Vemireddy Prashanthi Reddy
Official page of Vemireddy Prashanthi Reddy
అలుపెరగని ప్రజా శ్రామికురాలిని గెలిపిద్దాం
అవినీతికి తావు లేని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. విడవలూరు మండలం వావిళ్ళ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న NDA కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి టీడీపీతో పాటు మిత్రపక్ష జనసేన, బిజెపి కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు. అవినీతితో పాటు నాయకుల నిర్లక్ష్యం గ్రామాల్లో అభివృద్ధికి ఆటంకమైందన్నారు. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఇసుక కొనాల్సిన అవసరం లేదని మన ప్రభుత్వం రాగానే ఉచితంగా ఇసుక దొరుకుతుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికీ సంక్షేమ ఫలాలు అందివ్వడంలో చంద్రబాబు నాయుడు గారికి ఎవరూ సాటి రానన్నారు. మీరందరు ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపిస్తే రానున్న అయిదేళ్లలో సమస్యల రహిత కోవూరు నియోజకవర్గంగా మారుస్తానన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి కై కృషి చేస్తానన్నారు. మీ అందరి సహకారం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పధకాలు ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. మీరందరూ ఆశీర్వదించి నన్ను కోవూరు శాసనసభ్యురాలిగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు
అభివృద్దే మన అజెండా : శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కోవూరు నియోజకవర్గం NDA కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. విడవలూరు మండల కేంద్రంలో ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. టిడిపితో పాటు మిత్ర పక్ష జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యాలయ ప్రారంభోత్సావంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ NDA మిత్రపక్షాలైన టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పరస్పర సమన్వయంతో ఐకమత్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇకపై కోవూరులో అవినీతి రహిత వివాద రాజకీయాలు చూస్తారన్నారు. అభివృద్దే మన అజెండా ఓటర్లను కలిసి సైకిల్ గుర్తు పై ఓట్లు వేయించి కోవూరు ఎమ్మెల్యేగా తనను నెల్లూరు ఎంపీగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించేందుకు కృషి చేయాలని నాయకులు మరియు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు
యువతకు 20 లక్షల ఉద్యోగాలు.. నిరుద్యోగులకు ప్రతి నెల 3000 భృతి !!
ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం - ప్రశాంతిరెడ్డి
ప్రజలకు సేవ చేసేందుకే తాము రాజకీయాల్లోకి వచ్చామని కోవూరు నియోజకవర్గ ఎన్‌డీఏ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు స్పష్టం చేశారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల ఉత్సాహం మధ్య, బాణసంచా చప్పుళ్లు, ప్రజల నీరాజనాల మధ్య బుచ్చిరెడ్డిపాలెంలోని కాగులపాడు, రేబాలలో ఆమె ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులను ఆప్యాయంగా పలకరిస్తూ.. చంద్రబాబు నాయుడుగారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి పాలకురాలిగా రాలేదని, సేవకురాలిగా మాత్రమే వచ్చానన్నారు. ఇదే నియోజకవర్గంలో ఏళ్లుగా పాలిస్తున్న వ్యక్తులు ఇంకా ఈ నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ది చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుగారు ఒక మహిళకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. ఓర్చుకోలేని వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, నియోజకవర్గం బాగు పడాలన్నా సీఎంగా నారా చంద్రబాబు నాయుడుగారికి చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితే వాలంటీర్లకు నెలకు 10 వేలు జీతం ఇస్తారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు 15 వందల రూపాయలు అందిస్తారన్నారు. పించను 4 వేలుకు పెంచుతారని, రైతన్నలకు ఆర్థిక సహాయం కింద 20 వేలు ఇస్తారన్నారు.
షాదీఖానా నిర్మిస్తాం...
