Kakani Govardhan Reddy

Assembly, Nellore ZP Chairman

Former Minister for Agriculture and Co-operation, Marketing, Food Processing, Government of Andhra Pradesh and Member of Legislative Assembly, Sarvepalli Constituency
and worked as Chairman, Privileges Committee, A.P.

Photos from Kakani Govardhan Reddy's post 25/06/2024

" సర్వేపల్లి లో కొనసాగుతున్న మట్టి దందా"

SPS నెల్లూరు జిల్లా:
తేది:25-06-2024

వెంకటాచలం మండలం, గొలగమూడి గ్రామంలోని పడమటి చెరువు నుండి గత 3రోజులుగా రేయింబవళ్లు మట్టి తవ్వకాలు సాగిస్తూ, సొమ్ము చేసుకుంటున్న తెలుగుదేశం నాయకులు.

ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకుండా, అక్రమార్కులకు వంత పాడుతున్న అధికారులు.

సర్వేపల్లి అవినీతి కార్యకలా పలుకు అడ్డగా మారుతున్నడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక కుటుంబాలు.

ఆగని టీడీపీ అరాచకకాండ..| Nellore TDP Leaders Over Action | YSRCP Leaders @SakshiTV 25/06/2024

https://youtu.be/LFkJpOUnalc?si=N8cUtBbgD5nB0-lw

ఆగని టీడీపీ అరాచకకాండ..| Nellore TDP Leaders Over Action | YSRCP Leaders @SakshiTV ఆగని టీడీపీ అరాచకకాండ..| Nellore TDP Leaders Over Action | YSRCP Leaders *tv Watch Sakshi TV LIVE - https://youtu.be/8...

Photos from Kakani Govardhan Reddy's post 25/06/2024

25-06-2024

Photos from Kakani Govardhan Reddy's post 24/06/2024

*"SP గారూ!, జిల్లాలో శాంతిభద్రతలను కాపాడండి" -కాకాణి*

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:24-06-2024*

*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై జరుగుతున్న దాడులకు సంబంధించి, జిల్లా SP గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేరిగ మురళీధర్ గారు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రివర్యులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ..*

👉 శాంతియుతంగా, సామరస్యంతో ఉండేటటువంటి నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే విధంగా తెలుగుదేశం నాయకుల ప్రవర్తన ఉంది.

👉 తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు దౌర్జన్యంగా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తల మీద దాడులకు తెగబడుతున్నారు.

👉 ఇటువంటి సంఘటనల పట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారికి తెలియజేశాము.

👉 జిల్లాలో అమాయకుల మీద, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులను పోలీసులు బనాయిస్తున్నారని SP గారి దృష్టికి తీసుకొని వెళ్లాం.

👉జిల్లాలో ఇటీవల జరిగినటువంటి అనేక సంఘటనలు ఉదాహరణలతో సహా SP గారికి వివరించడం జరిగింది.

👉జిల్లా SP గారు సానుకూలంగా స్పందించారు

👉విచారణ జరిపించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

👉వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అధికార యంత్రాంగం నిరోధించకపోతే ప్రతిఘటిస్తాం.

Photos from Kakani Govardhan Reddy's post 24/06/2024

*"సర్వేపల్లిలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా"*

*సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, గొలగమూడి గ్రామంలోని పడమటి చెరువు నుండి ట్రాక్టర్లతో లేఔట్లకు యదేచ్ఛగా మట్టి తరలిస్తూ, సొమ్ము చేసుకుంటున్న తెలుగుదేశం నాయకులు.*

*గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానరాని అధికారులు*

Kakani Govardhan Reddy Goosebumps Speech At Nellore YSRCP Leaders Meeting @SakshiTVLIVE 24/06/2024

https://youtu.be/7I4eDOJpCls?si=aYUFJd7E9qYvS2xO

Kakani Govardhan Reddy Goosebumps Speech At Nellore YSRCP Leaders Meeting @SakshiTVLIVE Kakani Govardhan Reddy Goosebumps Speech At Nellore YSRCP Leaders Meeting *tvlive Watch Sakshi T...

