Ravi kumar_tammali_Ntv - business news
Nearby media companies
500084
HYDERABAD
500075
business news
ఏప్రిల్ 8 నుంచి నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు..?
10tv.in ఢిల్లీ: 'మీ బ్యాంక్ లావాదేవీలు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా.. అయితే వెంటనే వాటిని క్లియర్ చేసుకోండి'. ఎందుకంటే వచ్చే ఏప్రిల్ 8 వ తారీఖు నుంచి బ్యాంక్, ఏటీఎం సేవలు స్తంభించిపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం, ఏటిఏం, ఆన్‌లైన్ సేవలన్నీ మైక్రోసాఫ్ట్ ఆధీనంలోని విండోస్ ఎక్స్‌పీ ద్వారా నడుస్తు...
వర్డెంచి కాన్సెప్ట్ బైక్‌ను ఆవిష్కరించిన సమీరా రెడ్డి..
ముంబైకి చెందిన కస్టమ్ బైక్ మేకర్ వర్డెంచి (Vardenchi) గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో ఓ సరికొత్త మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను ప్రదర్శిచింది.
హీరో మోటోకార్ప్ నుంచి 600 సీసీ స్పోర్ట్స్ బైక్..
Harley-Davidson Street™ 750 launched at the Delhi Auto Expo today...
సామ్‌సంగ్ గెలాక్సీ గ్లాస్!
ప్రపంచపు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ మరో విప్లవాత్మమైన ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. గూగుల్ గ్లాస్‌కు పోటీగా తన సొంత వర్షన్ గెలాక్సీ గ్లాస్‌ను సామ్‌సంగ్ వృద్ధి చేస్తున్నట్లు కొరియా టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది.
సెప్టంబర్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ గ్లాస్! సామ్‌సంగ్ గెలాక్సీ గ్లాస్‌గా పేర్కొనబడుతున్న ఈ స్మార్ట్ గ్లాస్ కంప్యూటింగ్ డివైస్‌ను బెర్లిన్ వేదికగా సెప్టంబర్‌లో నిర్వహించే ఐఎఫ్ఏ 2014లో ఆవిష్కరించే అవకాశముందని సామ్‌సంగ్ ఎగ్జిక్యూటివ్ సదరు మీడియాలకు తెలిపారు.
2013 ఐఎఫ్ఏ ఎగ్జిబిషన్‌లో సామ్‌సంగ్ తన మొట్ట మొదటి స్మార్ట్‌వాచ్ గేలాక్సీ గేర్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాము రూపొందించిన కాన్సెప్ట్ స్మార్ట్ గ్లాస్ కొత్త కమ్యూనికేషన్ సంస్కృతికి తెరలేపుతుందని సదరు ఎగ్జిక్యూటివ్ కొరియా టైమ్స్‌తో అన్నారు. గూగుల్ గ్లాస్ ఓ కొత్త ఒరవడి! గూగుల్ సంస్థ వినూత్న ఆవిష్కరణ ‘గూగుల్ గ్లాస్'. ఈ టెక్నాలజీ ప్రపంచానికే సరికొత్త ఒరవడి.
ఈ గ్లాస్ ఆధారంగా వీడియో చాటింగ్.. మెసేజింగ్.. వెబ్ బ్రౌజింగ్ ఇలా అనేక ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఈ కళ్లద్దాలతో ఫోటోలను సైతం చిత్రీకరించుకోవచ్చు. వీడియోలను సైతం రికార్డ్ చేసుకోవచ్చు. ఈ రియాలిటీ గ్లాసెస్ ఆధారంగా ఆచూకీలను సైతం కనుగొనవచ్చు.
వీటి తయారీకి గూగుల్ రెండేళ్ల పాటు శ్రమించింది. స్మార్ట్‌ఫోన్ తరహలో వాయిస్ కమాండ్‌లకు గూగుల్ గ్లాస్ సహకరిస్తుంది. గూగుల్ గ్లాస్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. గూగుల్ గ్లాస్ సాయంతో చేతులతో పనిలేకుండా ఫోటో చిత్రీకరించటంతో పాటు వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.