రేబాలలో ముస్లింలకు సంబంధించి షాదీఖానాను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల కోసం స్థానికంగా కమ్యూనిటీ హాలును ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. పశ్చిమ హరిజనవాడలో నిర్మాణ దశలో ఉన్న చెన్నకేశవ స్వామివారి ఆలయాన్ని పునఃనిర్మించి అందింస్తానని చెప్పారు. అదేవిధంగా స్థానికంగా స్మశాన వాటికలో అన్ని వసతులు కల్పిస్తామని వివరించారు. పాతూరుకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని, దాన్ని తప్పకుండా మరమ్మతులు చేయించి ఇబ్బందులు తొలగిస్తామన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
పెద్దమసీదులో ప్రార్థనలు నిర్వహించిన ప్రశాంతిరెడ్డి
రంజాన్ పండుగను పురస్కరించుకుని కోవూరు నియోజకవర్గ ఎన్‌డీఏ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కాశింపాలెంలో ఉన్న పెద్ద మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముందుకు ప్రశాంతిరెడ్డిని నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు ఘనంగా సత్కరించారు. అనంతరం మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అల్లా కరుణ, ప్రేమ ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. అల్లా చూపిన మార్గంలో పయనించి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ముస్లి, మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బుచ్చి మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
పున్నూరు గ్రామంలో నీలిమ రెడ్డి గారి పర్యటన
తల్లిదండ్రుల గెలుపే లక్షంగా కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో నీలిమరెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ఎన్నికలో ఎంపీగా పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగారిని, కోవూరు నియోజకవర్గ యం.ఎల్.ఏ గా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని గెలిపించాలని అభ్యర్థించారు. అముల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి, వేయించి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. నిత్యం ప్రజాసేవలో ఉండే వేమిరెడ్డి దంపతులను ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
సైకిల్ గుర్తుకు ఓటు వేదం
మన ప్రశాంతమ్మను గెలిపిద్దాం
కోవూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను
జ్యోతిరావ్ ఫులే జీవితం ఆదర్శనీయం
- నివాళి అర్పించిన వేమిరెడ్డి దంపతులు, శ్రీధర్‌రెడ్డి, నారాయణ, అబ్దుల్ అజీజ్
- సంఘ సంస్కర్త పూలే భావితరాలకు మార్గదర్శకులు అన్న నేతలు
బడుగు బలహీన, వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి శ్రీ మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ ఎన్‌డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ప్రశాంతిరెడ్డి, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నివాళులు అర్పించారు. నెల్లూరులోని వి.పి.ఆర్ క్యాంప్ ఆఫీస్‌లో జ్యోతిరావ్ ఫులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు ఫులే చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఫులే జీవితం భావితరాలకు మార్గదర్శకమని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ గడపకు సంక్షేమం, ప్రతి గడపకు అభివృద్ది
ఇదే ఈ వేమిరెడ్డి నినాదం
దర్గాలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు
రంజాన్ పర్వదినం సందర్భంగా కోవూరు నియోజకవర్గ ఎన్‌డీఏ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిగారు కొడవలూరు మండలం దర్గాసంఘంలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ఛద్దర్‌ను అందించారు. రంజాన్ సందర్భంగా కోవూరు నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, ముస్లిం మైనార్టీ సోదరులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
..ప్రజా సంక్షేమం టీడీపీతోనే సాధ్యం..
కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలోని చమ్మన్ వీధిలో నీలిమరెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగారిని, కోవూరు నియోజకవర్గ యం.ఎల్.ఏ గా పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని మీ అముల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వచ్చేది మన చంద్రబాబునాయుడు గారి ప్రజా ప్రభుత్వమేనన్నారు. ఈ సందర్భంగా సూపర్ 6 పథకాల ఉపయోగాలను ప్రతి ఇంటికి వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్రమైన రంజాన్ పండుగ శుభాకాంక్షలు
ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో భారీ చేరికలు
- వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ముఖ్య నాయకులు
కోవూరు నియోజకవర్గంలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రోజుకో మండలం ఖాళీ అవుతుండగా.. బుధవారం బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీలో చేరారు. కోవూరు నియోజకవర్గ ఎన్‌డీఏ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సమక్షంలో, టీడీపీ ముఖ్య నాయకులు ఎంవీ శేషయ్య, సూరా శ్రీనివాసులురెడ్డి, హరికృష్ణ, టీఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణ్ ఆధ్వర్యంలో... చెన్నాయపాలేనికి చెందిన ముఖ్య నాయకులు కోవూరు మురళి, వల్లెపు రాజేష్, అచ్చి వెంకటేశ్వర్లు, వల్లెపు లక్ష్మయ్య, చెల్లి కృష్ణయ్య, వల్లెపు మల్లిఖార్జునయ్య, దేవళ్ల హజరత్తయ్య, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారితో మాజీ ఎంపీటీసీ ఫిరోజ్ ఖాన్, అజీజ్ ఖాన్, భాస్కర్, ఖాదర్ ఖాన్. హరి, అఫ్రోజ్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరగా.. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో త్వరలోనే వైసీపీ ఖాళీ అవుతుందని అన్నారు. పార్టీలో చేరినవారికి తప్పకుండా తగిన ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.
*ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో భారీ చేరికలు*
- వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ముఖ్య నాయకులు
కోవూరు నియోజకవర్గంలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రోజుకో మండలం ఖాళీ అవుతుండగా.. బుధవారం బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీలో చేరారు. కోవూరు నియోజకవర్గ ఎన్‌డీఏ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సమక్షంలో, టీడీపీ ముఖ్య నాయకులు ఎంవీ శేషయ్య, సూరా శ్రీనివాసులురెడ్డి, హరికృష్ణ, టీఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణ్ ఆధ్వర్యంలో... చెన్నాయపాలేనికి చెందిన ముఖ్య నాయకులు కోవూరు మురళి, వల్లెపు రాజేష్, అచ్చి వెంకటేశ్వర్లు, వల్లెపు లక్ష్మయ్య, చెల్లి కృష్ణయ్య, వల్లెపు మల్లిఖార్జునయ్య, దేవళ్ల హజరత్తయ్య, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారితో మాజీ ఎంపీటీసీ ఫిరోజ్ ఖాన్, అజీజ్ ఖాన్, భాస్కర్, ఖాదర్ ఖాన్. హరి, అఫ్రోజ్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరగా.. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో త్వరలోనే వైసీపీ ఖాళీ అవుతుందని అన్నారు. పార్టీలో చేరినవారికి తప్పకుండా తగిన ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.
ఎక్కడ చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి - ప్రశాంతిరెడ్డి
- సమస్యల పరిష్కారానికి ఈ ఎన్నికలే వేదిక
- ఏళ్ల తరబడి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈ నియోజకవర్గానికి ఏం చేశారు.?
- పోలంరెడ్డి దినేష్‌రెడ్డితో కలిసి ఇస్కపాలెంలో ఎన్నికల ప్రచారం
కోవూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని, ఏళ్ల తరబడి ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్నకుమార్ ఈ నియోజకవర్గానికి ఏం చేశారని కోవూరు నియోజకవర్గ ఎన్‌డీఏ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. అధికారం అనుభవించడం తప్ప ప్రజా సమస్యలు పట్టవా అని ఆమె ప్రశ్నించారు. కోవూరు నియోజకవర్గం ఇస్కపాలెంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ.. ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇస్కపాలెం పరిధిలో అర్హులుగా వుండి ఇళ్ళు రాని వారికి మన ప్రభుత్వం రాగానే వారందరికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇస్కపాలెం గ్రామంలో ఎప్పుడో పాతికేళ్ళ క్రితం వేసిన విద్యత్తు స్తంభాలు చాలా చోట్ల విరిగిపోయి, విద్యుత్ లైన్లు తెగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని, తప్పకుండా ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. గ్రామాలలో కొన్ని చోట్ల మంచినీటి సమస్య ప్రధానంగా వేధిస్తోందని, ఏడాది క్రితం ఈ ప్రాంతంలో కలుషిత నీళ్ళు తాగడంతో డయేరియా వ్యాధి సోకి గ్రామానికి గ్రామమే మంచాన పడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమ్మంత్రిగా కాగానే తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వంలో ఏ ఒక్కరు సుఖంగా లేరన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. నిజమైన అభివృద్ధి జరిగి ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే సైకిల్ గుర్తుపై ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగా గెలిపించాలని కోరారు.
ప్రజా క్షేత్రంలోకి వేమిరెడ్డి కుటుంబం..
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు పార్లమెంట్ ఎన్‌డీఏ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి కోసం మేము సైతం అంటూ కుమారుడు అర్జున్ రెడ్డి వారి సతీమని ఇషితరెడ్డి గారు, కుమార్తె నీలిమారెడ్డి గారు, అల్లుడు శ్రీనివాసులు రెడ్డి గారు వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సేవా మూర్తులైన వేమిరెడ్డి దంపతులు రాజకీయాలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేశారని, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలోకి రావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారిని, ప్రశాంతిరెడ్డిగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
అధికారంలోకి రాగానే దివ్యాంగులకి నెలకి 6000 పింఛన్ అందిస్తాము !
