VemireddyPrasanthireddy
politician
విపిఆర్ ఫౌండేషన్ చేస్తున్న కాలువ పూడిక తీత పనులకు రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు: వేమిరెడ్డి #CHAMUNDI విపిఆర్ ఫౌండేషన్ చేస్తున్న కాలువ పూడిక తీత పనులకు రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు: వేమిరెడ్డి ...
పెన్షన్ పంపిణీ ని విజయవంతం చేయండి - ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
- కోవూరు నియోజకవర్గ ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం
- అధికారులకు సూచనలు చేసిన ఎమ్మెల్యే
*ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ను కలిసిన ఎంపి వేమిరెడ్డి*
నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
గురువారం సాయంత్రం పలువురు లోక్సభ ఎంపీలతో ఢిల్లీలోని ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి హాజరైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.. ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ కు పుష్పగుచ్చం అందించి సత్కరించారు.
అనంతరం ఆయనతో విపిఆర్ గారు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన టిడిపి ఎంపీలు*
- భేటీలో పాల్గొన్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు
దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారితో టిడిపి ఎంపీలు, కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బుధవారం జరిగిన ఈ భేటీలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఎంపీలతో ప్రధాని మోడీ చర్చించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు, లోక్సభ స్పీకర్ ఎన్నికపై వారు మాట్లాడారు. భేటీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి టిడిపి ఎంపీలు, కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించి శాలువాతో సత్కరించారు.
*18వ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ వేమిరెడ్డి అభినందనలు*
18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లాకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక బుధవారం ఉదయం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నికయ్యారు. ఓం బిర్లా గారు వరుసగా రెండోసారి స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లోని స్పీకర్ చాంబర్‌లో ఓంబిర్లాను కలిసిన ఎంపీ వేమిరెడ్డి గారు... కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడుగారు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిగారితో కలసి అభినందనలు తెలియజేశారు. ఎంతో అనుభవం ఉన్న ఓంబిర్లా గారు స్పీకర్‌గా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు. సభ సజావుగా, సమర్థవంతంగా నడిపేందుకు తప్పకుండా ఆయన కృషి చేస్తారని ఆకాంక్షించారు.
*ఎంపీ వేమిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో కుటుంబ సభ్యులు*
నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పార్లమెంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేమిరెడ్డి గారి సతీమణి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, తనయులు అర్జున్ రెడ్డి గారు, కుటుంబ సభ్యులు హనీష్ గారు, నాయకులు రూప్ కుమార్ యాదవ్ గారు, దూరు కళ్యాణ్ రెడ్డి గారు, కోడూరు కమలాకర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..
శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం
*కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ప్రమాణస్వీకారానికి హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు, తనయులు అర్జున్‌రెడ్డిగారు.
*ఏ ఒక్క రైతూ సాగునీటి సమస్య ఎదుర్కోకూడదు - ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి*
కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఏ ఒక్క రైతు కూడా సాగునీటి సమస్య ఎదుర్కోకూడదని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిగారు అన్నారు. నెల్లూరులోని వి.పి.ఆర్ నివాసంలో కోవూరు నియోజవర్గంలోని అన్ని మండలాల ఇరిగేషన్ అధికారులతో ఆమె గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి గారు మాట్లాడుతూ.. నీటి కాలువల్లో కలుపు మొక్కలు తొలగించి నీటి పారుదలకు అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా జిల్లాలో వచ్చే వానలను దృష్టిలో పెట్టుకుని చెరువులను శుభ్రం చేయించాలని, ఎక్కడా నిర్లక్ష్యం వద్దని ఆదేశించారు. నియోజకవర్గవ్యాప్తంగా కేవలం 50 మంది మాత్రమే లష్కర్‌లు ఉన్నారని, వారి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి పరంగా ఏదైనా సమస్యలుంటే తప్పకుండా తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత రైనీ సీజన్లో భారీ వర్షాలు లేదా తుఫానులు లాంటి విపత్తులొస్తే ముందస్తుగా నియోజకవర్గ పరిధిలోని ఏ ఏ చెరువులు మరియు కాలువలకు తక్షణ మరమ్మతులు చేయాల్సి ఉంటుందన్నదానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధ్గిలో పంట పొలాలకు సాగునీరందించే విషయంలో ఎక్కడా అశ్రద్ద వద్దని సూచించారు.
