Avbhakthi page
Bhakthinews, templesinformation, Pilgrimage service,Spiritualquestions,Devotionthings, E-poojas
https://www.youtube.com/live/DtHwWMSJFNg?si=RMmyv1qSky2FkUNP
15-02-2024 నూతన ద్వాజశస్థంభ ప్రతిష్ట కార్యక్రమ శ్రీ పృధ్వీశ్వర స్వామి వారి దేవస్థానం. @avbhakthi
శ్రీ గోదాదేవి కళ్యాణం - Sri Venkateswara Swamy Temple, Repalle.
శ్రీ గోదాదేవి కళ్యాణం - Sri Venkateswara Swamy Temple, Repalle.
https://youtube.com/live/1KY0xD6cHrk?si=6Ngob_0ZbkJyq_D4
కార్తీక సోమవారం అమృతేశ్వర స్వామి అన్నాభిషేకం LIVE PROGRAM AV Bhakthi Live
భక్తులకు విజ్ఞప్తి 🙏
శ్రీవారి ఆలయంలో మార్చి నుండి 6 నెలలపాటు స్వామివారి దర్శనం నిలుపుదల ప్రచారం అవాస్తవం
- భక్తులు నమ్మవద్దని టిటిడి విజ్ఞప్తి
- యధావిధిగా మూలమూర్తి దర్శనం : శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని ఆరు నెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు వాస్తవం కాదు.
ఈ అంశానికి సంబంధించిన వాస్తవ వివరాలను శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు తెలియజేశారు. టిటిడి ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు 2023, మార్చి1న తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. ముందుగా వారం రోజులపాటు బాలాలయ నిర్మాణానికి అవసరమైన వైదిక క్రతువులు నిర్వహిస్తారు. ఇందులోభాగంగా గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలాలయంలో ఏర్పాటు చేసే దారు(కొయ్య) శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహంలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపడతారు. ఇందుకోసం పట్టే ఆరు నెలల సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని భక్తులు యధావిధిగా దర్శించుకోవచ్చు. బాలాలయంలోని దారు విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. గర్భాలయంలో మూలమూర్తికి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. గర్భాలయంలో మూలమూర్తికి, బాలాలయంలోని దారు విగ్రహానికి ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలన్నీ యధావిధిగా జరుగుతాయి.
1957-58వ సంవత్సరంలో ఆనంద నిలయానికి బంగారు తాపడం జరిగిన సందర్భంలో, 2018వ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో బాలాలయం నిర్వహించిన సందర్భంలో ఉన్న రికార్డుల ప్రకారం భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం, ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర సేవలు నిర్వహించడం జరిగింది.
వాస్తవం ఇలా ఉండగా, కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో 6 నెలల పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం ఉండదని జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
-------------------------------------------
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.
*శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము*
కదిరి పట్టణము, శ్రీ సత్యసాయి జిల్లా.
* * * *
*వైకుంఠద్వారములో 02.01.2023 వతేది తెల్లవారుజామున 3.00 గంటల నుండి శ్రీవారి దర్శనము ప్రారంభమగును*
నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా వేలశియున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయము, చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రశిద్దిమైన వైష్ణవ క్షేత్రం.
ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భముగా ఆదివారం రాత్రి 1.30 ఆలయం తలుపులు తెరచి, శ్రీవారి పాత్రశుద్ది గావించి ధనుర్మాస కైంకర్యములు 2.00 గంటలకు పూర్తి చేసి ప్రాతః కాల నివేదన బలిహరణము పరివార దేవతామూర్తుల ఆరగింపుగావించి ఉత్తర, దక్షణ గోపురముల మంటప పుణ్యవాచనము, శ్రీవారిని తిరుచ్చియందు వేంచేపచేసి అలంకరణ గావించి ఉత్తర ద్వారములో శ్రీస్వామి వారి తెల్లవారుజామున 3.00 గంటలకు వేంచేయిపుచేసి మహామంగళ హారతి అనతరము భక్తులకు 3.30 గంటల తరువాత ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు ఏర్పాటు చేయడమైనది.
కావున యావన్మంది భక్తులు తెలియజేయునది ఏమనగా ముక్కోటి ఏకాదశి పండుగా సందర్భముగా శ్రీస్వామి వారిని దర్శించుకొనుటకు ఉచిత దర్శనము, పత్యేక దర్శనము క్యూలైన్లు వేరువేరుగా ఏర్పాటుచేయడమైనది. భక్తులందరూ తప్పని సరిగా మాస్క్ ధరించి శ్రీస్వామి వారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావలసినదిగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారుతో పాటు ఆలయ కమిటి ఛైర్మెన్ జెరిపిటి గోపాల క్రిష్ణ సంయుక్తముగా తెలపడమైనది.
హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు, హనుమంతుడు భక్తసులభుడు,
హనుమంతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు
అని వేదపండితులు తెలియజేస్తున్నారు.
అలాగే ఆంజనేయస్వామి నవ అవతారాలలో దర్శనం ఇస్తాడు.
ఆంజనేయస్వామి నవావతరాలు.
ప్రసన్నాంజనేయస్వామి,
వీరాంజనేయస్వామి,
వింశతి భుజ ఆంజనేయస్వామి,
పంచముఖ ఆంజనేయస్వామి,
అష్టాదశ భుజ ఆంజనేయస్వామి,
సువర్చల ఆంజనేయస్వామి,
చతుర్భుజ ఆంజనేయస్వామి,
ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి మరియు
వానరాకార ఆంజనేయస్వామి.
ఆంజనేయస్వామి నవావతారాలలో పంచముఖ ఆంజనేయస్వామి శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించాడు.
ఈ పంచముఖముల వివరాలను జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు.
తూర్పుముఖముగా హనుమంతుడు:
పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.
దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి,
దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి
గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి
జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని,
సంతానాన్ని ప్రసాదిస్తాడు.
ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి
సకల సంపదలు చేకూరుతాయి.
అలాగే ఆంజనేయ స్వామికి శ్రీరామజయం అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
(సేకరణ)
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the business
Telephone
Website
Address
Guntur
522259
14/3, Arundelpet
Guntur, 522002
మా ఈ పేజీ లో రాజకీయ సందడిలో జరిగే ఘటనలు, సినిమా, సంగీతం గురించి ఉంటాయి
Bharath Pet 0 Line, Sri Nagar Colony
Guntur, 522002
Desham TV is a newly emerged satellite channel in the galaxy of media for all the Telugu people wherever they reside.
AndhraPradesh
Guntur
Day to Day news Updates , songs lyrics , devotional related , sports , movies and entertainment rel
Nagaram Vill&post Nagaram Mandal. Guntur District.
Guntur
Senior journalist,Senior TDP State leader.
Brindavan Garden
Guntur, 522006
Hai Friends welcome to geetv telugunews this is an unique channel, here we make your geetv telugun
Guntur
The Reality behind the Various Colours of India,,, Let's work towards a Better India.....!!!