-- ప్రశాంతమ్మ రాకతో కొమరిక గ్రామంలో పండుగ వాతావరణం--
గ్రామానికి గ్రామమే కదిలొచ్చింది. టిడిపి, బిజెపి, జనసేన కార్యకర్తలు మేళ తాళాలతో స్వాగతం పలికారు. ప్రశాంతమ్మ రాకతో కొమరిక గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోవూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామస్థులు ఆడపడుచులా ఆదరించారు. మంగళ హారతులిస్తూ ఎదురెళ్లి ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అభివాదాలు చేస్తూ గ్రామమంతా తిరిగిన శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు స్థానిక సమస్యలపై గ్రామస్థులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు పట్టించుకోని సిట్టింగ్ ఎమ్మెల్యే నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రెండేళ్లకు ముందు వరదల సందర్భంగా ముదివర్తి పాలెం వద్ద పెన్నానది కరకట్ట తెగి నష్టపోయిన వరి, మరియు ఆక్వా రైతులకు నష్ట పరిహారంలో జరుగుతున్న జాప్యం పై ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ అధికారం లోనికి రాగానే కొమరిక గ్రామానికి సంబంధిన మైపాడు ముదివర్తిపాలెం లింక్ రోడ్లతో పాటు పెన్నానది పై కాజ్ వె నిర్మించడం ద్వారా తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆర్ టి సి బస్సుల్లో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెలా నాలుగు పెన్షన్ లాంటి సంక్షేమ పధకాల గురించి వివరించారు. కొమరిక పరిసర గ్రామాలలో ఎక్కడా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లేదని మీరందరి ఆశీర్వాదాలతో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే హెల్త్ షబ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ యిచ్చారు.
ప్రజా సేవ చేయాలన్న ధృడ సంకల్పం తో రాజకీయాలలోకి వచ్చానని మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ఓటు ద్వారా ఆశ్వీరదించాలని కోరారు. సైకిల్ గుర్తుపై ఓట్లేసి తనను కోవూరు ఎమ్మెల్యేగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు లోక్ సభ సభ్యులుగా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
దశాబ్దాలుగా పాతుకుపోయి కొవ్వూరు అభివృద్ధికి దూరం చేసిన నాయకులను ఓడిద్దాం, ప్రశాంతమ్మను గెలిపించి అభివృద్ధిని మొదలుపెడదాం
ఉద్యోగాలు కావాలంటే చంద్రబాబు రావాలి - ప్రశాంతి రెడ్డి
చదువుకున్న యువత ఉపాధి కోసం చెన్నై, బెంగుళూరు, హైద్రాబాద్ లకు వలస వెళ్ళే పరిస్థితి రాకుండా వుండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే ఏకైక పరిష్కారమని కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు. కోవూరు యువత ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ మై ఫస్ట్ వోట్ ఫర్ సిబిఎన్ అని యువకులందరూ కంకణం కట్టుకొని సైకిల్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారం లోనికి తీసుకొని రావాల్సిన బాధ్యత యువతపై ఉందని చెప్పారు.
వైసిపి నేతలకు కమీషన్లు చెల్లించుకోలేక ఆంధ్రప్రదేశ్ రాష్టం నుంచి అదాని డేటా సెంటర్, అమర్ రాజ బ్యాటరీల ఫ్యాక్టరీ, ఫ్రాక్లిన్ టెంపుల్ టెన్ లాంటి ఎన్నో మల్టీ నేషన్ కంపనీలు భయపడి వెళ్ళిపోయాయన్నారు. ప్రభుత్వమే దోపిడికి పాల్పడుతుంటే రాష్టం లో కొత్త పరిశ్రమలు వస్తాయా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితుల్లో మార్పు రావాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం వుందన్నారు. గత అయిదేళ్ళలో రాష్టంలో ఒక్క పరిశ్రమ లేదు. ఉద్యోగాల్లేక యువతరం నిరాశ నిసృహల్లో వుంది. వైసిపి పాలనలో యువతీ యువకుల భవిషత్తు అంధకారంగా మారిందని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలండర్ అన్నారు ఏమైంది. ఉపాధ్యాయుల భర్తీకి డిఎస్సీ అన్నారు ఏమైంది. యువతకు కనీసం నెలకు పది వేలు కూడా రాని వాలంటీర్ ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఇదేనా యువత పట్ల మీకున్న చిత్తశుద్ధి అంటూ ప్రభుత్వ విధానాలపై విరుచుకు పడ్డారు. నిరుద్యోగ యువతకు గతంలో మన చంద్రన్న ప్రభుత్వం నిరుద్యోగ భృతి యిస్తుంటే అడ్డుకున్న ప్రభుత్వాన్ని సాగనంపల్సిన అవసరం ఉందన్నారు. సైకిల్ గుర్తు పై ఓట్లు వేసి కోవూరు ఎమ్మెల్యేగా తనను, నెల్లూకు పార్లమెంట్ అభ్యర్ధిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
