Pernati Syam Prasad Reddy
YSR Congress Party
తేది: 10-03-2023,చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన చంద్రగిరి నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న పేర్నాటి.
🔹 చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు.
🔸 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పార్టీ తరపున పోటీ చేస్తున్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి - పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి గారు.
🔹 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు బహిరంగ సభకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
📎 తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాజంపేట ఎంపీ లోక్ సభ ప్యానల్ స్పీకర్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు.
📎 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ పాదయాత్ర చేస్తున్న లోకేష్ చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా అని అన్నాడని, మా దృష్టికి వచ్చిందని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను అడిగి చూడు అభివృద్ధి ఎలా చేశామో చెప్తారని, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పనలో చంద్రగిరి నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు. ఎన్ని కుట్రలు నాటకాలు పాదయాత్రలో చేసిన నారా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ ముఖ్య మంత్రి కాలేరని అన్నారు, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్యామన్న చేస్తున్నాడని మన చంద్రగిరి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలని సభను ఉద్దేశించి తెలిపారు.
📎 రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ భాస్కర్ రెడ్డి గారు బహిరంగ సభను ఏర్పాటు చేస్తే 20 వేల మంది పైచిలుకు వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులు ప్రజలు పాల్గొన్నారు అంటే ప్రజల్లో వైఎస్ఆర్సిపి పార్టీ పైన ఎంత నమ్మకం ఉందో ఈ బహిరంగ సభ ద్వారా ప్రతిపక్షాలకు తెలియజేస్తున్నామని, ఇలాంటి సభలు నిర్వహించాలంటే ఒక్క భాస్కరన్నకె సాధ్యమని మిథున్ రెడ్డి గారు తెలిపారు. రాబోయే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని మరోసారి ప్రజల్లో మా బలం ఏంటో ప్రతిపక్షాలకు చూపిస్తామని అన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన పార్టీ తరఫున పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని రాబోయే రెండు రోజులు కష్టపడి పనిచేసి శ్యాం ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
📎 పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే విధంగా పనిచేయడం వల్లనే చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన పైన ఆధార అభిమానాలు అలాగే ఉన్నాయని అందుకు నిలువెత్తు నిదర్శనమే ఈరోజు జరుగుతున్న బహిరంగ సభేనని అన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానని, మీఅందరి ఆదరాఅభిమానాలతో మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో 13వ తేదీ జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ నమూనాలో 2వ సీరియల్ నంబరులో నా పేరు ఎదురుగా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, వేయించి నన్ను ఆశీర్వదించాలని కోరారు.
తేది: 10-03-2023,పొదిలి,ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు, కెపి నాగార్జున రెడ్డి గారు, జంకె వెంకట రెడ్డి గారు, పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
📎 ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండల కేంద్రంలోని శ్రీ మంజునాథ ఏసీ ఫంక్షన్ హాల్ నందు మార్కాపురం శాసన సభ్యులు కెపి నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు, రీజనల్ కోఆర్డినేటర్, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు విశిష్ట అతిథిగా విచ్చేసిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ప్రైవేటు జూనియర్ కాలేజిలు, డిగ్రీ కాలేజీలు, బిఈడి కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్య మిత్రులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
📎 ప్రముఖులందరూ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
📎 బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు, కెపి నాగార్జున రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు జంకె వెంకట రెడ్డి గారు, ముఖ్య నాయకులు మాట్లాడుతూ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కోవిడ్ తర్వాత నుంచి కొంత ఇబ్బందులు పడుతున్నారని, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.v పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అత్యదిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
📎 శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినప్పటి నుంచి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయులతో, అధ్యాపకులతో దాదాపు 350కి పైగా సమావేశాలు, సభలు, ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొనడం జరిగిందని వారి సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం దొరికిందని, కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగిందని, వాసన్న నాయకత్వంలో మిగిలిన సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 13వ తేదీ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి నన్ను ఆశీర్వదించాలని కోరారు.