Photos from Kakani Govardhan Reddy's post 23/06/2024

23-06-2024

పార్టీ కార్యాలయ కూల్చివేతను ఖండించిన కాకాణి || TV9 22/06/2024

https://youtu.be/gausBFxIkiA?si=KPuAWDCSd7fWwbkc

పార్టీ కార్యాలయ కూల్చివేతను ఖండించిన కాకాణి || TV9 Like and Subscribe to Get Regular Updates of KAKANI GOVARDHAN REDDY worked as Minister for Agriculture and Cooperation, Marketing, Food Processing, Govt. of...

Photos from Kakani Govardhan Reddy's post 22/06/2024

*"20 సంవత్సరాల తర్వాత సర్వేపల్లిలో విధ్వాంసాలు మొదలయ్యాయి"*

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:22-06-2024*

*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం మూకలు చేసిన విధ్వసంతో నష్టపోయిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రివర్యులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ...*

👉 రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీద, కార్యకర్తల మీద, సానుభూతిపరుల మీద దాడులు ప్రారంభమయ్యాయి.

👉 వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతిపరులపై తీవ్రమైనటువంటి దాడులను కొనసాగిస్తూ, విధ్వంసం సృష్టిస్తూ, ఆస్తులను హరిస్తూ అన్ని రకాల వాళ్లని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తీసుకొని వస్తున్నారు.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి కోడూరు గ్రామంలో ఆక్వా రైతు కావలి రెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి దాదాపు 50 లక్షల రూపాయల విలువచేసేటువంటి పనిముట్లను తగులబెట్టారు.

👉 పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ కేసులో ఎటువంటి పురోగతి లేదు

👉నష్టపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, బాధితుల మీద హత్య ప్రయత్నం కేసులు నమోదు చేస్తునటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం నెలకొంది.

👉 రైతులకు సంబంధించి దారుణంగా ఆస్తులను ధ్వంసం చేసి, వాళ్ళని ఆర్థికంగా నష్టపరచాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది.

👉 ప్రైవేట్ ఆస్తులతో పాటు, ప్రభుత్వం ఆస్తులకు కూడా ఎక్కడ భద్రత లేకుండా పోయింది.

👉 కోడూరు గ్రామపంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా తగలబెట్టడం జరిగింది.

👉 రైతులకు సంబంధించినటువంటి ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడంతోపాటు, ఆక్వా పంట సాగు చేసుకునేటువంటి రైతుల పొలాల్లోకి వెళ్లి విషం కలిపి రైతులకు నష్టం కలిగిస్తున్నారు.

👉ఇటువంటి సంస్కృతిని ఎన్నడూ ఎక్కడా చూసినటువంటి పరిస్థితి లేదు.

👉వెంకటాచలం మండలంలో కంటేపల్లి గ్రామంలో వెంకటేశ్వర్లుకు సంబంధించిన రేకుల షెడ్డును ప్రయివేట్ వ్యక్తులు మిషన్ తీసుకొని వెళ్లి కూల్చడం జరిగింది.

👉కుటీర పరిశ్రమగా ఇటుకల తయారీ అన్ని అనుమతులతో నిర్వహిస్తుంటే, అధికారుల ప్రమేయం లేకుండా, ప్రయివేట్ వ్యక్తులు కూల్చడం దారుణం.

👉ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిని తొలగించేటువంటి హక్కు తెలుగుదేశం పార్టీ వారికి ఎవరు ఇచ్చారు!

👉 ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి.

👉ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి.

👉 చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని, కొత్త పోకడలను తీసుకొని వస్తున్నారు.

👉సర్వేపల్లిలో 20 సంవత్సరాల తర్వాత ఇలాంటి విధ్వాంసాలు మొదలయ్యాయి.

👉నిన్ననే శాసనసభ్యులందరూ ప్రమాణస్వీకారం చేసి, ఈరోజు చేపట్టినటువంటి ఘనకార్యాలు ఏమిటి అంటే వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల, నాయకుల, ఆస్తులతో పాటు, పార్టీకి సంబంధించిన ఆస్తులను నాశనం చేయడమే...!