గూగుల్ గ్లాస్ ద్వారా ఆన్‌లైన్ శోధనలు సులువుగా నిర్వహించుకోవచ్చు. గూగుల్ గ్లాస్ బుల్ట్ ఇన్ కెమెరా, స్పీకర్ టెక్నాలజీతో కూడిన మైక్రోఫోన్ ఫీచర్లను కలిగి ఉంది. వైర్‌లెస్ కనెక్షన్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను సులువుగా సింక్ చేసుకోవచ్చు. గూగుల్ గ్లాస్‌లు 5 కలర్ వేరియంట్‌లలో లభ్యం కానున్నాయి. గూగుల్ గ్లాస్ ప్రాజెక్ట్ 2010లో ప్రారంభమైంది.
నల్లధనాన్ని వెలికితీసి, నకిలీ నోట్లను అరికట్టే చర్యల్లో భాగంగా 2005 సంవత్సరానికి ముందు జారీచేసిన అన్ని కరెన్సీ నోట్లనూ ఉపసంహరించాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నిర్ణయించింది. రూ.500, రూ.వెయ్యి నోట్లతో సహా అన్ని పాత నోట్లనూ వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఉపసంహరిస్తామని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్‌బీఐ పేర్కొంది. ప్రజలు సమీపంలోని బ్యాంకుకు వెళ్లి నోట్లను మార్పిడి చేసుకోవాలని సూచించింది.
2005కు ముందు జారీచేసిన నోట్ల వెనుకభాగంలో వాటిని ముద్రించిన సంవత్సరం ఉండదు. కనుక ప్రజలు సులువుగా వీటిని గుర్తించవచ్చు. అదే 2005 తర్వాత జారీ చేసిన నోట్ల వెనుకవైపు కింది మధ్యభాగంలో ముద్రణా సంవత్సరం ఉంటుంది. పాత నోట్ల చెల్లుబాటుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 1 తర్వాత బ్యాంకుకు వెళ్లి పాత నోట్లను మార్చుకుంటే సరిపోతుంది. తదుపరి ప్రకటన వెలువడే వరకు బ్యాంకుల్లో పాత నోట్ల మార్పిడి సౌకర్యం ఉంటుందని ఆర్‌బీఐ వివరించింది.
జూలై 1వ తేదీ తర్వాత 10 పీసుల కంటే ఎక్కువ రూ.500, రూ.వెయ్యి నోట్లను మార్పిడి చేసుకునే వారు తమ గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. 2005కు ముందు జారీ చేసిన నోట్ల ఉపసంహరణకు ఆర్‌బీఐ ఎలాంటి కారణం వెల్లడించనప్పటికీ, నల్లధనాన్ని వెలికితీయడమే బ్యాంకు ఉద్దేశమని భావిస్తున్నారు.
కొత్త నోట్లలో పలు అదనపు సెక్యూరిటీ ఫీచర్లుండడం నకిలీ నోట్ల కట్టడికి దోహదపడుతుంది. ప్రస్తుతం రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.500, రూ.1,000 డినామినేషన్లలో నోట్లను జారీచేస్తున్న సంగతి విదితమే.
చలామణిలో 7,351 కోట్ల నోట్లు...
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం... 2013 మార్చి 31 నాటికి దేశంలో 7,351 కోట్ల పీసుల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. వాటిలో రూ.500 నోట్లు 14.6 శాతం, రూ.1,000 నోట్లు 5.9 శాతం ఉన్నాయి.
byke of the year... "Honda Valkyrie"
మారుతి సెలెరియో...
NEW YAMAHA "PES-1" electrical byke..
డ్యూయెల్ టోన్ బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్..@ 1lakh
మరికొద్ది రోజుల్లో భారత మార్కెట్‌కు రానున్న అమెరికాకు చెందిన పురాతన మోటార్‌సైకిల్ కంపెనీ 'ఇండియన్ మోటార్‌సైకిల్స్' మరో అద్భుతమైన మోడల్‌ను ఆవిష్కరించింది.
ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్ షోలో, 2014 ఛీఫ్ క్లాసిక్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని, ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన ఓ మోటార్‌సైకిల్‌ను కంపెనీ ప్రదర్శనకు ఉంచింది.
2015 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్...
మార్కెట్లోకి సామ్‌సంగ్ క్రోమ్‌బుక్.....
గూగుల్ అభివృద్ధి చేసిన క్రోమ్ ఆపరేటింగ్ సిస్టంకు ఇండియన్ మార్కెట్లో ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సరికొత్త సామ్‌సంగ్ క్రోమ్‌బుక్‌ను విడుదల చేసింది. ఈ క్రోమ్‌బుక్ ధర రూ.26,990.
గూగుల్ ఇటీవల కాలంలో హెచ్‌పి, ఏసర్ కంపెనీలు తయారు చేసిన క్రోమ్‌బుక్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.
crome book features
11.6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1366x 768పిక్సల్స్),
గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ ఎక్సినోస్ 5 డ్యూయల్ ప్రాసెసర్,
2జీబీ డీడీఆర్3ఎల్ ర్యామ్,
16జీబి సాలిడ్ స్టేట్ డ్రైవ్,
100జీబి గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ (రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో),
వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు 0.3 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్,
వైఫై, యూఎస్బీ కనెక్టువిటీ (2.0,3.0),
హెచ్ డిఎమ్ఐ అవుట్,
ఆడియో జాక్, బ్లూటూత్.
బ్యాటరీ బ్యాకప్ 6.5 గంటలు.
ప్రీలోడెడ్ ఫీచర్లు: గూగుల్ సెర్చ్, జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ హ్యాంగ్ అవుట్స్.
1.Bharti Airtel outlook upgraded by Standard & Poor's
2.RBI to allow cash-settled interest rate futures on 10-year government bonds
3.Diesel demand down for first time in decade: Indian Oil
4.Cairn India to invest up to $750 million on KG-basin block: report
5.Mahindra to recall 900 units of Scorpio variant
6.Challenges for India Inc to continue in 2014: Moody's
7.Apollo Tyres launches Holland-based Vredestein brand in India
8.Vodafone's Rs. 10,000-crore FDI proposal to be taken up on Friday: report
ఇండియాలోకి ఐప్యాడ్ ఎయిర్
యాపిల్ ఐప్యాడ్ ఎయిర్... మరో రెండు రోజుల్లో ఇండియాలో కూడా అందుబాటులోకి రానుంది. ఐప్యాడ్ ఎయిర్ 9.7 అంగుళాల రెటీనా డిస్‌ప్లేతో, లైట్ వెయిట్‌తో, సన్నటి డిజైన్‌తో లభించనుంది. దీని బరువు 453 గ్రా. సిల్వర్, స్పేస్ గ్రే కలర్స్‌లో లభ్యమవుతుంది. ధర. 35,900.
ఐప్యాడ్ మినీ ధర 28,900.
కుర్చీ... 4 లక్షలు
సాదారణంగా ఓ కుర్చీ కొనాలంటే ఎంత అవుతుంది. వెయ్యి… ఇంకాస్తా కాస్ట్‌లీ కుర్చీ కావాలంటే… పదివేలు… కూర్చునే కుర్చీకి అంత ఖర్చు పెట్టడం అనవసరమనే వాళ్లు కూడా ఉంటారనుకోండి.
ప్రస్తుతం ఓ కుర్చీ రేటు రోజు రోజుకు పెరిగిపోతోంది. దానికోసం పోటీ పడే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. రెండు వేల రూపాయల వద్ద ప్రారంభమైన కుర్చీ ధర… ప్రస్తుతం నాలుగు లక్షల ఇరవైఒక్కవేలు పలుకుతోంది.
అయితే ఈ కుర్చీలో అంత స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా..? అవును స్పెషాలిటీ ఉంది. అదేంటంటే బీజేపీ ప్రధాని అభ్యర్తి, ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఇటీవల ఆగ్రాలో జరిగిన విజయశంఖానాథ్ సభలో ఈ కుర్చీమీదే ఆసీనులయ్యారు. అందుకే దానికంత క్రేజ్.