📎 ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాల విద్యా సంస్థల యాజమాన్య మిత్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
తేది : 09-03-2023,తిరుపతి,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన చంద్రగిరి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న పేర్నాటి.
📎 ఈరోజు తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్డులో ఉన్న కెవిఎస్ ఆఫీసు నందు ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గారి నేతృత్వంలో జరిగిన చంద్రగిరి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
📎 ఈ సమావేశంలో ముఖ్యంగా రేపు జరగబోవు "చంద్రగిరి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సభ" గురించి ముఖ్యంగా చర్చించుకొన్నారు. ప్రతి పంచాయితీ నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులతో పాటు పట్టభద్రులు వచ్చే విధంగా ప్రణాళకాబద్ధంగా ముందుకూ వెళ్ళాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తేది: 09-03-2023,టంగుటూరు మండలం,కొండపి నియోజకవర్గం,బాలినేని వాసన్న నాయకత్వంలో కొండపి నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని గెలిపిస్తామని మాట ఇస్తున్నాం - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండపి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జు వరికోటి అశోక్ బాబు గారు.
📎 ఈరోజు టంగుటూరు మండల కేంద్రంలో నేషనల్ హైవే పక్కన ఉన్న బీనీడి ఉదయ్ కుమార్ గారి గో డౌన్స్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండపి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జు వరికోటి అశోక్ బాబు గారి అధ్యక్షతన జరిగిన కొండపి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో విశిష్ట అతిధి మాజీ మంత్రివర్యులు, రీజనల్ కోఆర్డినేటర్, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు, ఎమ్మెల్సీ తూమాటి మాధవ రావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు జంకె వెంకట రెడ్డి గారితో కలిసి పాల్గొన్న తూర్పు రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
📎 అశోక్ బాబు గారు మాట్లాడుతూ వాసన్న నాయకత్వంలో కొండపి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను అప్పజెప్పి వారి నేతృత్వంలో 90 శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి వేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
📎 బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి శ్యామ్ కష్టపడి పనిచేశాడని, ముఖ్యంగా మన ముఖ్యమంత్రికి చాలా దగ్గర వ్యక్తని, 2019వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పార్టీ నిర్వహించిన సర్వేలలో కొండపి నియోజకవర్గం వెనుకబడి ఉందని తెలియగానే కొండపి నియోజకవర్గ భాధ్యతలను శ్యామ్ ప్రసాద్ రెడ్డికి మన ముఖ్యమంత్రి గారు అప్పజెప్పారని, ఆయన నమ్మకాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారని, కొండపి అసెంబ్లీ పరిశీలకునిగా అధ్భుతంగా పనిచేశాడని, కానీ కొద్ది ఓట్ల తేడాతో 2019లో ఓడి పోయామని తెలిపారు. మీ అందరు కూడా బాధ్యతతో పనిచేసి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని విజయ తీరాలకు చేర్చాలని కోరారు.
📎 శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు జిల్లాలకు సంబందించిన పట్టభద్రుల, ఉపాధ్యాయ పూర్తి భాధ్యతలను వాసన్న తీసుకున్నాడని, తన ఎన్నికల కంటే ఎక్కువగా మా ఇద్దరు అభ్యర్థుల గెలుపు కోసం నిరంతరం పని చేస్తున్నాడని తెలిపారు. 13వ తేదీ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ నమూనాలో రెండవ సీరియల్ నంబరులో నా పేరు ఎదురుగా మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి, వేయించి ఆశీర్వదించాలని కోరారు.
తేది: 08-03-2023,చిత్తూరు,ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న పేర్నాటి.
💥 సన్నాహక సమావేశ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
💥 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేసిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు.
💥 మీ మీ నియోజక వర్గాల్లో మెజారిటీ తీసుకువచ్చేవిధంగా పని చేయాలని ఎమ్మెల్యేలకు తెలిపిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు.