👉అధికారం ఉందని, పాలన గాలికి వదిలేసి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసం చేయడమే ధ్యేయమని ప్రజలకు చెప్పదల్చారా..!

Photos from Kakani Govardhan Reddy's post 22/06/2024

22-06-2024

22/06/2024

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతున్న మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు

21/06/2024

*"సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకుల దాష్టీకం...!"*

*వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఆస్తులపై టిడిపి మూకల దాడులు*

*తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుని ఆస్తుల దగ్ధం*

*ట్రాక్టర్ తో పాటు 50 లక్షలు విలువ చేసే ఆక్వా కల్చర్ పనిముట్లను తగలబెట్టిన దుండగులు.*

*గత కొద్దిరోజులుగా కవ్వింపు చర్యలకు దిగుతున్న తెలుగుదేశం పార్టీ వారి హస్తం ఉందని, విచారణ జరిపించి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి కాకాణి.*

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:21-06-2024*

*శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, కోడూరు గ్రామపంచాయతీలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించిన డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*కాకాణి స్క్రోలింగ్ పాయింట్స్:*

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకుల, కార్యకర్తల ఆస్తులు విధ్వంసం చేయడం, వాళ్లకు సంబంధించినటువంటి ప్రాణాలు కూడా హరించేటువంటి పరిస్థితి నెలకొంది.

👉 తెలుగుదేశం నాయకులు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులపై అన్ని రకాలుగా దాడులు చేసి, నష్టం చేకూర్చే విధంగా ఒక ఆటవిక విధానాన్ని కొనసాగిస్తున్నారు.

👉కోడూరు గ్రామంలో ఎందరినో ఆదుకున్న కావలి రంగారెడ్డి కుటుంబానికి సంబంధించిన ట్రాక్టర్ తోపాటు, సామానులు తగలబెట్టడం జరిగింది.

👉వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిన్న సన్నకారు రైతులు సాగుచేసుకుంటున్న రొయ్యల గుంటల్లో విషాన్ని కలిపి వారికి నష్టం కలిగించారు.

👉తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత టిడిపి నాయకులు ప్రత్యక్షంగా దాడులు చేయడం, పరోక్షంగా ఆస్తి నష్టం కలిగించడం లాంటి కొత్త సంస్కృతిని మొదలు పెట్టారు.

👉సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపుగా నాకు తెలిసి 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది.

👉 తెలుగుదేశం నాయకులు ప్రజలకు గెలిచిన వెంటనే మా ఉనికి, మా పరిపాలన తీరు ఈ విధంగా ఉంటుందని రుచి చూపించాలనుకుంటున్నారా..!
ఇలా ప్రవర్తించడం సరైనటువంటి విధానం కాదు.

👉 జిల్లా ఎస్పీ గారు, పోలీస్ యంత్రాంగం చొరవ తీసుకొని ఈ చర్యలకు పాల్పడిన వారిని కనిపెట్టాలి.

👉ఎవరో వచ్చి, ఎవరూ లేనప్పుడు ఇటువంటి ఘాతుకానికి పాల్పడటం నిజంగా ఒక పిరికిపంద చర్య!

👉ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా పనిచేయాలనుకుంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళ హస్తం దీనిలో లేదని సంకల్పిస్తే, పారదర్శకంగా విచారణ జరిపించాలి.

👉నిజమైనటువంటి దోషులను గుర్తించి శిక్షిస్తారా..! లేదా మేము ఇదే విధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తామంటారో పోలీస్ అధికారులు తెలియజేయాలి.

👉 ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వం వస్తుందని ఓటు వేస్తే, మీ అంతు చూస్తాం అన్నట్టుగా ప్రవర్తించడం దురదృష్టకరం.

👉 ఒక పార్టీని లక్ష్యంగా చేసుకొని ఇటువంటి ధోరణి కొనసాగితే, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజల మీద దాడులు అనేటువంటి సంస్కృతిని ప్రోత్సహిస్తే, అది రాబోయే రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా నాశనం చేస్తుందో గమనించాలి.

