. అది చాలా చిన్న పల్లె. ఆ పల్లె పేరు జగత్ పల్లె. ఆ ఊరి చివరలో చాలా పెద్ద పెద్ద బండరాళ్లు ఉండేవి. అందరూ ఆ బండరాళ్ళ ప్రాంతాన్ని " గుండ్ల కాడ " అనే వాళ్ళు.

గుండ్లకాడ పచ్చని గడ్డి పెరిగి ఉండేది. ఆ ఊరుకు చెందిన పశువుల కాపరి చంద్రయ్య ప్రతి రోజూ ఆ ఊరికి చెందిన కొన్ని ఆవులను గేదెలను పొట్టేళ్లను ఒక మందను అక్కడకు తోలుకొచ్చి మేపేవాడు .

ఆ ఊరికి దగ్గరగా ఉన్న కొండలయ్య గుట్ట నుండి ఎలుగుబంట్లు తరుచూ అక్కడికి వచ్చి మంద కోసం చూసేవి. కానీ ఇంటింటి జంతువులు అక్కడికి చేరుకొని ఎంతో సఖ్యంగా , స్నేహంగా ఉండేవి. ఒకటే గుంపుగా కలిసి గడ్డి మేయటం, ఒకటే గుంపుగా కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసి మెలిసి గుంపు గానే ఉండేవి కాబట్టి, ఎలుగుబంట్లు మంద జోలికి రాలేకపోయేవి.

మంద సఖ్యతను చంద్రయ్య అర్థం చేసుకుని గుండ్ల నీడన హాయిగా నిద్రపోయి, సాయంకాలానికి మందను ఇండ్లకు తీసుకువెళ్లేవాడు .

కొంతకాలానికి జంతువుల మధ్య జాతి వైరం ఏర్పడింది. దెబ్బలాట జరిగింది. గుంపులుగా ఉండే జంతువులు విడిపోయాయి. ఒక్కొక్కటి ఒక్కో దిశలో విడి విడిగా గడ్డి మెయ్యటానికి వెళ్లాయి.

ఎప్పటిలా పొదల్లో దాక్కుని ఉన్న
ఒక ఎలుగు బంటి ఇదే సరైన సమయమని సమీపంలో మేస్తున్న ఒక పొట్టేలు మీద దాడి చేయబోయింది. అది గమనించిన మిగతా జంతువులు తమ మధ్య వైరాన్ని మరిచి ఒక్కసారిగా ఎలుగుబంటి మీదకు తిరగబడ్డాయి. ఎలుగుబంటి గుట్టల్లోకి పారిపోయింది. ప్రమాదం నుండి పొట్టేలు రక్షించబడింది.

నీతి: ఐకమత్యమే బలం. పాఠశాలల్లో విద్యార్థులు కూడా ఒక్కో ఇంటి నుండి వస్తారు. అక్కడ కులమత జాతి బేధం మరిచి కలిసి మెలసి ఉండాలి.

25/12/2022

Some memories on the farm 2011- 2022

14/12/2022

At Amaravathi family restarent

Photos from MLS Snigdha Reddy's post 09/12/2022

❤️❤️

Photos from MLS Snigdha Reddy's post 04/12/2022

10 th class exam time
St Joseph's Public School Habsiguda

03/12/2022

❤️

Photos from MLS Snigdha Reddy's post 08/11/2022

Art by Sniggy ( MLS. Snigdha Reddy )

08/11/2022

Art by Sniggy ( MLS. Snigdha Reddy )

08/11/2022

Art by snigdha

11/02/2022

హోలీ వేడుకల్లో పల్లె పదం
( అమ్మ ద్వారా నేర్చుకున్నది )
✍️MLS స్నిగ్ధ రెడ్డి

హోలీ పాటలు

రింగు రింగు బిళ్ల
రూపాయ దండ
దండ కాదు రన్న తామర మొగ్గ
మొగ్గ కాదురన్న మోదుగ నీడ
నీడ కాదు రన్న నిమ్మల బాయి
బాయి కాదురన్న బచ్చలి కూర
కూర కాదురన్న కుమ్మరి మెట్టు
మెట్టు కాదురన్న మేదరి సిబ్బి
సిబ్బి కాదురన్న చీపురుకట్ట
కట్ట కాదురన్న కావడి బద్ద
బద్ద కాదురన్న బారెడు మీసం
మీసం కాదురన్న మాగిన పండు
పండు దీసుకుని పల్లెకు బోతే
పల్లె కుక్కలన్నీ భౌ భౌ అనే
భౌ అన్న కాడ మల్లెలు రాలె
మల్లెలు తీసుకుని మామ కిస్తీ
మామ నాకు పిల్లా నిచ్చే
పిల్లపేరు మల్లెపూవు
నా పేరు జామిందార్