💥 ఈరోజు తిరుపతిలోని ఆర్టీసీ దగ్గర ఉన్న పియల్ఆర్ గ్రాండ్ నందు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసులు రెడ్డి గార్ల అధ్యక్షతన జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
💥 ముఖ్య నాయకులు మాట్లాడుతూ నూతనంగా నియమించిన JCS కన్వీనర్లతో పాటుగా నాయకులను ప్రచార కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తూ, ప్రతి సచివాలయ పరిధిలో మిగిలిన 4 రోజుల్లో కనీసం 3 సార్లు ప్రతి ఇంటికీ తిరగాలని సూచించారు. 13వ తేది జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ముఖ్యమంత్రి గారి కీర్చిని పెంచే విధంగా కృషి చేయాలని తెలిపారు.
తేది: 07-03-2023,నెల్లూరు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని, పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి గారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపచేద్దాం - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అగ్ర నాయకులు.
📎 ఈ రోజు నెల్లూరు నగరంలోని కనుపర్తిపాడులో ఉన్న విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ నందు జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, యంపీలు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
📎 ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మాజీ మంత్రివర్యులు, రీజనల్ కోఆర్డినేటర్, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దెల గురుమూర్తి గారు, మాజీ మంత్రివర్యులు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ మంత్రివర్యులు, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డి గారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు, ఎమ్మెల్సీలు తూమాటి మాధవ రావు గారు, బల్లి కళ్యాణ్ గారు, మేరిగ మురళి గారు, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి గారు వేదికపై ఆసీనులైనారు.
📎 అగ్ర నాయకులు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మూడు పట్టభద్ర స్థానాలు, రెండు ఉపాధ్యాయ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనే గట్టి ధీమాతో ఉన్నారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు మన తూర్పు రాయలసీమకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఉమ్మడి నెల్లూరు జిల్లా పేరును సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా కృషి చేయాలని ముఖ్య నాయకులకు సూచించారు, తక్కువ సమయం ఉన్న కారణంగా వేగంగా ప్రచారం చేయాలని కోరారు.
📎 చంద్రబాబు నాయుడు పాలనలో మాత్రమే పెట్టుబడులు వస్తాయని పచ్చ పత్రికలు మొన్నటి వరకు పిచ్చి రాతలు రాసేవని, మొన్న జరిగిన "గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్"లో 13 లక్షల కోట్లు పెట్టుబడులు, 350 పైగా ఒప్పందాలు, ఆరు లక్షల ఉద్యోగ అవకాశాలు రానున్న కారణంగా దిక్కుతోచని స్థితిలో ప్రత్యర్థి పార్టీలు, పచ్చ మీడియా పరిస్థితి తయారయ్యిందని తెలిపారు. రాష్ట్రంలో ఇకమీదట జగన్ మార్క్ ఉంటుందని తెలిపారు.
📎 పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడూతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలని, ఇప్పటివరకు నాకు అన్ని విధాలా సహకరించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులకు, ముఖ్య నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. 13-03-2023 తేదిన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ నమూనా నందు రెండవ సీరియల్ నంబర్లో నా పేరు పక్కన మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని కోరారు.
📎 ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, మరియు ముఖ్య నాయకులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎంపీపీలు, జడ్పిటిసిలు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు వార్డ్ మెంబర్లు, ఉమ్మడి నెల్లూరు జిల్లా అనుబంధ విభాగ నాయకులు, విద్యార్థి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తేది: 06-03-2023,కనిగిరి నియోజక వర్గము,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమిష్టిగా కలిసి పని చేయండి, విజయం అద్భుతంగా ఉంటుంది - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన బాలినేని గారు.
💥 మన రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి. - బాలినేని గారు.
💥 త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు లక్షల ఉద్యోగాలతో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్న మన ముఖ్యమంత్రి గారు - బాలినేని
💥 ముఖ్య నాయకులు, కార్యకర్తలు అంకిత భావంతో పనిచేసి మన కనిగిరి నియోజకవర్గ ఖ్యాతిని నలుదిశల వ్యాపింప చేసేందుకు కృషి చేయండి - ఎమ్మెల్యే గారు.