👉 పోలీస్ యంత్రాంగం ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి, వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

👉 ఏదేమైనా ప్రతి విషయంలో కార్యకర్తలకు అండదండలు అందిస్తాం.

👉 ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు.

👉ప్రజాసేవకులుగా ఎవరికి, ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా అండదండలు అందించడం జరుగుతుంది.

👉 వై.యస్.ఆర్.పార్టీకి మద్దతిచ్చిన కుటుంబాలకు అండగా నిలుస్తాం, వాళ్లకోసం పోరాడతాం.

Photos from Kakani Govardhan Reddy's post 21/06/2024

తెలుగుదేశం దాడులపై కాకాణి ఆవేదన 21/06/2024

https://youtu.be/J_az2ciK2uQ?si=XBZNJqKDefouuKRy

తెలుగుదేశం దాడులపై కాకాణి ఆవేదన Like and Subscribe to Get Regular Updates of KAKANI GOVARDHAN REDDY worked as Minister for Agriculture and Cooperation, Marketing, Food Processing, Govt. of...

||YSRCP|| కార్యకర్తలకు అండగా నిలుస్తున్నాం - కాకాణి 21/06/2024

https://youtu.be/wUhHoICVp6k?si=SIAygTCtJKWgXtwy

||YSRCP|| కార్యకర్తలకు అండగా నిలుస్తున్నాం - కాకాణి Like and Subscribe to Get Regular Updates of KAKANI GOVARDHAN REDDY worked as Minister for Agriculture and Cooperation, Marketing, Food Processing, Govt. of...

17/06/2024

మీరు, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని అల్లాహ్ ను కోరుకుంటూ, ముస్లిం సోదర, సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు -మీ కాకాణి గోవర్ధన్ రెడ్డి

Photos from Kakani Govardhan Reddy's post 14/06/2024

*" సర్వేపల్లిలో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ నాయకుల కబ్జాల పర్వం"*

*SPS నెల్లూరు జిల్లా:*
తేది:14-06-2024

*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచల మండలంలోని గొలగమూడి గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు సంబంధించిన ఖాళీ స్థలాన్ని యథేచ్ఛగా ఆక్రమిస్తున్న తెలుగుదేశం నాయకులు.*

*తెలుగుదేశం నాయకుల బెదిరింపులకు ఎదురు చెప్పలేక మిన్న కుండిపోయిన మహిళా ఉపాధ్యాయులు.*

*బరితెగించి ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తూ, కబ్జాలకు పాల్పడుతున్న తెలుగుదేశం నాయకులు.*

*తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలతో పాటు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకపోవడంతో భీతిల్లుతున్న ప్రజలు.*

*తాము ఆడుకుంటున్న స్థలం కబ్జాకు గురయ్యి, అక్రమార్కుల చేతిలోకి వెళ్లడంతో, కన్నీరు మున్నీరవుతున్న చిన్నారులు.*

*సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీపర్వం ప్రారంభమైందంటూ, ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్ని వర్గాల ప్రజలు.*

తొలి ప్రసంగంలో ప్రజలకు నిరాశ... సొంత ఇష్టాలే ప్రస్తావన.. || AP PRIDE 11/06/2024

https://youtu.be/aBL_p8A0gpQ?si=oN4XfxjLAc72hxoz

తొలి ప్రసంగంలో ప్రజలకు నిరాశ... సొంత ఇష్టాలే ప్రస్తావన.. || AP PRIDE తొలి ప్రసంగంలో ప్రజలకు నిరాశ... సొంత ఇష్టాలే ప్రస్తావన.. .AP PRIDE

11/06/2024

సోమిరెడ్డి ఉడుత బెదిరింపులకు భయపడం...