ఈ కుర్చీని సొంతం చేసుకోవాలనుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందట. ఒకరికి మించి ఒకరు డబ్బు చెల్లిస్తామని చెబుతుండటంతో దాన్ని సప్లై చేసిన కాంట్రాక్టర్ కొండెక్కి కూర్చున్నారట. ఇంకా ఎక్కువ మొత్తం చెల్లించేవారి కోసం వెయిట్ చేస్తున్నాడట.
అయితే పార్టీకి చెందిన నేతలు మాత్రం ఈ కుర్చీల వేలంపాట పార్టీ సంప్రదాయానికి విరుద్ధమని చెబుతున్నారు. ఇక్కడ కొసమెరుపేంటంటే బీజేపీకి చెందిన నేతలే చాలామంది ఈ కుర్చీ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారట.
redesigned... Mahindra MOJO
'ట్రైయంప్ డేటోనా 250' బైక్..
కవాసకి జెడ్1000
bookings are open....
కవాసకి Z-250 బైక్ ఆవిష్కరణ...
హార్లే డేవిడ్సన్ బైక్‌ల తయారీ ఇక భారత్‌లోన
హార్లే డేవిడ్సన్ కంపెనీ పూర్తిస్థాయిలో బైక్‌లను భారత్‌లోనే తయారు చేయనున్నది. యూరప్, నైరుతి ఆసియా దేశాలకు భారత్ నుంచే తమ బైక్‌లను ఎగుమతి చేయాలని కూడా కంపెనీ యోచిస్తోంది.
తాజాగా హర్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750, స్ట్రీట్ 500 మోడల్ బైక్‌లను ఇటలీలోని మిలన్‌లో ఆవిష్కరించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత అంతా కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఈ కంపెనీ ఈ బైక్‌లను తయారు చేసింది. ఈ 2 బైక్‌లను వచ్చే ఏడాది మార్చికల్లా భారత్‌లోనే తయారుచేయడం ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది.
భారత్‌లోనూ, సమీప దేశాల్లోనూ తమ బైక్‌లకు మంచి ఆదరణ లభిస్తోందని హార్లే డేవిడ్సన్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్, సీవోవో మాథ్యూ లావటిక్ చెప్పారు. అందుకే భారత మార్కెట్ అవసరాలను తీర్చడమే కాకుండా, సమీప దేశాలకు ఎగుమతులు చేయడం లక్ష్యంగా స్ట్రీట్ బైక్‌లను భారత్‌లో ఉత్పత్తి చేయనున్నామని వివరించారు.
ప్రస్తుతం హార్లే డేవిడ్సన్ కంపెనీ ఐదు మోడళ్లు-స్పోర్ట్‌స్టెర్, డైనా, సాఫ్టెయిల్, వి-రాడ్, టౌరింగ్‌లలో మొత్తం 11 మోడళ్లను అందిస్తోంది.
ఆకర్షణీయంగా ధరలు...
ప్రస్తుతం భారత్‌లో కంపెనీ విక్రయిస్తున్న అతి చౌక హార్లే డేవిడ్సన్ బైక్.. ‘సూపర్ లో’ ధర రూ.5.6 లక్షలుగా(ఎక్స్ షోరూమ్-ఢిల్లీ) ఉంది. ఈ బైక్ కంటే తక్కువగానే ‘స్ట్రీట్’ మోడల్ బైక్‌ల ధరలు ఉంటాయని సమాచారం
స్ట్రీట్ 500 రూ.3.8 లక్షలు-4 లక్షల వరకూ, స్ట్రీట్ 700 రూ.4.5 లక్షలు-4.8 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా. భారత్‌లోనే తయారు చేస్తున్నందున ఆకర్షణీయమైన ధరలకే వీటిని అందిస్తామని, ఈ ధరల కారణంగా మంచి అమ్మకాలు సాధిస్తామని కంపెనీ ఆశిస్తోంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. హర్యానాలోని బవాల్ ప్లాంట్‌లో ఈ బైక్‌లు తయారవుతాయి.
గూగుల్ కొత్త ట్యాబ్లెట్...