💥 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశీర్వదించండి, అండగా ఉంటా - పేర్నాటి.
📎 ఈ రోజు కనిగిరిలోని తాళ్లూరి నరసింహం సబ్బరతమ్మ గార్ల కళ్యాణ మండపంలో కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ గారి అధ్యక్షతన మాజీ మంత్రివర్యులు రీజనల్ కోఆర్డినేటర్ ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు విశిష్ట అతిథిగా విచ్చేసిన కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
📎 బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడుతూ మన ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ప్రత్యర్థి పార్టీలు పోటీ చేస్తున్న కారణంగా ప్రతి ఒక్కరు కూడా గమనించి కష్టపడి పనిచేసి మన జగన్ మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఎన్నికలైనా తిరుగులేదని నిరూపించాలని పార్టీ శ్రేణులను కోరారు, చిన్నచిన్న విభేదాలు పక్కన పెట్టి సమిష్టి కృషితో మన పార్టీ అభ్యర్థి శ్యాం ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించాలని కోరారు.
📎 బుర్రా మధుసూదన్ యాదవ్ గారు మాట్లాడుతూ మన కనిగిరి నియోజకవర్గంలో వారం రోజులపాటు ముఖ్య నాయకులు సచివాలయ కన్వీనర్లు, గ్రామ సారదులుతో కలసి ముమ్మరంగా ప్రచారం చేసి, పార్టీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు
📎 శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లా పెద్ద దిక్కు అయినటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారి అడుగు జాడల్లో మనమందరం కలిసి నడవాలని, తూర్పు రాయలసీమకు సంబంధించి పట్టభద్రుల,ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి పూర్తి భాధ్యత వాసన్న తీసుకున్నాడని, మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి 13వ తేది జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ నమూనాలో రెండవ సీరియల్ నంబర్లో నా పేరు ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, వేయించి నన్ను ఆశీర్వదించాలని కోరారు.
📎 ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి గారు. అన్ని మండలాల పార్టీ కన్వీనర్లు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సర్పంచులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తేది : 06-03-2023,వెంకటాచలం మండల కేంద్రము,సర్వేపల్లి నియోజక వర్గము, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా తమ్ముడు "శ్యామ్"ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. - వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
📎 ఈ రోజు వెంకటాచలం మండలములోని ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉన్న శ్రిడ్స్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యూలు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సర్వేపల్లి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
📎 కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ సమయం తక్కువగా ఉందని, సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల JCS కన్వీనర్లు వారి వారి మండలాలలోని సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులతో ఆయా పంచాయతీలలోని నాయకుల పర్యవేక్షణలో ప్రతి ఒక్క ఓటరు నేరుగా మూడుసార్లు కలిసి ఓటును అభ్యర్థించాలని తెలిపారు. 2014, 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో నా గెలుపు కోసం శ్యామ్ కష్టపడి పనిచేసి నా విజయంలో కీలక భూమిక పోషించాడని, అతన్ని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరితో పాటుగా నాకు ఉందని, నేను కూడా ఈ వారం రోజులు పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను ఎన్నికల తేది నాటికి రప్పించాలని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యదిక మెజారిటీ తీసుకురావాలని నియోజకవర్గ ముఖ్య నాయకులను, కార్యకర్తలను కోరారు.
📎 శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి నాకు అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తూ, పార్టీలో నా ఎదుగుదలకు తోడ్పడుతున్న మా అన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలని, ఈనెల 13వ తేదీ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ నమూనాలో రెండవ సీరియల్ నంబరులో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నా పేరు ఎదురుగా మొదటి ప్రాధాన్యత - 1 ఓటువేసి నన్ను ఆశీర్వదించాలని కోరారు.