11/06/2024

గెలుపోటములకు అతీతం ఈ ప్రజా జీవితం.. గెలిచినా మీ వెన్నంటే ఉంటా.. ఓడినా మీతోనే ఉంటా. ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా నిలబడుతా..మీ కాకాణి గోవర్ధన్ రెడ్డి

||జోహార్.. వై.యస్.ఆర్.|| YSR విగ్రహానికి నిప్పంటించిన తెలుగుదేశం కార్యకర్తలు #ysrcp 09/06/2024

https://youtube.com/shorts/e_DmIVork3A?feature=share

||జోహార్.. వై.యస్.ఆర్.|| YSR విగ్రహానికి నిప్పంటించిన తెలుగుదేశం కార్యకర్తలు #ysrcp Like and Subscribe to Get Regular Updates of Ex-Minister for Agriculture and Cooperation, Marketing, Food Processing, Govt. of A.P. and Nellore YSRCP Sarvep...

09/06/2024

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీనుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది. ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. .

08/06/2024

*ఇదేనా సర్వేపల్లి లో చేస్తానన్న అభివృద్ధి* ???

వెంకటాచలం మండలం విక్రమ సింహపురి యూనివర్సిటీ లో ఇలా చేస్తే అభివృద్ధి అంటారా??

ఇలా చేస్తేనే సర్వేపల్లి ప్రజలు బాగుంటారా?

ఇలాంటి అభివృద్ధి కోసమేనా నన్ను గెలిపించండి ఇవే నాకు చివరి ఎన్నికలు అని సకుటుంబ సపరివార సమేతంగా ప్రజల వద్దకు వచ్చి అభ్యర్థించారు??

2019-2024 నుండి ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు ఒక్కటంటే ఒక్కటి జరిగాయా సర్వేపల్లి లో???

రెండు మూడు రోజుల్లోనే సర్వేపల్లిని జిల్లా ఏకాకుండా రాష్ట్రం మొత్తం వార్తల్లో నిలబెట్టారు కదా?

బీహార్ వాళ్ళు కూడా భయపడేలా?
ఉగ్రవాదులు కూడా ఉలిక్కిపడేలా.. ఆ గడ్డపారలు తో ధ్వంసం చేయడం ఏంటి ఆ బెదిరింపులు ఏంటి..
మిలిటెంట్లు కూడా మీదగ్గరే ట్రైనింగ్ తీసుకోవాలి ఏమో?

Photos from Kakani Govardhan Reddy's post 06/06/2024
కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు 05/06/2024

https://www.ysrcongress.com/top-stories/kakani-govardhan-reddy-91530

కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు పేదవానికి అండగా నిలిచాం.. పథకాలు అందుకున్న ప్రజలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను అన్వేషిస్తాం.. వైస్.....

05/06/2024

నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు....

సోమిరెడ్డి ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండు - వెంకట శేషయ్య @Channel9hd 29/05/2024

https://youtu.be/_K7U3ccjvkw?si=o4TUWqq84QpRVKaW

సోమిరెడ్డి ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండు - వెంకట శేషయ్య @Channel9hd సోమిరెడ్డి ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండు - వెంకట శేషయ్య 📰 Welcome to channel9hd📰🔥 Subscribe for the latest news, analysis, and in-depth coverage o...

29/05/2024

*ఈనాడు_ రామోజీ రోత రాతలు*

ఈరోజు రామోజీ అక్షర అసత్యం..👇

వైకాపాకు ఓటు వేయలేదని గిరిజనుడు పై దాడి..?

*అసలు వాస్తవం*.. : 👉 గిరిజన యువకుడు నరేష్ పై దాడి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాదు.. టిడిపి నేతలు

👉 తనపై దాడి చేసింది బల్లి వెంకట రమణయ్య అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న దాడికి గురైన నరేష్

👉 బల్లి వెంకట రమణయ్య అనే వ్యక్తి సోమిరెడ్డి అనుచరుడు…

👉 ఈ ఎలక్షన్ లో కూడా టిడిపికి ఏజెంట్ గా పని చేశాడు

👉 పైనాపురం దేవర దిబ్బ గిరిజన కాలనీలో తెలుగుదేశం వాళ్లు చేసిన దాడిని కప్పిపుచ్చుతూ ఆ నెపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నెట్టివేస్తూ అసత్య ప్రచారం..