గూగల్ తన నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల కాలంలో యూఎస్ మార్కెట్లలో విడుదల చేసింది. గూగుల్ మైక్రోసైట్ గూగుల్ నెక్సూస్ 7 (సెకండ్ జనరేషన్) ఇండియన్ మార్కెట్ ధరను రూ.25,999గా ప్రచురించింది.
గూగుల్ ప్లే స్టోర్‌లో నెక్సూస్5 స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్ ధరను రూ.28,999గా పోస్ట్ చేయటం జరిగింది. నెక్సూస్ 7 (సెకండ్ జనరేషన్) ట్యాబ్లెట్ వై-ఫై ఇంకా 3జీ/ఎల్టీఈ వేరియంట్‌లలో లభ్యంకానుంది. నెక్సూస్ 5 స్మార్ట్ ఫోన్ 16జీబి ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యంకానుంది.
భారత్‌లో సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ బాస్ ఎడిషన్
సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ బాస్ ఎడిషన్‌లో ఇంజన్, ఎగ్జాస్ట్ (సైలెన్సర్), 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ బ్లాక్ ఫినిష్‌లో లభిస్తాయి. ఇందులో ఇంజన్ పరంగా ఎలాంటి అప్‌గ్రేడ్స్ లేవు, కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే.
రెగ్యులర్ వెర్షన్ సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌లో ఉపయోగించిన 1783సీసీ, వి-ట్విన్, లిక్విడ్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించారు.
భారత మార్కెట్లో సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ బాస్ ఎడిషన్ ధర రూ.16.45 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
స్టాండర్డ్ ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌తో పోల్చుకుంటే దీని ధర సుమారు రూ.50,000 అధికం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సుజుకి డీలర్‌షిప్ కేంద్రాల్లో ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ బాస్ ఎడిషన్ అందుబాటులో ఉంటుంది.
'హ్యుందాయ్ కేర్' సర్వీస్ మొబైల్ అప్లికేషన్.....
దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య నానాటికీ గణనీయంగా పెరిగిపోతున్న సంగతి తెలిసినదే, ఈ నేపథ్యంలో, ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, తమ కస్టమర్లకు స్మార్ట్ సేవలను అందించేందుకు ఓ సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేసింది.
'హ్యుందాయ్ కేర్' (Hyundai Care) పేరుతో కంపెనీ ఓ సర్వీస్ మొబైల్ అప్లికేషన్‌ను పరిచయం చేసింది. ఈ అప్లికేషన్ ద్వారా హ్యుందాయ్ తమ కస్టమర్లకు సర్వీస్ సపోర్ట్, సర్వీస్ నెట్‌వర్క్, కార్ సర్వీస్ క్యాలుక్యులేటర్, సర్వీస్ అపాయింట్‍మెంట్ మొదలైన సేవలను అందించనుంది.
ఈ అప్లికేషన్‌ను అన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై పనిచేసే స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవచ్చు. దీనిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ఐస్టోర్‍ల నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
'హ్యుందాయ్ కేర్' సర్వీస్ మొబైల్ అప్లికేషన్ హైలైట్స్:
సర్వీస్ అపాయింట్‌మెంట్
జిపిఎస్ ఆధారిత డీలర్ లొకేటర్ సర్వీస్ హిస్టరీ
కార్ సర్వీస్ క్యాలుక్యులేటర్,
లేబర్ ఎస్టిమేట్స్
సర్వీస్ రిమైండర్
ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్
హ్యుందాయ్ ఎమర్జెన్సీ రోడ్ సర్వీసుల కోసం
వన్ కాల్ కనెక్ట్ క్యాంపైన్లకు సంబంధించి నోటిఫికేషన్
ఇన్‌బాక్స్
జిపిఎస్ ఆధారిత యాక్సిలరోమీటర్ (ట్రిప్ సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది)
ఫీడ్‌బ్యాక్
భారత్‌కు రానున్న హోండా లగ్జరీ కార్ బ్రాండ్ 'ఆక్యురా' ..
దూసుకుపోతున్న గూగుల్...