తేది: 05-03-2023,పలమనేరు,"గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్" (GIA) ద్వారా ఆరు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించి, నూతన చరిత్రకు శ్రీకారం చుట్టనున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ గారు. - స్థానిక ఎమ్మెల్యే యన్.వెంకట గౌడ గారు, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు గారు, పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వెల్లడి.
📎 పలమనేరు పట్టణంలో స్థానిక శాసనసభ్యులు యన్. వెంకట గౌడ గారి అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలోజరిగిన పాల్గొని ప్రసంగించిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
📎 స్థానిక ఎమ్మెల్యే యన్.వెంకట గౌడ గారు, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు గారు, ముఖ్య నాయకులు మాట్లాడుతూ మన ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి అత్యదిక మెజారిటీ తీసుకు వస్తానని ముఖ్యమంత్రి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట ఇచ్చారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మనమందరం కష్టపడి పని చేయాలని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు గత 8 నెలలుగా నిరంతరం 36 నియోజకవర్గాలు పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడని, విజయం ఎప్పుడో ఖాయమైపోయిందని, జగనన్న మార్క్ మెజారిటీ కోసం మేమందరం కృషి చేస్తున్నామని తెలిపారు.
📎 శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా నుంచి మన పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో, మిధున్ రెడ్డి గారి సహకారంతో మీ ముందుకు వచ్చానని, ఈ నెల 3,4 తేదీలలో జరిగిన "గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్" కారణంగా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారని, ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన ఒరవడిని తీసుకొచ్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిదని తెలిపారు. మీరందరు 13వ తేదీ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా విజయానికి కృషి చేయాలని కోరారు.
తేది: 05-03-2023,పీలేరు,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి సారధ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించి చరిత్ర తిరగ రాస్తాం - ఆత్మీయ అభినందన సభలో నియోజకవర్గ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు.
💥 జగనన్న సంక్షేమ పథకాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి సోపానాలు - ఎమ్మెల్యే గారు.
💥 కష్టపడి పనిచేసే వారికి పార్టీ గుర్తుపెట్టుకుని ఉంటుందని దానికి నిదర్శనమే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం వచ్చిందని తెలిపిన ఎమ్మెల్యే గారు.
👉 ఈరోజు పీలేరులో MM కళ్యాణ మండపం నందు పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన అన్నమయ్య జిల్లాకు సంబంధించి పార్టీ పదవులు పొందిన నాయకులతో ఏర్పాటుచేసిన ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే గారితో కలిసి పాల్గొన్న తూర్పు రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
👉 ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 8 నెలల క్రితం మన ముఖ్యమంత్రి గారు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ వర్క్ షాపులో మాట్లాడుతూ మన పార్టీ తరపున మార్చిలో జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ నాకు స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాలని అనుకుంటున్నానని, మీ అభిప్రాయాలు తెలపాలని ఎమ్మెల్యేలను ఇన్చార్జిలను కోరగా ప్రతి ఒక్కరు కూడాఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేద్దామని నిర్ణయించుకున్నారని, తూర్పు రాయలసీమ సంబంధించి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి పేరును స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారని, పదవులు పొందిన ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేసి శ్యాం ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన పెద్దాయన పేరు నలుదిశల వ్యాప్తి చెందెలా కోరారు.
👉 శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ నన్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పటినుంచి 36 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్చార్జిలు, ప్రతి ఒక్కరు కూడా నన్ను అక్కున చేర్చుకొని, ఆదరిస్తున్నారని వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలని, పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు ఇప్పటికైనా లభిస్తుందని, పార్టీ పదవులు పొందిన వారు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు, జిల్లా అనుబంధ శాఖ విభాగాల అధ్యక్షులుగా ఎన్నికైన వారిని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు సన్మానించి అభినందించారు. 13వ తేది జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ నమూనా నందు రెండవ సీరియల్ నంబరులో నా పేరు పక్కన మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి వేయించి నన్ను ఆశీర్వదించాలని కోరారు.