వాలంటీర్లకు రెట్టింపు జీతం
నెలకు రూ.5 వేల నుంచి, రూ.10 వేలకు పెంచుతూ హామీ ఇచ్చిన చంద్రబాబు గారు
వలసలతో బుచ్చిరెడ్డి పాలెం వైసిపి ఖాళీ అవుతోంది. ఇప్పటికే మండల స్థాయిలో నేతల్లో చాలామంది వైసిపి వదిలేసి సైకిలెక్కుతుంటే గ్రామ స్థాయి నాయకులు కూడా వాళ్ళ బాటనే నడుస్తూ ప్రశాంతమ్మ కు జై కొడుతూ పసుపు కండువాలు కప్పుకుంటున్నారు. బుచ్చిరెడ్డి పాలెం మండల టిడిపి కన్వీనర్ MV శేషయ్య, సూరా శ్రీనివాసులు రెడ్డి మరియు రాష్ట్ర టిడిపి ఎస్టీ సెల్ కార్యదర్శి చలంచర్ల సునీల్ నేతృత్వంలో కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు మరియు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయితీ పరిధిలోని రామచంద్రాపురానికి చెందిన సీనియర్ వైసిపి నేతలతో పాటు వందమందికి పైగా కార్యకర్తలకు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపి లో చేరిన మాజీ వైసిపి నాయకులు మాట్లాడుతూ ఇన్నాళ్లు ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్న అరాచకాలు చూసి సహించలేక తాము పార్టీ మారినట్లు పేర్కొన్నారు. అవినీతి అక్రమాలకు అలవాటు పడ్డ ప్రసన్న అభివృద్ధి విషయమే మరిచి పోయారన్నారు. సేవా దృక్పధంతో రాజకీయాల్లోకొచ్చిన ప్రశాంతమ్మను గెలిపించుకుంటే తమ ప్రాంతం అభివృద్ధి జరుగుతోందన్న నమ్మకంతో ప్రశాంతమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వివరించారు. నెల్లూరు ఎంపీగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగా శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు.
ఆడపడుచులు అందరూ నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డల భవిష్యత్తుకు బాధ్యతను నేను తీసుకుంటాను
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకునే ప్రజా ప్రతినిధులకు తగిన బుద్ది చెప్పాలని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పిలుపు నిచ్చారు. కోవూరు శాసనసభ NDA కూటమి ఉమ్మడి అభ్యర్థిని శ్రీమతి
ప్రశాంతి రెడ్డి గారు కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో టిడిపి జాతీయ అధికార ప్రతినిధి దినేష్ రెడ్డి గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ గత అయిదేళ్లుగా గ్రామాల్లో అభివృద్ధి స్తంభించి పోయిందన్నారు. గుంటలు పడ్డ రోడ్లు కలుషిత తాగునీళ్లు, డ్రైనేజి కాలువలు లేక మురికి నీళ్లతో కాలువలను తలపిస్తున్న వీధులు ప్రతి గ్రామంలో ఇదే దృశ్యం కనిపిస్తోందన్నారు. సైకిల్ గుర్తు పై ఓట్లేసి కోవూరు నియోజకవర్గం నుంచి తొలి మహిళా అభ్యర్థినిగా పోటీ చేస్తున్న తనను అలాగే నెల్లూరు పార్లమెంట్ ఆభర్దిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించ వలసిందిగా అభ్యర్థించారు. ఓటమి భయంతో మహిళనని కూడా చూడకుండా హేళనగా మాట్లాడుతున్న
ప్రసన్నకు తగిన శాస్తి చేయాలని ఇనమడుగు వాసులకు విజ్ఞప్తి చేశారు.
గ్రామీణ అభివృద్ధికి పెద్ద పీట వేసే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మనవి చేశారు. అవినీతిని తరిమి కొట్టి అభివృద్ధి చేసే వారికీ ఆదరించాలని శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు కోరారు.
నీచమైన రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటు - వేమిరెడ్డి దంపతులు
- వాళ్లు ఓడిపోతున్నారని తెలిసే మాపై దుష్ప్రచారం
- ఫేక్ ప్రచారాలను నమ్ముకున్న వైసిపి, నిత్యం అసత్య ప్రచారాలు చేస్తూ కాలం గడిపేస్తోంది.
- వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి, ప్రసన్నకు ఇద్దరికీ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
వైసిపి ఒక వికృత పార్టీ అని, ఆ పార్టీకి ఆ పార్టీ ముఖ్య నాయకులకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని నెల్లూరు పార్లమెంటు ఎన్ డి ఏ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు. నార్త్ రాజుపాలెం లో పలువురు ముఖ్య నాయకులు వైసిపి నుంచి టిడిపిలో చేరగా వారికి వేమిరెడ్డి దంపతులు వాటి కండువాలు వేసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ... వైసిపి నాయకులు విజయ సాయి రెడ్డి, ప్రసన్నకుమార్ రాజేంద్ర తదితరులు తమపై దుష్ప్రచారం చేస్తూ ఒక తప్పుడు ఆడియోను రిలీజ్ చేశారని దాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా చంద్రబాబునాయుడు గారు తనను ప్రకటించినప్పటి నుంచి ఇలాంటి ఫేక్ ప్రచారాలు అనేకం చేశారని వివరించారు. వైసీపీ పార్టీ బతుకే ఫేక్ ప్రచారాలపై ఆధారపడి ఉందని, ఈ ఫేక్ పార్టీని ఇంటికి సాగనంపే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు.
ఢిల్లీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి వచ్చిన విజయసాయిరెడ్డి జిల్లాకు ఏం చేశారో చెప్పి ఓట్లు అభ్యర్థించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తూ ఎన్నికలకు వెళ్ళడం సిగ్గుచేటని ఘాటుగా స్పందించారు.
ఒక మహిళ అభ్యర్థి కి ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే అది ఓర్చుకోలేక, ఓటమిని అంగీకరించలేక ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం ఎంత మాత్రం తగదని చెప్పారు.
మహిళలు యువకులు ఇలాంటి ఉన్మాద పార్టీకి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలి అన్నారు. విజయసాయిరెడ్డి ప్రసన్న విచక్షణ మరచి మాట్లాడుతున్నారని ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదని విమర్శించారు.
తాము ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చామని, నీతి నిజాయితీగా బతుకుతున్నామన్నారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పై పోటీకి సరైన నాయకుడే లేక వైజాగ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న విజయసాయిరెడ్డి.. ఈరోజు పిచ్చిపిచ్చి ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శిస్తున్నారన్నారు.
ఈ జిల్లాకు వైసిపి ఏం చేసిందో ప్రజలకు వివరించి ఓటు అడగాలని సవాల్ విసిరారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. మేము పార్టీ మారినప్పటి నుంచి వైసీపీ నాయకులు చీపు పాలిటిక్స్ ఆడుతున్నారన్నారు.
నిన్నటికి నిన్న మేము పార్టీ మారుతున్నట్టు ఒక దుష్ప్రచారం చేశారని ఈరోజు ఒక ఫేక్ ఆడియో విడుదల చేసి వికృతానందం పొందుతున్నారన్నారు.
ఓడిపోతారన్న భయంతోనే ఏవేవో ప్రచారం చేస్తున్నారన్నారు. విజయ సాయి రెడ్డి వయసుకు ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్లే చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
ఎన్నికలు ఎన్నికలు లాగే చేయాలని ఇంత దిగజారుడు తనం అవసరం లేదన్నారు.
హుందా రాజకీయాలు చేస్తేనే ప్రజలు హర్షిస్తారని, మీకు త్వరలోనే ప్రజలు సరైన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో భారీగా నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
బుచ్చిరెడ్డి పాళెం మండలం నాగమాంబాపురం గ్రామంలో వేమిరెడ్డి దంపతులకు అపూర్వ స్వాగతం..
ఎన్నికల ప్రచారంలో భాగంగా NDA కూటమి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు NDA కూటమి శాసనసభ అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లకు నాగమాంబాపురం గ్రామస్థులు ఆత్మీయ స్వాగతం పలికారు. టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి వేమిరెడ్డి దంపతులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నేను మాటల మనిషిని కాను. నా ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. సైకిల్ గుర్తు పై ఓట్లేసి కోవూరు ఎమ్మెల్యేగా శ్రీమతి ప్రశాంతి రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానన్నారు. నాకు నా శ్రీమతికి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించవలసిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ తాము పదవుల కోసం పదవులను అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం కోసం రాజకీయాలలోనికి రాలేదన్నారు. సంక్షేమం అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని సైకిల్ గుర్తుపై ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా కోరారు.
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the public figure
Address
Kovuru
Nellore
524137
Pichireddydonka, Kothur Village, Indkurpet Mandal
Nellore, 524314
Kovur Constituency YSR Congress Party Youth Wing Members and social media constituency co-convenor.
Chinthareddy Palem
Nellore, 524003
Official page of YSRCP leader Anam vijaykumar reddy. Ex.Chairperson SPSR NELLORE District Co-operat