👉 అసలు వాస్తవాలు ఇలా ఉంటే తెలుగు దొంగల పార్టీకి అనుకూలంగా ఈనాడు రామోజీ పచ్చి అబద్ధపు రోత రాతలను వండి వారుస్తూ రోజురోజుకి దిగజారుతూ నీతిమాలిన వ్యాఖ్యలు రాస్తున్నాడు..!

ఓటర్లకు యదేచ్ఛగా డబ్బులు పంపిణీ.. సోమిరెడ్డిపై FIR నమోదు 28/05/2024

https://youtu.be/41KDV63vBsk?si=djub3tydQbCpiaR5

ఓటర్లకు యదేచ్ఛగా డబ్బులు పంపిణీ.. సోమిరెడ్డిపై FIR నమోదు Like and Subscribe to Get Regular Updates of Minister for Agriculture and Cooperation, Marketing, Food Processing, Govt. of A.P. and Nellore YSRCP Sarvepall...

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతున్న మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు
*"సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకుల దాష్టీకం...!"**వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఆస్తులపై టిడిపి మూకల దా...
ఇదీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి!ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి నుండి హృదయాన్ని కదిలించే విజువల్స్.రాష్ట్రంలో దళితుల కోసం గళం విప్...
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీ...
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీ...
నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు......
*"సోమిరెడ్డి బరితెగింపు..."* *"విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ..."* *"ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం"**"నెల...
కాకాణి మీడియా సమావేశం.. హైదరాబాద్ నుండి ప్రసారం...
#సర్వేపల్లి #వైఎస్ఆర్సిపి #కాకాణి #KakaniGovardhanReddy #Sarvepalli
సంక్షేమ పథకాలతో మాకు అండగా నిలిచిన సీఎం @ysjagan కు మా ఓటుతో జై కొట్టేందుకు మేం సిద్ధం#YSRCPNavaratnaluPlus#JaganannaNav...
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ ఇంటి బిడ్డను ఆశీర్వదించండి...

Category

Telephone

Website

Address

Nellore

Other Politicians in Nellore (show all)
Rajasekhar Reddy Kondaa Rajasekhar Reddy Kondaa
Nellore
Nellore, 524239

11/03/1990

Sk Abdul Rehman Sk Abdul Rehman
Nellore City Janda Street
Nellore

If anything problem tell me

Kailasam Srinivasulu Reddy Kailasam Srinivasulu Reddy
Pichireddydonka, Kothur Village, Indkurpet Mandal
Nellore, 524314

Kovur Constituency YSR Congress Party Youth Wing Members and social media constituency co-convenor.

KV.Naidu KV.Naidu
Nellore, 524002

Dharla Suresh YSRCP Dharla Suresh YSRCP
YSR Street
Nellore, 524001

Do Something For Others

Danny Bhai Danny Bhai
Nellore

So..What ?

Anam Vijaykumar Reddy Anam Vijaykumar Reddy
Chinthareddy Palem
Nellore, 524003

Official page of YSRCP leader Anam vijaykumar reddy. Ex.Chairperson SPSR NELLORE District Co-operat

KR REDDY . KR REDDY .
Vinjamur
Nellore, 524239

🇸🇱🇸🇱🇸🇱

yedupatikrishna yedupatikrishna
Nellore

YedupatiKrishna

Lakshmi narayana Lakshmi narayana
Srinivasa Agharam
Nellore, 524002

ᴀʟʟᴜʀᴜ ᴀɴɪʟ ʀᴇᴅᴅʏ ᴏғғɪᴄɪᴀʟ - ᴍᴘᴘ ᴀʟʟᴜʀᴜ ᴀɴɪʟ ʀᴇᴅᴅʏ ᴏғғɪᴄɪᴀʟ - ᴍᴘᴘ
Nellore

జగన్ అన్న కి అండగా సంజీవన్న కి తోడుగా

Polamreddy Dineshreddy Polamreddy Dineshreddy
Kovur
Nellore