అందరికి నమస్కారం🙏
మన నెల్లూరు లోకసభ (M.P) శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లతో మీరు తీసుకున్న ఫొటోస్ ఈ క్రింది QR-CODE స్కానర్ ద్వారా పొందగలరు...🙏
*ఉచిత విద్యను అందించడం సంతోషాన్నిస్తుంది - ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి*
వి.పి.ఆర్ విద్య పాఠశాల ద్వారా వందలాది మంది నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉచిత విద్యను అందించడం చాలా సంతోషాన్నిస్తుందని వి.పి.ఆర్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిగారు అన్నారు. 2024-2025 విద్యా సంవత్సరం సందర్భంగా వి.పి.ఆర్ విద్య పాఠశాలలో ఉచిత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యాసామాగ్రి కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె గురువారం పాల్గొని మాట్లాడారు. ముందుగా పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిగారికి పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, అధ్యాపక సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం సభా వేదికపైకి చేరుకున్న ఆమె.. విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.
వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వి.పి.ఆర్ విద్య పాఠశాల ద్వారా వందలాదిమంది నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారికి, తనకు చాలా సంతోషంగా ఉంటుందన్నారు. పాఠశాల ఆవరణలోకి వస్తేనే తమకు ఉన్న ఒత్తిడి అంతా మర్చిపోతామన్నారు. వి.పి.ఆర్ విద్య పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో 30 మంది పరీక్షలు రాస్తే 100 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. వారిలో 27 మంది విద్యార్థులు 500 మార్కులకుపైగా సాధించడం గర్వంగా ఉంటుందన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులపై వారి తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా, దేశానికి మంచి సేవలు అందించాలంటే క్రమశిక్షణ చాలా అవసరమన్నారు. ఈ సందర్భంగా నూతనంగా 6 వ తరగతికి ఎంపికైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో ఇంకా మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు బ్యాగులు, షూస్, యూనిఫాం, ఇతర విద్యాసామాగ్రితో కూడిన కిట్లను అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, పాఠశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీచాముండేశ్వరిదేవి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం:: ప్రశాంతి రెడ్డి CHAMUNDI TV శ్రీచాముండేశ్వరిదేవి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం:: ప్రశాంతి రెడ్డి CHAMUNDI TV
చాముండేశ్వరి అమ్మవారి ఆశీసులు అందరిపై ఉండాలి - ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
శక్తి స్వరూపిణి శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిగారు అన్నారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని ఆమె బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ప్రశాంతిరెడ్డిగారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రశాంతిరెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి సారెను అందించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిగారు మాట్లాడుతూ... అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి ఆశీసులు, ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. అమ్మవారి ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సకాలంలో వర్షాలు పడి కోవూరు నియోజకవర్గం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. ఎన్నికల సమయంలో గంగపట్నం గ్రామం తమకు చాలా మద్దతుగా నిలిచిందని, గ్రామం అంతా ఏకతాటిపైకి వచ్చి ఎన్నికల్లో ఘన విజయం అందించారన్నారు. గ్రామస్థుల సేవలు ఎన్నటికీ మర్చిపోలేమని, ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు పనిచేస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శాంతి భద్రతలు, మెరుగైన పారిశుధ్య నిర్వహణతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా అధికారులను ఆదేశించారు. చాముండేశ్వరి ఆలయాన్ని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిగారి సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు కూడా అమ్మవారి ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారని, ఆయన సహకారంతో అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో దువ్వూరు కల్యాణ్‌రెడ్డి,, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
టీడీపి నెల్లూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారి నివాసంలో బక్రీద్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ గారికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
కోవూరు నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీ మణులకు బక్రీద్ శుభాకాంక్షలు.
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Website
Address
Mini Bypass
Nellore
524001
Pichireddydonka, Kothur Village, Indkurpet Mandal
Nellore, 524314
Kovur Constituency YSR Congress Party Youth Wing Members and social media constituency co-convenor.
Chinthareddy Palem
Nellore, 524003
Official page of YSRCP leader Anam vijaykumar reddy. Ex.Chairperson SPSR NELLORE District Co-operat