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థ షేరు విలువ అమెరికన్ స్టాక్ ఎక్సేంజి నాస్డాక్ లో దూసుకుపోతోంది.
ఏకంగా వెయ్యి డాలర్ల (61,000)స్థాయిని దాటింది. ఈసారి గూగుల్ ఆర్ధిక ఫలితాలు మరింత ఆకర్షణీయంగా ఉండటంతో షేరు విలువ పెరిగింది.
ట్రేడిండ్ ప్రారంభంలో 13 శాతం పైకి వెళ్లి 1,007.40 డాలర్లను తాకింది. దీనిద్వారా వెయ్యి డాలర్ల మార్కును అధిగమించిన రెండో అమెరికన్ సంస్థగా గూగుల్ నిలిచింది.
కేవలం తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో కంపెనీ షేరు, మార్కెట్ విలువ అనేక రెట్లు పెరిగాయి. 2004లో ఐపీవోకి వచ్చిన గూగుల్ షేరు ధర 85 డాలర్లుగా నిర్ణయించింది.
ప్రకృతి ప్రేమికుల కోసం... ఎలక్ట్రికల్ బైక్
ప్రకృతి ప్రేమికుల కోసం తయారుచేసిన సరికొత్త ఎలక్ట్రికల్ బైక్... 'క్వాడ్' (Quad).
చూడటానికి ఆల్ టెర్రైన్ వెహికల్ (ఏటివి) డిజైన్‌ను పోలి ఉండే ఈ వాహనం పూర్తిగా బ్యాటరీ పవర్‌తో నడుస్తుంది.
ఈ నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనం క్వాడ్‌ను అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్, ఆఫ్-రోడ్ అడ్వెంచర్స్ కోసం డిజైన్ చేశారు.
ప్రత్యేకించి ఆధునిక యువతను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసింది.
క్వాడ్ ఎలక్ట్రిక్ వాహనం 48వోల్టుల ఎలక్ట్రిక్ మోటార్‌తో నడుస్తుంది. ఈ మోటార్‌కు 750యాంప్ బ్యాటరీల ద్వారా విద్యుత్ అందుతుంది. రెగ్యులర్ కంబస్టియన్ ఇంజన్ ఎఫీషియన్సీ (9 శాతం)తో పోల్చుకుంటే ఈ సిస్టమ్ ఎఫీషియన్సీ 69 శాతంగా ఉంటుంది.
క్వాడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సేఫ్ చార్జింగ్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో ఎక్స్‌టర్నల్ చార్జర్ ఉంటుంది. గృహ వినియోగానికి ఉపయోగించే విద్యుత్‌తోనే ఈ వాహనంలోని బ్యాటరీలను రీచార్జ్ చేసుకోవచ్చు.
ఈ బ్యాటరీలు పూర్తిగా చార్జ్ కావటానికి 220వోల్ట్ పవర్ అవుట్‌లెట్ ద్వారా అయితే సుమారు 6 గంటలు లేదా 110వోల్ట్ పవర్ అవుట్‌లెట్ ద్వారా అయితే 8 గంటల సమయం పడుతుంది
సింగిల్ ఛార్జ్‌పై క్వాడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని దాదాపు 3 గంటల పాటు నిరంతరాయంగా ఆపరేట్ చేయవచ్చు.
క్వాడ్ ఎలక్ట్రిక్ చార్జింగ్ సిస్టమ్‌తో పాటుగా, ఎమర్జెన్సీ రీచార్జ్ సిస్టమ్‌తో కూడా లభిస్తుంది. ఈ సిస్టమ్‌లో సోలార్ ప్యానెళ్లు ఉంటాయి, వీటి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు బ్యాటరీలలో నిక్షిప్తం అవుతుంది. దీనిని బ్యాకప్ వవర్ సోర్స్‌గా ఉపయోగించుకోవచ్చు.