తేది: 05-03-2023,
పలమనేరు.
"గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్" (GIA) ద్వారా ఆరు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించి, నూతన చరిత్రకు శ్రీకారం చుట్టనున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ గారు. - స్థానిక ఎమ్మెల్యే యన్.వెంకట గౌడ గారు, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు గారు, పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వెల్లడి.
📎 ఈ రోజు పలమనేరు పట్టణంలో స్థానిక శాసనసభ్యులు యన్. వెంకట గౌడ గారి అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలోజరిగిన పాల్గొని ప్రసంగించిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
📎 స్థానిక ఎమ్మెల్యే యన్.వెంకట గౌడ గారు, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు గారు, ముఖ్య నాయకులు మాట్లాడుతూ మన ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి అత్యదిక మెజారిటీ తీసుకు వస్తానని ముఖ్యమంత్రి గారిక…
తేది: 04-03-2023,నాయుడు పేట, పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజిలలో స్థానిక ఎమ్మెల్యే గారితో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన పేర్నాటి.
👉 ఈ రోజు నాయుడు పేట పట్టణంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారితో కలిసి ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాల, CV రామన్ ప్రైవేట్ జూనియర్ కాలేజిలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
👉 ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారని, తనవంతుగా సమాజానికి సేవ చేయాలనే సదుద్దేశంతో పేర్నాటి చారిటబుల్ ట్రస్టును స్థాపించి వేల మందికి విద్యాదానం చేశారని, అదేవిధంగా నిరుపేదలకు అనేకసార్లు వైద్యసాయం అందించాడని, ఇలాంటి సేవాతత్పరుడికి ఒక అవకాశం కల్పించాలని కోరారు. ఈ నెల 13వ తేది జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 ని వేసి గెలిపించాలని కోరారు.
👉 శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 13-03-2023వ తేదిన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ సహాయ సహకారాలు కోరి ఇక్కడికి వచ్చానని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అవకాశం కల్పిస్తే ఇంతకుముందు ఎవరూ చేయని విధంగా మీ అందరి సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. బ్యాలెట్ నమూనాలో రెండవ సీరియల్ నెంబరులో నా పేరు ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటును నన్ను ఆశీర్వదించాలని కోరారు.
తేది : 03-03-2023,పర్చూరు,కష్టపడి పని చేయండి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మనదే - ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు ఉద్దేశించి దిశానిర్దేశం చేసిన ఆమంచి కృష్ణమోహన్ గారు.
💥 ఈరోజు పర్చూరులోని కటారి శ్రీకృష్ణ మెమోరియల్ ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ ఇంచార్జు ఆమంచి కృష్ణమోహన్ గారి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలని పర్చూరు నియోజకవర్గ పట్టభద్రులను కోరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
💥 ఆమంచి కృష్ణ మోహన్ గారు, ముఖ్య నాయకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నామని, మాకు తెలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాలు వామపక్షాలు పోటీ చేశారని, అసలు అభ్యర్థులు ఎవరో కూడా తెలిసేది కాదని, మన పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు గత ఏడు నెలల నుంచి నిర్విరామంగా 36 నియోజకవర్గాలలో పర్యటిస్తూ, పట్టభద్రులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులను, ప్రైవేట్ ఉద్యోగులను కలుస్తూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తున్నాడని తెలిపారు. తన ముమ్మర ఎన్నికల ప్రచారం కారణంగా అతను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడో గెలిచేసాడని, మెజార్టీ గురించి మాత్రమే ఆలోచించాలని, రాబోయే రోజులు చాలా కీలకమైనవని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి మన అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించాలని కోరారు.