24/12/2021

అమ్మమ్మ చెప్పిన కథలు -3
చెప్పింది : తంగెళ్ళ సుజాతమ్మ
రాసింది : MLS స్నిగ్దారెడ్డి
కథ : అనుసరణ
-------------------------------------------------------
అనగనగా ఒక రాజ్యాన్ని ఒక మహారాజు పాలించేవాడు. మహారాజు కళా పిపాసి. తన తీరిక సమయాల్లో ప్రజాసభను ఏర్పాటు చేసి ప్రజలు ప్రదర్శించే వినోద కార్యక్రమాలను చూసి మిక్కిలి ఆనందించేవాడు. అందులో భాగంగా సామెతలు, పొడుపు కథలు, ప్రశ్నలు జవాబులు, చిక్కుముడులు, నృత్యాలు, పాటలు , వాయిద్యాల ప్రతిభ, అన్నీ ఉండేవి. బహుమతులు కూడా ఉండేవి.
ఇట్లా ఉండగా ఒకరోజు మహారాజు ఎప్పట్లా సభను ఏర్పాటు చేసాడు. ప్రజలు ఎప్పటిలా పెద్ద ఎత్తున హాజరయ్యారు..
సభ మొదలయ్యింది. తమ ప్రదర్శన గురించి తమ పేర్లు నమోదు చేసుకున్న ప్రజలు ఒకరి తర్వాత ఒకరు తమ విద్యను ప్రదర్శిస్తున్నారు. ప్రజలు ప్రదర్శిస్తున్న ఆయా విద్యలను తిలకిస్తూ వినోదిస్తున్న రాజుకు ఒక ఆలోచన తట్టింది. ప్రజలను చిలిపి ప్రశ్నలు అడిగి అటవిడుపు సాగించాలి అనుకున్నాడు. అనుకున్నదే తడువు ప్రజల వినోద కార్యక్రమాలు కాసేవు ఆపాడు . ప్రశ్నావళి మొదలెట్టాడు. అందుకు రామయ్య అనే ఒక పౌరుడిని
ఎంపిక చేసుకున్నాడు.
" నీ పేరేమిటి? " అడిగాడు మహారాజు.
" రామయ్య మహారాజా "చెప్పాడు రామయ్య.
" ఓహో రామయ్య మహారాజ్ అన్నమాట " అన్నాడు మహారాజు.
" అయ్యయ్యో! నా పేరులో మహారాజు లేదు. ఒట్టి రామయ్య మాత్రమే " అన్నాడు రామయ్య.
" ఓహో ఒట్టి రామయ్య అన్నమాట " అన్నాడు మహారాజు.
మహారాజు తనతో వెటకారాలు ఆడుతుంటే రామయ్య ఇంకేం మాట్లాడలేకపోయాడు. తలగోక్కుంటూ నిలబడిపోయాడు. సభ మాత్రం నవ్వులతో నిండిపోయింది.
మహారాజు కూడా కాసేపు నవ్వి-
" శభాష్ ! నవ్వించావు కాబట్టి నీకు నాలుగు వరహాలు కానుక " అంటూనే
రామయ్యను కూర్చో అన్నట్టుగా చేయి చూయించి - అక్కడే మరో పౌరుడిని లేవమన్నట్టుగా అదే చేయితోనే సైగ చేసాడు. ఆ రెండవ పౌరుడు లేచి నిలబడ్డాడు.
' నీ పేరేమిటి? " అడిగాడు మహారాజు.
ఇందాక రామయ్య పడ్డ ఇబ్బందిని చూసాడు.... అందుకు తాను కూడా నవ్వాడు కాబట్టి , జాగ్రత్త వహిస్తూ మెల్లగా చెప్పాడు.
" నారాయణ "
" నారాయణా నీకు కోడి కూర ఇష్టమా ? " వెంటనే అడిగాడు మహారాజు.
" చాలా చాలా ఇష్టం మహారాజా! అందరూ అమ్ముకోవడానికి కోళ్లు పెంచుకుంటారు. నేను మాత్రం కోసుకు తినడానికి కోళ్లు పెంచుకుంటాను " చలాకిగా చెప్పాడు నారాయణ.