ఇంకా ఇందులో చార్జ్ ఇండికేటర్‌తో కూడిన డిజిటల్ డిస్‌ప్లే, వార్నింగ్ లైట్స్, తక్కువ విద్యుత్తును గ్రహించే ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
అదరగొట్టే స్టైల్‌లో... డస్టర్
రెనాల్ట్ డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ... లీమోజైన్, డస్టర్ బ్లాక్ ఎడిషన్, డస్టర్ అడ్వెంచర్ లిమిటెడ్ ఎడిషన్‌లతో పాటు డిసి డిజైన్స్ మోడిఫైడ్ డస్టర్‌ను కూడా చూశాం. కానీ, ఇప్పుడు వీటిన్నింటి కన్నాలేటెస్ట్ మోడల్ ఇది. పేరు 'డస్టర్ డిటూర్ కాన్సెప్ట్' (Duster Detour Concept).
జోహన్స్‌బర్గ్ ఇంటర్నేషల్ మోటార్ షోలో ఈ సరికొత్త రెనో డస్టర్ డిటూర్ కాన్సెప్ట్ కార్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
రూ.13,500 తగ్గిన బ్లాక్‌బెర్రీ Z-10’ ధర
బ్లాక్‌బెర్రీ కంపెనీ Z-10 మొబైల్ ధరను 31 శాతం తగ్గించింది. పండుగల సీజన్ సందర్భంగా రూ. 43,490గా ఉన్నZ-10 మొబైల్ ధరను 31 శాతం(రూ.13,500) తగ్గించి రూ.29,990కే అందిస్తున్నామని కంపెనీ తెలిపింది.
లక్ష బ్యాంక్ ఉద్యోగాలు... గెట్ రెడీ
ఈ ఏడాది బ్యాంక్ కొలువులు భారీగా రానున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా జోరుగా విస్తరణ కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో ఈ ఏడాది మొత్తంమీద కొత్తగా 80 వేల నుంచి లక్ష వరకూ బ్యాంక్ ఉద్యోగాలు నమోదుకానున్నట్లు పరిశ్రమ నిపుణులంటున్నారు.
గత ఏడాది వచ్చిన ఉద్యోగాలతో పోల్చితే ఇది 30 శాతం అధికమని వారంటున్నారు. బ్యాంకులు తమ బ్రాంచీ, పోర్ట్‌ఫోలియో విస్తరణ, ఉద్యోగుల వలస, రిటైర్మెంట్, కొత్త బ్యాంకుల ప్రవేశం తదితర కారణాల వల్ల భారీ సంఖ్యలో బ్యాంకు ఉద్యోగాలు రానున్నాయని టాలెంట్‌స్ప్రింట్ ఎండీ, సీఈవో శంతను పాల్ చెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోనే ఆర్‌బీఐ కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు ఇస్తుందని, ప్రభుత్వ రంగ బ్యాంకులు 8 వేల బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నాయని, ప్రైవేట్, గ్రామీణ, విదేశీ బ్యాంకులు తమ నెట్‌వర్క్‌ను విస్తృతం చేస్తున్నాయని, ఫలితంగా బ్యాంకింగ్ రంగంలో భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని వివరించారు. బ్యాంకింగ్ రంగంలో కొలువులు పెరుగుతుండటంతో గత ఏడాది 45గా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ల సంఖ్య ఈ ఏడాది 210కు పెరిగిందని తెలిపారు.
ఐసీఐసీఐలో 6,000 ఉద్యోగాలు
కాగా ఈ ఏడాది 5,000-6,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ చెప్పారు. ఈ ఏడాది కొత్తగా 300 బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నామని 2,000-2,200 కొత్త ఉద్యోగాలివ్వనున్నామని ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ ఎండీ ఎం.ఒ. రెగో చెప్పారు.
కొత్త బ్యాంకుల రాక కారణంగా తమ బ్యాంక్ నుంచి అధికంగా ఉద్యోగులు వలసపోతారని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భావిస్తోంది. అంతేకాకుండా ఈ ఏడాది 800 మంది రిటైరవుతున్నారని, అందుకే తమకు అవసరమైన దానికంటే 30 శాతం అధికంగా ఉద్యోగులను తీసుకోనున్నామని, ఈ ఏడాది 2,000 ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తామని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీ సి.వి.ఆర్. రాజేంద్రన్ చెప్పారు.
నాలుగు రూట్లు.. ఒకే టికెట్!