💥 పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడూతూ మీ అందరి సహకారం కోరి ఇక్కడికి వచ్చానని, 13-03-2023 తేదిన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ నమూనా నందు రెండవ సీరియల్ నంబర్లో నా పేరు పక్కన మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని కోరారు, ఆ భగవంతుని దీవెనలతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఒక్క అవకాశం కల్పిస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇంతలా పని చేయవచ్చా అని మీ అందరూ గర్వపడేవిధంగా కష్టపడి పనిచేస్తానని సభను ఉద్దేశించి ప్రసంగించారు.
తేది : 03-03-2023,అద్దంకి,జగనన్న చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి విజయానికి పునాది - అద్దంకి నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పట్టభద్రులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన బాచిన కృష్ణ చైతన్య గారు.
💥 ఈ రోజు అద్దంకిపట్టణంలోని కామేపల్లి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ శాప్ నెట్ ఛైర్మన్ & వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇంచార్జు బాచిన కృష్ణ చైతన్య గారి అధ్యక్షతన జరిగిన అద్దంకి నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలని అద్దంకి నియోజకవర్గ పట్టభద్రులను, నాయకులను, కార్యకర్తలను, అభిమానులను కోరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
💥 బాచిన చెంచు గరటయ్య గారు, కృష్ణ చైతన్య గారు ముఖ్య నాయకులు మాట్లాడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి పునాది రాళ్లని, సమయం చాలా తక్కువగా ఉందని, మనమందరం భాధ్యతగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రతి 25 మంది పట్టభద్రుల ఓటర్లకు ఒక బాధ్యుడిని నియమించి, ఆ 25 మంది ఓటర్ల బాధ్యతను వాళ్ళు తీసుకొని పొలింగ్ తేది నాడు ప్రతి ఒక్కరినీ తీసుకొచ్చి ఓటు వేసే విధంగా పనిచేయాలని తెలిపారు. ప్రతి పోలింగ్ బూతుల వారిగా కౌంటింగ్ ఉంటుందని, అది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా పని చేసి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి విజయానికి కృషి చేయాలని తెలిపారు.
💥 పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాని, మీ అందరి సహాయ సహకారాలు కోరి ఇక్కడికి వచ్చానని, 13-03-2023 తేదిన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీమీ గ్రామాలలోని పట్టభద్రుల చేత బ్యాలెట్ నమోన నందు రెండవ క్రమసంఖ్యలో నా పేరు ఎదురుగా మీ మొదటి ప్రాధాన్యత 1 వేసి, నన్ను ఆశీర్వదించాలని కోరారు
తేది: 03-03-2023,కందుకూరు,మానుగుంట మహీధర్ రెడ్డి గారితో సమావేశమైన పేర్నాటి.
👉 ఈ రోజు కందుకూరులోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి గారిని కలిసి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చర్చించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
👉 ఈ నెల 13వ తేదిన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కందుకూరు నియోజక వర్గంలో గతంలో కంటే ఓటర్లు ఎక్కువగా నమోదు చేసుకున్న కారణంగా పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెరిగిందని, ఎన్నికల రోజున పోలింగ్ ఏజెంట్ల నియమాకానికి సంబంధించి చర్చించుకున్నారు.
👉 పోలింగ్ రోజున ఎక్కువ సంఖ్యలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వేయించే విధంగా కృషి చేస్తామని, బ్యాలెట్ నమూనాలో 2వ క్రమ సంఖ్యలో అభ్యర్థి అయినటువంటి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి పేరు ఎదురుగా మొదటి ప్రాధాన్యత - 1 ఓటు వేసి, వేయించి అత్యదిక మెజారిటీతో గెలిపించాలని మానుగుంట మహీధర్ రెడ్డి గారు కోరారు.
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the public figure
Telephone
Address
524003
Pichireddydonka, Kothur Village, Indkurpet Mandal
Nellore, 524314
Kovur Constituency YSR Congress Party Youth Wing Members and social media constituency co-convenor.
Chinthareddy Palem
Nellore, 524003
Official page of YSRCP leader Anam vijaykumar reddy. Ex.Chairperson SPSR NELLORE District Co-operat