అందుకు మహారాజు ఆసక్తిగా కొంచం ముందుకు వంగి " కోడి కూరలో నీకు ఏమి ఇష్టం అడిగాడు? "
" కోడి తోలు మహారాజా ! నిప్పుల మీద కాల్చిన తర్వాత ఆ రుచే వేరు. మింగే కొద్ది తినాలి అనిస్తుంటది " చెప్పాడు నారాయణ.
మహారాజు ఇంకేం అడగలేదు.
" సరైన సమాధానం చెప్పావు. నీక్కూడా నాలుగు వరహాలు " అంటూ నారాయణను కూర్చో అన్నట్టుగా చేయి చూయించి, పక్కనే ఉన్న మరో పౌరుడిని లేవమన్నట్టుగా అదే చేత్తో సైగచేసాడు. ఆ పౌరుడు లేచి నిలబడ్డాడు.
" నీ పేరేమిటి? "లేచి నిలబడ్డ పౌరుడిని అడిగాడు మహారాజు.
" నా పేరు బుచ్చయ్య మహారాజా ! " ఉత్సాహంగా చెప్పాడు.
అందుకు మహారాజు రామయ్యతో ఆడినట్టుగా వెటకారం ఆడలేదు.
" నీకు ఏ కూర ఇష్టం ? " అడిగాడు.
" కుందేలు కూర ఇష్టం మహారాజా! అందరూ అమ్ముకోవడానికి కుందేటి వేట సాగిస్తారు. . నేను మాత్రం కోసుకు తినడానికి కుందేటి వేట సాగిస్తాను " చాలాకిగా చెప్పాడు.
" ఓహో! అయితే కుందేటి కూరలో నీకు ఏమిష్టం ? " అడిగాడు మహారాజు.
" కుందేలు తోలు మహారాజా ! కుందేలును కోసి నిప్పుల మీద కాల్చి ఆ తోలు తింటే... ఆ రుచే వేరు. మింగే కొద్ది తినాలి అనిస్తుంటది" చెప్పుకుపోయాడు బుచ్చయ్య.
మహారాజుకి కోపం వచ్చింది.
బుచ్చయ్య వైపు తీక్షణంగా చూసాడు. సభ నిశ్శబ్దం అయ్యింది.
" నీకు ఎనిమిది వరహాలు వస్తాయి అనుకుంటున్నావు కదూ " అడిగాడు మహారాజు.
మహారాజులో తీక్షణతకు బుచ్చయ్య కిమ్మనలేదు.
మహారాజే మాట్లాడ్డం మొదలెట్టాడు.
" దుర్మార్గుడా ! రామయ్యలా సమాధానం చెప్పి నాలుగు వరహాలు పొందాలి అనుకున్నావు. నారాయణలా సమాధానం చెప్పి మరో నాలుగు వరహాలు పొందాలి అనుకున్నావు. నీ అతితెలివి నా ముందు ప్రదర్శిస్తావా? కుందేలు తోలు ఎవ్వరైనా తింటారా ? అనుసరించే ముందు విచక్షణ ఉండాలి. రామయ్యను అనుసరించాలి అనుకున్నావు బాగుంది. కానీ నారాయణను అనుసరించే ప్రయత్నంలో విరుద్ధమైన సమాధానం చెప్పావు. అన్నింటీలో అనుసరణ మంచిది కాదు. అనుసరించే ప్రయత్నంలో నిన్ను నీవు కోల్పోయావు కాబట్టి నీకు ఎనిమిది కొరడా దెబ్బలు " అంటూ మహారాజు సభ నుండి లేచి వెళ్ళిపోయాడు.
మహారాజు తన ఆంతర్యం గుర్తించి శిక్షించినందుకు బుచ్చాయ్య బిక్క మోహం వేసుకుని నిలబడి పోయాడు.
సభలో గుసగుసలు మొదలయ్యాయి.