ఊరికెళ్లాలంటే రాను, పోను టికెట్లు ముందే బుక్ చేస్తాం. మరి నాలుగు ఊళ్లు వెళ్లాలంటే రిజర్వేషన్ కోసం పెద్ద కుస్తీయే పట్టాలి. అలాకాక ఒకే టికెట్‌పై నాలుగు రూట్లలో ప్రయాణించే వీలుంటే!!....
ఇలాంటి సౌకర్యాన్ని బస్‌ఇండియా.కామ్ పోర్టల్ ఆరంభించింది. ‘ఎక్కడి నుంచైనా, ఎక్కడికైనా’ అంటూ... భారత్‌లో తొలిసారిగా ఈ సేవలను ఆవిష్కరించామని పోర్టల్‌ను నిర్వహిస్తున్న రేడియంట్ ఇన్ఫో సిస్టమ్స్ సీఎండీ వేణు మైనేని చెప్పారు. బస్‌ఇండియా.కామ్ ఆంధ్రప్రదేశ్‌లో అడుగిడుతున్న సందర్భంగా... స్పెషల్ స్టోరీ
ఆపరేటర్లు ఎవరైనా... ప్రయాణికులు ఏ నగరం వారైనా... ఏ బస్ ఆపరేటర్ అయినా సరే... బస్‌ఇండియా.కామ్‌లో ఒకే లావాదేవీతో అది కూడా ఒకే టికెట్ తీసుకోవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తి తిరుపతి వెళ్తున్నారనుకుందాం. అక్కడి నుంచి చెన్నైకి, తిరిగి బెంగళూరుకు, అటు నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలనుకుంటే.. ప్రయాణికుడు తనకు నచ్చిన టైంలో, నచ్చిన బస్‌లో వెళ్లొచ్చు. నాలుగు రూట్లకు కలిపి ఒకే టికెట్ వస్తుంది. ఆన్‌లైన్లోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు. భారత్‌లో వినూత్న సేవలు ఫస్ట్ టైం.
క్యాబ్ సర్వీసులు కూడా...
ప్రస్తుతం బస్ రిజర్వేషనే కాకుండా హోటళ్లను కూడా మా పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొద్ది రోజుల్లో ట్యాక్సీలను బుక్ చేసుకునే సదుపాయం ఉంది.
భారత్‌లో 2014 బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్ లగ్జరీ కారు విడుదల
ఐబాల్ నుంచి సరికొత్త హైబ్రీడ్ పెన్‌డ్రైవ్...
ఒకేసారి... కంప్యూటర్తోపాటు స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసేలా సరికొత్త హైబ్రీడ్ పెన్‌డ్రైవ్ ఆవిష్కరించింది ఐబాల్. ఒక వైపు యూఎస్బీ 2.0 కనెక్టివిటీ, మరో వైపు మైక్రో యూఎస్బీ కనెక్టర్ ఉంటుంది. ఈ పెన్‌డ్రైవ్‌ను వోటీజీ సపోర్టుతో కంప్యూటర్తోపాటు స్మార్ట్‌ఫోన్‌కు కూడా ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. 8జీబి వేరియంట్ 599 రూపాయలు. 16జీబి వేరియంట్ 799 రూపాయలు. ఈ తరహా పెన్‌డ్రైవ్ ఇండియాలో విడుదలవటం ఇదే ఫస్ట్ టైమ్.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Hyderabad
5000082
Indian School Of Business
Hyderabad
Bringing you #technews that matter (and that doesn't) !
1/17, Road No 14, Banjara Hills
Hyderabad, 500034
VN Telugu brings you the Latest News, Politics, Current Affairs, Cricket, Sports, Business and Cinema
Kathamandu Nepal
Hyderabad
हम इस पेज पर knowledge के लिय ही पोस्ट करते हैं। कृपया आप इस पेज को follow कर सकते हैं�
Banjara Hills
Hyderabad, 50001
Ttv News Is a cable network based channel This Page Gives you News Update Mostly About Khammam District And Telangana State too And it is Runned by Shaik Ahmed Pasha Correspondent...