నీతి : అనుసరణ అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో పనికిరాదు. మనిషికి సొంత వ్యక్తిత్వం ముఖ్యం.

05/12/2021

అమ్మమ్మ చెప్పిన కథలు - 2
చెప్పింది : తంగెళ్ళ సుజాతమ్మ
రాసింది : MLS స్నిగ్దారెడ్డి
కథ : ఎలుక కథ
--------------------------------------------------------
అనగనగా ఒక అడవిలో ఎలుక నివసించేది . ఎలుకకు స్నేహితులు లేరు. కానీ స్నేహితులు ఉండాలనే కోరిక ఉండేది. అట్లాగే తాను అల్పురాలినని చిన్నగా నల్లగా ఉంటానని ఆత్మన్యూనతా భావం కూడా ఉండేది. అందుకే ఎవ్వరిలో కలువకుండా ఒంటరిగా తిరుగుతున్న ఎలుకకు ఒకరోజు అడవి దున్న కనిపించింది.

“ ఆమ్మో దున్న ఎంత పెద్దదో. దేవుడు ఆ దున్నకు భారీ శరీరాన్ని బలాన్ని ఇచ్చాడు. ఆ శరీరానికి తిరగబడే శక్తి ఇచ్చాడు. కోపంతో రంకెలు వేసి ఎదుటి వాళ్ళను భయపెట్టగలిగే రోషాన్ని ఇచ్చాడు.నాకేమో చిన్న శరీరం ఇచ్చాడు. అల్పురాలిని. అంటూ దున్నను చూస్తూ తనలో తాను వాపోయింది.

ఆ తరువాత ఒక ఏనుగు కనిపించింది. " ఆమ్మో ఏనుగుకు ఎంత పెద్ద తొండం ఉంది.చెట్లను ఎంత ఆవలీలగా విరిచేస్తుంది. అడవిలో ఎంత గంభీరంగా కనిపిస్తుంది .నాకేమో చిన్న శరీరం ఇచ్చాడు. అల్పురాలిని. అంటూ ఏనుగును చూస్తూ కూడా తనలో తాను వాపోయింది.

ఆ తర్వాత నక్క కనిపించింది. దానిని కూడా చూస్తూ... " నక్కకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో ఎన్ని ఎత్తులు ఉన్నాయో. ఎన్ని జిత్తులు ఉన్నాయో .నాకేమో చిన్న శరీరం ఇచ్చాడు. అల్పురాలిని. అంటూ నక్కను చూసి సైతం తనలో తాను వాపోయింది.

తర్వాత ఒక కప్ప కనిపించింది. కప్పను చూస్తూ కూడా వాపోతూ " కప్ప ఎంత చిన్నది అయినా గొప్పది. చక్కగా ఎగిరెగిరి నడుస్తున్నదో... బెక బెక మంటూ అరుస్తూ వాన గురించి సమాచారం అందిస్తున్నది. ప్రజలు కూడా వానదేవుడి కోసం కప్పను పూజిస్తున్నారు.నాకేమో ఏ విలువలేని చిన్న శరీరం ఇచ్చాడు. అల్పురాలిని. అంటూ తనలో తాను వాపోయింది.

అట్లా అడవిలోని ఎలుగుబంటిని చూసి ఆడిస్తారని, కోతిని చూసి గారడీ చేయిస్తారని , చిలుకను చూసి మచ్చిక చేసుకుంటారని.... ఎర్రని ముక్కుతో అందమైనదని, నెమలిని చూసి గొప్పగా నాట్యం చేస్తుందని... అందమైనదని, తాను మాత్రం ఏ గొప్పదనం లేనిది అని , అందం కూడా లేదు అని,జంతువులను పక్షులను ఆన్నీటిని చూస్తూ వాపోయింది.

అట్లా కొంత కాలం గడిచింది. ఎలుకలో ఆత్మన్యూనత తగ్గలేదు. రోజురోజుకు బాధ పడుతూనే ఉంది.

మరి కొంత కాలం తర్వాత ఒకరోజు -

అడవిలో జంతువులు చెల్లా చెదురుగా పరిగెడుతున్నాయి.
“ఏమైంది? అంత భయంగా పారిపోతున్నారు?” అని ఒక నక్కను ని అడిగింది ఎలుక
“పెద్ద పులి వేటకు బయలుదేరింది. కనిపించిన పులి జంతువుల్ని వేటాడుతోంది. నీకేం. చిన్నదానివి. ఏ రాయి చాటున దాగినా ప్రాణాలను కాపాడుకోగలవు. అయినా పులి నిన్ను వేటాడాలని అని కూడా అనుకోదు " అని చెప్పి నక్క పారిపోయింది.

అడవిలో కోతులు నక్కలు జింకలు అన్నీ కూడా పారిపోతున్నాయి.ఏనుగులు దున్నలు మాత్రం పులికి ఎదురు నిలబడి జంతువులను కాపాడాలి అనుకున్నాయి. కానీ సాధ్యం కాలేదు. మొత్తానికి ఒక అడవిదున్న పులి బారిన పడింది. అదంతా సమీపంలో కలుగులో దాక్కొని ఎలుక గమనిస్తూనే ఉంది.
తరువాత మరునాడు -
మరో పులి వేటకి బయలుదేరి గాండ్రిస్తున్నది.
క్రితం రోజు తనతో మాట్లాడిన నక్క పారిపోయే ప్రయత్నంలో పొదలో చిక్కుకుంది. అడవి తీగలు నక్కను బందించాయి. బయటకు రాలేక అవస్థ పడుతున్నది. అది గమనించిన ఎలుక ,తనకు తెలియకుండానే వేగంగా అక్కడికి వెళ్లి వలలా అల్లుకుపోయిన లతల్ని తన వాడి అయిన దంతాలతో పట పట కొరికింది. నక్క కాపాడబడింది.
" ఎలుకా నీకు ఆ దేవుడు వాడి దంతాలు ఇచ్చాడు కాబట్టి నువ్వు నాకు సహాయం చేయగలిగావు. నీకు ఆ దేవుడికి కృతజ్ఞతలు " అని చెప్పి అడవిలోకి పారిపోయింది నక్క.
ఎలుకకు జ్ఞానోదయం అయ్యింది.
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పదనం ఉంటుందని అర్థం అయ్యింది.
ఇక ఆరోజు నుండి ఆత్మన్యూనత వదిలి జీవించసాగింది.
నీతి : బాహ్య రూపం ముఖ్యం కాదు ఆత్మవిశ్వాసం అస్సలైన అస్సలైన అందం. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రతిభను ఖచ్చితంగా ఇస్తాడు. అది తెలుసుకోవడానికే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి.

30/11/2021

నేను ఇక్కడ నా చిన్న చిన్న కథలను రాస్తాను. ఇవన్నీ మా అమ్మ శ్రీదేవిరెడ్డి నాకు చిన్నప్పుడు చెప్పిన కథలు. ఈ కథలు మా అమ్మకు వాళ్ళమ్మ అంటే మా అమ్మమ్మ చెప్పిన కథలు. వీటిని నేను " అమ్మమ్మ చెప్పిన కథలు " అనే టైటిల్ తో రాస్తున్నాను. Pls blessed me

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Some memories on the farm 2011- 2022
Sniggy ❤️
Snigdha (Sniggy )
❤️
❤️ never come back
https://www.youtube.com/@snigdhashorts112
Sniggy ❤️
Sniggy ❤️
Sniggy ❤️❤️
🙏🏿

Category

Website

Address

Hyderabad

Other Authors in Hyderabad (show all)
Maulvi Abdul Qadeer Siddiqi (Hasrat) RA Maulvi Abdul Qadeer Siddiqi (Hasrat) RA
Dargah Road, Devi Bagh, East Bahadurpura
Hyderabad, 500064

Maulvi Abdul Qadeer Siddiqi was an Islamic theologian, Quranic exegete, poet, and a Sufi of Southern

Sudhakar Krishnamurti Sudhakar Krishnamurti
P. O. Box 1563
Hyderabad, 500082

Andrologist, microsurgeon & sexual medicine consultant: Director, Andromeda Andrology Center, India's first. Also, www.SudhakarKrishnamurti.com www.AndromedaAndrologyCenter.com

Ariana - liberating self & others Ariana - liberating self & others
Hyderabad

Author, blogger and a writing enthusiast

Joshila Ramesh Joshila Ramesh
Hyderabad

🔷 Entrepreneur 🔷 UN Volunteer 🔷 Pan-India Recruitment 🔷 https://www.linkedin.com/in/JoshilaRamesh

Sufi Shayari Sufi Shayari
Hyderabad

Heartily Welcome to world of Sufi Shayari Enjoy!! �

Naheed Akhtar Naheed Akhtar
Musheerabad
Hyderabad

In the climate throttled, No shield settles the heart into the state of tranquility. ©® Naheed Akt

Author Author
Hyderabad

I am an Author who has two books in the shelf, Cancel if you've heard this one before, and The Valentine Gift, the first is a collection of Jokes and the second is a storybook th...

Phanindra Rajasekhara Sarma Kesapragada Phanindra Rajasekhara Sarma Kesapragada
02-01-112/B, Road No. 1, Venakt Redy Nagar, Nagole, Telangana
Hyderabad, 500068

As per your wish a full fledged Ayushya homa santhi can be performed on behalf of your family members on any of the auspicious occasions like Janma Thithi/ Nakshatram/ Date of Bir...

Aruna Gogulamanda Aruna Gogulamanda
Hyderabad

Poet, Writer and Social Activist

Mee Veturi Mee Veturi
Hyderabad, 500073

Mee..Veturi: Sundaramu Sumadhuramu

Chetan Kolker Chetan Kolker
Hyderabad
Hyderabad

A film is a petrified fountain of thought. If it can be written or thought it can be filmed said Stanley Kubrick once. I do all the three...Think , Write & Film !!!

Narendra's Narendra's
Hyderabad, 500062

It's Me.. Cool..